| Author | Message | 
|       
 Kodibochu
 Kurra Bewarse
 Username: Kodibochu
 
 Post Number: 1491
 Registered: 04-2019
 Posted From: 99.10.95.165
 
 Rating: N/AVotes: 0 (Vote!)
 | | Posted on Thursday, December 12, 2019 - 8:49 pm: |       | 
 సతామదైన్యం వదనస్య శోభా |
 
 దీనత్వమును చూపకుండుటయే సత్పురుషుల ముఖమునకు భూషణము.
 | 
|       
 Kodibochu
 Kurra Bewarse
 Username: Kodibochu
 
 Post Number: 1490
 Registered: 04-2019
 Posted From: 99.10.95.165
 
 Rating: N/AVotes: 0 (Vote!)
 | | Posted on Thursday, December 12, 2019 - 8:49 pm: |       | 
 నక్రః స్వస్థానమాసాద్య
 గజేంద్రమపి కర్షతి |
 స ఏవ ప్రచ్యుతః స్థానాత్
 శునాపి పరిభూయతే ||
 
 మొసలి తన స్థానమైన నీటనున్నపుడు ఏనుగును లోపలికిలాగగలదు. ఆ స్థానమునుండి బయటకు వచ్చినచో ఒక కుక్క కూడ దానిని ఓడించగలదు.
 
 నీళ్ళలోన మొసలి నిగిడి యేనుగు బట్టు
 బయట కుక్క చేత భంగపడును
 స్థానబలిమి గాని తన బలిమిగాదయా
 విశ్వదాభిరామ వినురవేమ !
 | 
|       
 Kodibochu
 Kurra Bewarse
 Username: Kodibochu
 
 Post Number: 1489
 Registered: 04-2019
 Posted From: 99.10.95.165
 
 Rating: N/AVotes: 0 (Vote!)
 | | Posted on Thursday, December 12, 2019 - 8:49 pm: |       | 
 అవివేకిని భూపాలే
 నశ్యంతి గుణినాం గుణాః |
 
 రాజు అవివేకి అయినచో
 గుణవంతుల సద్గుణములూ నశించును.
 | 
|       
 Kodibochu
 Kurra Bewarse
 Username: Kodibochu
 
 Post Number: 1488
 Registered: 04-2019
 Posted From: 99.10.95.165
 
 Rating: N/AVotes: 0 (Vote!)
 | | Posted on Thursday, December 12, 2019 - 8:48 pm: |       | 
 గుణదోషౌ బుధో గృహ్ణన్
 ఇందుక్ష్వేడావివేశ్వరః |
 శిరసా ధార్యతే పూర్వం
 పరం కంఠే నియచ్ఛతి ||
 
 ఈశ్వరుడు చందురుని తల మీద పెట్టుకొని (గొప్పగా) ప్రదర్శిస్తూ, విషమును గొంతులో ధరించి మరుగు చేయునట్టు, విద్వాంసుడు ఇతరుల గుణములను పొగడుతాడు; దోషములను ఎత్తి చూపకుండా తనలోనే దాచుకొంటాడు.
 | 
|       
 Kodibochu
 Kurra Bewarse
 Username: Kodibochu
 
 Post Number: 1487
 Registered: 04-2019
 Posted From: 99.10.95.165
 
 Rating: N/AVotes: 0 (Vote!)
 | | Posted on Thursday, December 12, 2019 - 8:48 pm: |       | 
 ఏకస్తపో ద్విరధ్యాయీ |
 
 ఏకాగ్రతను సాధించుటకు తపస్సును ఒక్కడే చేయవలెను; అధ్యయనమునకు ఇద్దరు ఉండవలెను.
 | 
|       
 Kodibochu
 Kurra Bewarse
 Username: Kodibochu
 
 Post Number: 1486
 Registered: 04-2019
 Posted From: 99.10.95.165
 
 Rating: N/AVotes: 0 (Vote!)
 | | Posted on Thursday, December 12, 2019 - 8:48 pm: |       | 
 దివసకరః ఖలు తీక్ష్ణో
 దివసకరాత్ పావకో మహాతీక్ష్ణః |
 దివసకరపావకాభ్యాం
 దుర్జనవచనాని తీక్ష్ణాని ||
 
 సుందరపాండ్య విరచిత "నీతిద్విషష్టిక"కు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారి తెలిఁగింపు:
 
 వేవెలుంగు వేఁడి, వేవెలుగునకంటెఁ
 బావకుండు వేఁడి పట్టిచూడ;
 వేవెలుంగుకంటెఁ బావకుకంటె దు-
 ర్జనుల నోటిమాట చాల వేఁడి.
 
 సూర్యుని ఎండ తీక్ష్ణమైనది. సూర్యుని ఎండ కన్న నిప్పు మరింత తీక్ష్ణమైనది. ఎండ, నిప్పు కన్ననూ దుష్టుల మాటలు అతి తీక్ష్ణమైనవి.
 | 
|       
 Kodibochu
 Kurra Bewarse
 Username: Kodibochu
 
 Post Number: 1485
 Registered: 04-2019
 Posted From: 99.10.95.165
 
 Rating: N/AVotes: 0 (Vote!)
 | | Posted on Thursday, December 12, 2019 - 8:47 pm: |       | 
 ఫలిష్యతీతి విశ్వాసః
 ప్రథమం కార్యలక్షణమ్ |
 
 (మున్ముందు) ఫలించునను విశ్వాసమే కార్యమును సాధించు మొదటి లక్షణము.
 | 
|       
 Kodibochu
 Kurra Bewarse
 Username: Kodibochu
 
 Post Number: 1484
 Registered: 04-2019
 Posted From: 99.10.95.165
 
 Rating: N/AVotes: 0 (Vote!)
 | | Posted on Thursday, December 12, 2019 - 8:47 pm: |       | 
 సద్భిస్తు లీలయా ప్రోక్తం
 శిలాలిఖితమక్షరమ్ |
 అసద్భిః శపథేనోక్తం
 జలే లిఖితమక్షరమ్ ||
 
 ఉత్తములు అవలీలగా పలికిన మాటలూ శిలాశానమువలె శాశ్వతము. నీచుల మాటలు ప్రమాణము చేసి చెప్పిననూ నీటి మీద వ్రాసిన అక్షరములవలె క్షణికము.
 | 
|       
 Kodibochu
 Kurra Bewarse
 Username: Kodibochu
 
 Post Number: 1483
 Registered: 04-2019
 Posted From: 99.10.95.165
 
 Rating: N/AVotes: 0 (Vote!)
 | | Posted on Thursday, December 12, 2019 - 8:47 pm: |       | 
 జితేంద్రియో హి శక్నోతి
 వశే స్థాపయితుం ప్రజాః |
 
 జితేంద్రియుడైన రాజు మాత్రమే ప్రజలను తన వశములో పెట్టుకొనుటకు సమర్థుడు.
 | 
|       
 Kodibochu
 Kurra Bewarse
 Username: Kodibochu
 
 Post Number: 1482
 Registered: 04-2019
 Posted From: 99.10.95.165
 
 Rating: N/AVotes: 0 (Vote!)
 | | Posted on Thursday, December 12, 2019 - 8:46 pm: |       | 
 శైలే శైలే న మాణిక్యం
 శుక్తౌ శుక్తౌ న మౌక్తికమ్ |
 సాధవో న హి సర్వత్ర
 చందనం న వనే వనే ||
 
 పర్వతములన్నింటిలోనూ మాణిక్యములుండవు. చిప్ప చిప్పలోనూ ముత్యములుండవు. అన్ని వనములలోనూ చందనపు చెట్టులుండవు. అటులనే సత్పురుషులు ఎల్లెడెలా దొరకరు!
 | 
|       
 Kodibochu
 Kurra Bewarse
 Username: Kodibochu
 
 Post Number: 1481
 Registered: 04-2019
 Posted From: 99.10.95.165
 
 Rating: N/AVotes: 0 (Vote!)
 | | Posted on Thursday, December 12, 2019 - 8:46 pm: |       | 
 వృథా వృష్టిః సముద్రేషు
 వృథా తృప్తస్య భోజనమ్ |
 వృథా దానం సమర్థేభ్యో
 వృథా దీపో దివాపి చ ||
 
 సముద్రమునందు వర్షించుట వ్యర్థము. కడుపు నిండి తృప్తితో వున్నవానికి భోజనము వ్యర్థము. సంపాదించు సమర్థత ఉన్నవాడికి దానము చేయుట వ్యర్థము. పగటి పూట దీపము వ్యర్థము.
 | 
|       
 Kodibochu
 Kurra Bewarse
 Username: Kodibochu
 
 Post Number: 1480
 Registered: 04-2019
 Posted From: 99.10.95.165
 
 Rating: N/AVotes: 0 (Vote!)
 | | Posted on Thursday, December 12, 2019 - 8:45 pm: |       | 
 గుణశతమర్థితా హరతి |
 
 యాచించుట శతాధిక గుణములనూ
 హరించును.
 | 
|       
 Kodibochu
 Kurra Bewarse
 Username: Kodibochu
 
 Post Number: 1479
 Registered: 04-2019
 Posted From: 99.10.95.165
 
 Rating: N/AVotes: 0 (Vote!)
 | | Posted on Thursday, December 12, 2019 - 8:45 pm: |       | 
 మూర్ఖేషు కుశలమానిషు
 విజానతాఽప్యకుశలేన భవితవ్యమ్ |
 విపులమపి కథితమర్థం
 మూర్ఖాః మోహాదపహసంతి ||
 
 సుందరపాండ్య విరచిత నీతిద్విషష్టిక'కు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారి తెలిఁగింపు:
 
 ఎఱుకగలవారమనుకొను మొఱకువారి
 నడుమ జాణయు మొఱకయి నడవవలయు;
 ఎంత వివరించి చెప్పినయేని వారి-
 కొదవఁజాలదు తెలివి, నవ్వుదురు గాని.
 
 తామే తెలివైనవారని భావించు మూర్ఖులయెడ అంతయు ఎరిగినవాడూ మూర్ఖునివలె ప్రవర్తించవలెను. ఏలయన, మూర్ఖులు మంచి విషయములు తెలిపిననూ, అజ్ఞానముతో అపహాస్యము చేయుదురు.
 | 
|       
 Kodibochu
 Kurra Bewarse
 Username: Kodibochu
 
 Post Number: 1478
 Registered: 04-2019
 Posted From: 99.10.95.165
 
 Rating: N/AVotes: 0 (Vote!)
 | | Posted on Thursday, December 12, 2019 - 8:45 pm: |       | 
 అసాధుః సాధుర్వా
 హరతి మహిమానం జనరవః |
 
 అబద్ధమో, నిజమో లోకాపవాదము ఘనతకు చేటు కలిగించును.
 | 
|       
 Kodibochu
 Kurra Bewarse
 Username: Kodibochu
 
 Post Number: 1477
 Registered: 04-2019
 Posted From: 99.10.95.165
 
 Rating: N/AVotes: 0 (Vote!)
 | | Posted on Thursday, December 12, 2019 - 8:44 pm: |       | 
 క్షమయా దయయా ప్రేమ్ణా
 సూనృతేనార్జవేన చ |
 వశీకుర్యాత్ జగత్ సర్వం
 వినయేన చ సేవయా ||
 
 క్షమ, దయ, ప్రేమ, మంచిమాటలు, సత్యసంధత, వినయము మరియు సేవ వీటితో ప్రపంచమంతటినీ వశపరచుకొనవలయును.
 | 
|       
 Kodibochu
 Kurra Bewarse
 Username: Kodibochu
 
 Post Number: 1476
 Registered: 04-2019
 Posted From: 99.10.95.165
 
 Rating: N/AVotes: 0 (Vote!)
 | | Posted on Thursday, December 12, 2019 - 8:44 pm: |       | 
 పతంతః స్వయం అన్యేషాం నహి
 హస్తావలంబనం దదతే |
 
 తానే పడుచున్నవాడు ఇతరుల చేయి పట్టి పైకి లాగలేడు.
 | 
|       
 Kodibochu
 Kurra Bewarse
 Username: Kodibochu
 
 Post Number: 1475
 Registered: 04-2019
 Posted From: 99.10.95.165
 
 Rating: N/AVotes: 0 (Vote!)
 | | Posted on Thursday, December 12, 2019 - 8:44 pm: |       | 
 అసహాయః పుమానేకః
 కార్యాంతం నాధిగచ్ఛతి |
 తుషేణాపి వినిర్ముక్తః
 తండులో న ప్రరోహతి||
 
 సహాయము లేనిదే ఒంటరిగా ఎవరూ కార్యములను సాధించ లేరు. పొట్టు లేకుండగనే వరి గింజ వెలువడదు కదా!.
 | 
|       
 Kodibochu
 Kurra Bewarse
 Username: Kodibochu
 
 Post Number: 1474
 Registered: 04-2019
 Posted From: 99.10.95.165
 
 Rating: N/AVotes: 0 (Vote!)
 | | Posted on Thursday, December 12, 2019 - 8:44 pm: |       | 
 చపలా రసనా నిత్యం
 ఆర్ద్రస్థలనివాసినీ |
 స్ఖలత్యేవ సుఖం తస్మాత్
 తాం ధీదామ్నా నిబంధయేత్ ||
 
 ఎల్లప్పుడూ తడిగా వుండు చోట ఉన్నందువలన చంచల స్వభావము కల నాలుక ఇంకనూ సులభముగా జారును. దానిని వివేకమను పగ్గముతో నియంత్రించవలెను.
 | 
|       
 Musicfan
 Bewarse Legend
 Username: Musicfan
 
 Post Number: 69502
 Registered: 05-2004
 Posted From: 68.43.244.96
 
 Rating: N/AVotes: 0 (Vote!)
 | | Posted on Sunday, November 24, 2019 - 9:35 pm: |       | 
 
 Kodibochu:
 
 
 Aithe vakey
 Sye Raa Audio Review
 | 
|       
 Kodibochu
 Kurra Bewarse
 Username: Kodibochu
 
 Post Number: 1356
 Registered: 04-2019
 Posted From: 99.10.95.165
 
 Rating: N/AVotes: 0 (Vote!)
 | | Posted on Sunday, November 24, 2019 - 9:32 pm: |       | 
 
 Musicfan:
 , ivanni evaraina pamputunnaraa meeku??  
 
 WhatsApp lo okaayana pamputhaadu. Naaku antha scene ledu.
  | 
|       
 Musicfan
 Bewarse Legend
 Username: Musicfan
 
 Post Number: 69501
 Registered: 05-2004
 Posted From: 68.43.244.96
 
 Rating: N/AVotes: 0 (Vote!)
 | | Posted on Sunday, November 24, 2019 - 9:20 pm: |       | 
 
 Kodibochu:
 ప్రాయేణ గృహిణీనేత్రాః 
 
 
 idi kumara sambhavam lonidi,, ivanni evaraina pamputunnaraa meeku?? or you are compiling them reading books?
 Sye Raa Audio Review
 | 
|       
 Kodibochu
 Kurra Bewarse
 Username: Kodibochu
 
 Post Number: 1355
 Registered: 04-2019
 Posted From: 99.10.95.165
 
 Rating: N/AVotes: 0 (Vote!)
 | | Posted on Sunday, November 24, 2019 - 8:37 pm: |       | 
 ప్రాయేణ గృహిణీనేత్రాః
 కన్యార్థేషు కుటుంబినః |
 
 సామాన్యముగా కన్యాదాన విషయమున ఇల్లాలి మాటయే ప్రధానము.
 | 
|       
 Kodibochu
 Kurra Bewarse
 Username: Kodibochu
 
 Post Number: 1351
 Registered: 04-2019
 Posted From: 99.10.95.165
 
 Rating: N/AVotes: 0 (Vote!)
 | | Posted on Saturday, November 23, 2019 - 4:48 am: |       | 
 నిందాం యః కురుతే సాధోః
 తథా స్వం దూషయత్యసౌ |
 ఖే భూతిం యః క్షిపేదుచ్చైః
 మూర్ధ్ని తస్యైవ సా పతేత్ ||
 
 మంచివారిని తూలనాడువాడు తన్ను తానే నిందించుకొనును. ఆకసమునకు విసిరిన బూది వాడి తల మీదనే పడును.
 | 
|       
 Kodibochu
 Kurra Bewarse
 Username: Kodibochu
 
 Post Number: 1350
 Registered: 04-2019
 Posted From: 99.10.95.165
 
 Rating: N/AVotes: 0 (Vote!)
 | | Posted on Saturday, November 23, 2019 - 4:48 am: |       | 
 నాత్మచ్ఛందేన భూతానాం
 జీవితం మరణం తథా |
 
 బ్రతుకు-చావులు జీవులకు తమ ఇచ్ఛానుసారంగా జరుగవు.
 | 
|       
 Kodibochu
 Kurra Bewarse
 Username: Kodibochu
 
 Post Number: 1349
 Registered: 04-2019
 Posted From: 99.10.95.165
 
 Rating: N/AVotes: 0 (Vote!)
 | | Posted on Saturday, November 23, 2019 - 4:47 am: |       | 
 మా వనం ఛింది సవ్యాఘ్రం
 మా వ్యాఘ్రానీనశన్ వనాత్ |
 వనం హి రక్ష్యతే వ్యాఘ్రైః
 వ్యాఘ్రాన్ రక్షతి కాననమ్ ||
 
 పులులు వున్న అడవిని పాడుచేయవలదు. అడవిలోని పులులను చంపవలదు. అడవి పులులను రక్షించును, పులులు అడవిని రక్షించును.
 | 
|       
 Kodibochu
 Kurra Bewarse
 Username: Kodibochu
 
 Post Number: 1348
 Registered: 04-2019
 Posted From: 99.10.95.165
 
 Rating: N/AVotes: 0 (Vote!)
 | | Posted on Saturday, November 23, 2019 - 4:47 am: |       | 
 సర్వథా ధర్మమూలోsర్థో
 ధర్మశ్చార్థపరిగ్రహః |
 ఇతరేతరయోర్నిత్యౌ విద్ధి
 మేఘోదధీ యథా  ||
 
 ఎల్లపుడు అర్థమునకు ధర్మము యొక్క మూలాధారము వుండవలెను. ధర్మమునకు సముచితమైన ఉద్దేశము వుండవలెను. మేఘము మరియు కడలి పరస్పరము అవలంబితులై వుండునటుల ధర్మార్థములు.
 | 
|       
 Kodibochu
 Kurra Bewarse
 Username: Kodibochu
 
 Post Number: 1347
 Registered: 04-2019
 Posted From: 99.10.95.165
 
 Rating: N/AVotes: 0 (Vote!)
 | | Posted on Saturday, November 23, 2019 - 4:47 am: |       | 
 నిష్ణాతోsపి చ వేదాంతే
 సాధుత్వం నైతి దుర్జనః |
 
 వేదాంతమున ఎంత నిపుణుడయిననూ చెడు స్వభావము గలవాడు మంచివాడు కాలేడు.
 | 
|       
 Kodibochu
 Kurra Bewarse
 Username: Kodibochu
 
 Post Number: 1289
 Registered: 04-2019
 Posted From: 99.10.95.165
 
 Rating: N/AVotes: 0 (Vote!)
 | | Posted on Monday, November 11, 2019 - 5:29 am: |       | 
 క్షణే క్షణే యన్నవతాముపైతి
 తదేవ రూపం రమణీయతాయాః  |
 
 అనుక్షణమూ క్రొత్తగా కనబడుటయే
 నిజమైన సౌందర్యము యొక్క లక్షణము.
 | 
|       
 Kodibochu
 Kurra Bewarse
 Username: Kodibochu
 
 Post Number: 1288
 Registered: 04-2019
 Posted From: 99.10.95.165
 
 Rating: N/AVotes: 0 (Vote!)
 | | Posted on Sunday, November 10, 2019 - 8:18 am: |       | 
 స్వాధీనే మాధుర్యే
 మధురాక్షరసంహితేషు వాక్యేషు |
 కిం నామ సత్త్వవంతః
 పురుషాః పరుషాక్షరాణి భాషంతే ||
 
 రమ్యమైన యక్కరముల మాటలఁ దీపు
 తమకు వసముగాఁగ నమరియుండ,
 సత్త్వశాలులైన జనులాడనేలొకో
 పరుషవాక్యములను బరులతోడ!
 
 ఇంపైన అక్షరములతో రచింపబడిన వాక్యములున్నపుడు, పలుకుల మాధుర్యము వాటిని పలుకువాని వశముననున్నపుడు సత్త్వశాలులైన జనులు పరుషముగ ఏల మాటలాడెదరు?
 | 
|       
 Kodibochu
 Kurra Bewarse
 Username: Kodibochu
 
 Post Number: 1287
 Registered: 04-2019
 Posted From: 99.10.95.165
 
 Rating: N/AVotes: 0 (Vote!)
 | | Posted on Sunday, November 10, 2019 - 8:17 am: |       | 
 నిఃసారస్య పదార్థస్య
 ప్రాయేణాడంబరో మహాన్ |
 
 నిస్సారమైన వస్తువుకు
 ఆడంబరమే మిక్కుటము.
 | 
|       
 Kodibochu
 Kurra Bewarse
 Username: Kodibochu
 
 Post Number: 1286
 Registered: 04-2019
 Posted From: 99.10.95.165
 
 Rating: N/AVotes: 0 (Vote!)
 | | Posted on Sunday, November 10, 2019 - 8:17 am: |       | 
 హేమ హేమ్న్యూర్మికాం చ
 త్వం గృహాణేత్యుధితో యది  |
 యద్దీయతే సోర్మికేణ
 తత్తదస్తి న సంశయః ||
 
 వ్యాపారి బంగారము యొక్క బరువుకూ, వన్నెకూ తగినంత విలువనిచ్చును గానీ, ఆభరణము యొక్క రూపమునకు కాదు. అటులనే ప్రపంచములో క్రయవిక్రయాది వ్యవహారములలో వస్తువు యొక్క గుణసత్వము, నాణ్యతకు విలువ ఉండును కానీ రూపమునకు, పేరుకూ విలువ వుండదు.
 | 
|       
 Kodibochu
 Kurra Bewarse
 Username: Kodibochu
 
 Post Number: 1285
 Registered: 04-2019
 Posted From: 99.10.95.165
 
 Rating: N/AVotes: 0 (Vote!)
 | | Posted on Sunday, November 10, 2019 - 8:17 am: |       | 
 దేవో భూత్వా యజేద్దేవాన్
 నాదేవో దేవమర్చయేత్ |
 
 సాధకుడు పూజించునపుడు తనలో దేవుణ్ణి భావించుకొనవలయును. దేవుడు కానివాడు దేవతలను పూజించరాదు.
 | 
|       
 Kodibochu
 Kurra Bewarse
 Username: Kodibochu
 
 Post Number: 1284
 Registered: 04-2019
 Posted From: 99.10.95.165
 
 Rating: N/AVotes: 0 (Vote!)
 | | Posted on Sunday, November 10, 2019 - 8:16 am: |       | 
 క్షుధి కదశనమపి నితరాం
 భోక్తుః సంపద్యతే స్వాదు |
 
 ఆకలిగొన్నపుడు పాసిన ఆహారమూ రుచిగనేయుండును.
 | 
|       
 Kodibochu
 Kurra Bewarse
 Username: Kodibochu
 
 Post Number: 1283
 Registered: 04-2019
 Posted From: 99.10.95.165
 
 Rating: N/AVotes: 0 (Vote!)
 | | Posted on Sunday, November 10, 2019 - 8:16 am: |       | 
 న హి వక్తా మృదువక్తా
 విమృశ్యవక్తా న చాపి బహువక్తా |
 ఋతవక్తా గుణవక్తా
 హితవక్తా దుర్లభః పురుషః ||
 
 సుందరపాండ్య విరచిత నీతిద్విషష్టిక'కు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారి తెలిఁగింపు:
 
 మృదువుమాట మాటయే కాదు; పరికించి
 యాడువాఁడు పెక్కులాడఁబోడు;
 ఋతము సెప్పువాఁడు హితము సెప్పెడివాఁడు
 గుణము సెప్పువాడుఁ గోటికొకఁడు.
 
 మాటలాడువారెల్లరూ మృదువుగా మాటలాడరు. పెక్కు మాటలాడువారు పరికించి మాటలాడరు. సత్యమును పలుకునట్టి, విలువగల మాటలాడునట్టి, హితమును చెప్పునట్టి మనిషి చాల అరుదు.
 | 
|       
 Kodibochu
 Kurra Bewarse
 Username: Kodibochu
 
 Post Number: 1282
 Registered: 04-2019
 Posted From: 99.10.95.165
 
 Rating: N/AVotes: 0 (Vote!)
 | | Posted on Saturday, November 09, 2019 - 9:28 am: |       | 
 మలినో హి యథాssదర్శో
 రూపాలోకస్య న క్షమః |
 తథాsవిపక్వకరణ
 ఆత్మజ్ఞానస్య న క్షమః ||
 
 అద్దం మీద దుమ్ము కమ్ముకొన్నచో అందులో రూపమును చూచుటకు మనకు ఎటుల సాధ్యము కాదో, అటులనే ఇంద్రియముల రాగద్వేషాది దోషములతో మలినమైన మనిషి ఆత్మజ్ఞానమునకు సమర్థుడు కాడు.
 | 
|       
 Kodibochu
 Kurra Bewarse
 Username: Kodibochu
 
 Post Number: 1281
 Registered: 04-2019
 Posted From: 99.10.95.165
 
 Rating: N/AVotes: 0 (Vote!)
 | | Posted on Saturday, November 09, 2019 - 9:28 am: |       | 
 సర్వత్ర సంశయానేషు న కార్యసిద్ధిః |
 
 ఎల్లడెలా అనుమానపడువారికి కార్యసిద్ధి కలుగదు.
 | 
|       
 Kodibochu
 Kurra Bewarse
 Username: Kodibochu
 
 Post Number: 1280
 Registered: 04-2019
 Posted From: 99.10.95.165
 
 Rating: N/AVotes: 0 (Vote!)
 | | Posted on Friday, November 08, 2019 - 8:35 pm: |       | 
 స్వభావసుందరం వస్తు
 న సంస్కారమపేక్షతే |
 
 సహజ సుందరమైన వస్తువుకు మరల సంస్కారము అక్కరలేదు.
 | 
|       
 Kodibochu
 Kurra Bewarse
 Username: Kodibochu
 
 Post Number: 1279
 Registered: 04-2019
 Posted From: 99.10.95.165
 
 Rating: N/AVotes: 0 (Vote!)
 | | Posted on Friday, November 08, 2019 - 10:41 am: |       | 
 అల్పాక్షరరమణీయం
 యః కథయతి నిశ్చితం స వై వాగ్మీ |
 బహువచనమల్పసారం
 యః కథయతి విప్రలాపీ సః ||
 
 వినువారికి హితమగునటుల సంక్షిప్తముగా ఎవడు పలుకునో వాడే నిక్కముగ వాగ్మి; ఎక్కువ మాటలాడి అల్పమైన అర్థమునిచ్చువాడు వదరుబోతు మాత్రమే.
 | 
|       
 Kodibochu
 Kurra Bewarse
 Username: Kodibochu
 
 Post Number: 1278
 Registered: 04-2019
 Posted From: 99.10.95.165
 
 Rating: N/AVotes: 0 (Vote!)
 | | Posted on Friday, November 08, 2019 - 10:41 am: |       | 
 ఈర్ష్యా హి వివేకపరిపంథినీ |
 
 అసూయ వివేకము యొక్క శత్రువు.
 | 
|       
 Kodibochu
 Kurra Bewarse
 Username: Kodibochu
 
 Post Number: 1277
 Registered: 04-2019
 Posted From: 99.10.95.165
 
 Rating: N/AVotes: 0 (Vote!)
 | | Posted on Friday, November 08, 2019 - 10:40 am: |       | 
 
 Telugustudio:
 Super 
 
 Naa sontha colleciton kaadu. Yevaro okaayana Whats app lo roju ki okai pampisthu vuntaadu. Nenu just copy and paste chesthunnaa.
  | 
|       
 Kodibochu
 Kurra Bewarse
 Username: Kodibochu
 
 Post Number: 1276
 Registered: 04-2019
 Posted From: 99.10.95.165
 
 Rating: N/AVotes: 0 (Vote!)
 | | Posted on Friday, November 08, 2019 - 10:39 am: |       | 
 కేషాంచిద్ వాచి శుకవత్
 కేషాంచిద్ హృది మూకవత్ |
 హృది వాచి తథాన్యేషాం
 వల్గు వల్గంతి సూక్తయః ||
 
 కొందరికి చిలుక పలుకులవలె మాటలలో మాత్రమే సూక్తులు. కొందరికి మూగవారివలె మనసులోనే సుభాషితములు. ఇతరులకు పలుకులలోనూ, హృదయములోనూ చక్కగా వెలువడు మంచిమాటలు!
 | 
|       
 Telugustudio
 Mudiripoyina Bewarse
 Username: Telugustudio
 
 Post Number: 11821
 Registered: 07-2009
 Posted From: 83.251.202.141
 
 Rating: N/AVotes: 0 (Vote!)
 | | Posted on Friday, November 08, 2019 - 1:13 am: |       | 
 Super
 
   | 
|       
 Kodibochu
 Kurra Bewarse
 Username: Kodibochu
 
 Post Number: 1275
 Registered: 04-2019
 Posted From: 99.10.95.165
 
 Rating: N/AVotes: 0 (Vote!)
 | | Posted on Thursday, November 07, 2019 - 8:49 pm: |       | 
 సర్వజ్ఞస్యాప్యేకాకినో
 నిర్ణయాభ్యుపగమో దోషాయ |
 
 సర్వజ్ఞుడే అయిననూ, పరికించక ప్రతివాదియొక్క సిద్ధాంతమును ఒప్పకొననియెడల అది దోషయుక్తమగును.
 | 
|       
 Kodibochu
 Kurra Bewarse
 Username: Kodibochu
 
 Post Number: 1274
 Registered: 04-2019
 Posted From: 99.10.95.165
 
 Rating: N/AVotes: 0 (Vote!)
 | | Posted on Thursday, November 07, 2019 - 8:49 pm: |       | 
 అర్థానామార్జనం కార్యం
 వర్ధనం రక్షణం తథా |
 భక్ష్యమాణో నిరాదాయః
 సుమేరురపి హీయతే ||
 
 డబ్బును సంపాదించవలెను. అంతే కాదు, దానిని పెంపొందిచవలెను మరియు కాపాడవలెను. అదాయము లేకుండ తినుచున్నచో, మేరుపర్వతమూ కరగిపోవును.
 | 
|       
 Kodibochu
 Kurra Bewarse
 Username: Kodibochu
 
 Post Number: 1273
 Registered: 04-2019
 Posted From: 99.10.95.165
 
 Rating: N/AVotes: 0 (Vote!)
 | | Posted on Thursday, November 07, 2019 - 8:48 pm: |       | 
 దివ్యం చూతరసం పీత్వా
 న గర్వం యాతి కోకిలః |
 పీత్వా కర్దమపానీయం
 భేకో వటవటాయతే  ||
 
 మధురమైన మామిడి రసము త్రాగినప్పటికీ కోకిల గర్వమును పొందదు. బురద నీరు త్రాగిన కప్ప బెకబెకమనును.
 |