Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images
Bewarse Talk Discussion Board * Archives - 2015 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through July 06, 2015 * Who are they?? < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 7708
Registered: 03-2004
Posted From: 100.6.46.233
Posted on Sunday, July 05, 2015 - 12:42 am:    Edit Post Delete Post Print Post

‘చచ్చేదాకా తెలుగుదేశంలోనే ఉంటా. శవంపై టీడీపీ జెండా కప్పించుకునే అంత్యక్రియలు చేయించుకుంటా’ అని అనౌన్స్‌ చేసిన సీతారాముడొకరు

Tammineni

‘రెండు మెట్లు దిగి ఆ పార్టీలోకి వెళుతున్నా. ఇంతకన్నా ఏం చేయగలను చెప్పండి!’ అని ఉత్తరాంధ్ర యాసలో ఊపిరి వదిలి చెప్పాడొక పెద్దాయన.

????

‘కొడుకు భవిష్యత్తు కోసం కొన్ని పనులు చేయక తప్పదు’ అని సూత్రీకరించుకున్నాడో తెలంగాణ వామపక్షీయుడు

Chennamaneni

‘ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన టీఆర్‌ఎస్‌ సర్కారును కూల్చడానికి కుట్రలు జరుగుతున్నాయి’ అని అకస్మాత్తుగా గుర్తొచ్చి కాపాడడం కోసం తరలివెళ్లాడు మరో బరువైన నేత.
DS

మేయర్‌ పదవి కోసం కొత్త మేత మేసిన నేత ఒకరైతే, ఫ్యామిలీ ప్యాకేజీ బాగుందని బయటపడ్డది ఇంకొకరు.

?????

పిల్లల పెండ్లికి, తల్లిదండ్రుల కర్మకు కూడా పార్టీ నుంచి ఖర్చులు తీసుకున్న ఓ మహానాయకుడు, ఫిరాయించిన తర్వాత, పాత పార్టీ అధినేతను అరేయ్‌ ఒరేయ్‌ అని బూతులు తిట్టాడు.

?????

మార్కెట్‌ లీడర్‌ స్థాయి నుంచి మంచి నాయకుడిగా మార్చిన పార్టీనే అంతు చూస్తానని బెదిరించాడు మరో నాయకుడు.

Talasani

సీఏగా లెక్కలు చూసుకునే వ్యక్తిని ఎన్నికలతో సంబంధం లేకుండా ఏకాయెకిన లీడర్‌ చేస్తే ఏరు దాటాక ఎడాపెటా తిట్టడం మొదలుపెట్టాడు ఆయన.

????/

అధికార పక్షాన్ని ఏకి పారేయాల్సిన ఓ మహానాయకుడు, ప్రతిపక్ష పార్టీ పాటించాల్సిన విలువల గురించి జానా బెత్తలతో సహా లెక్కలేస్తుంటాడు. విపక్షాల పరిధులేవో అసెంబ్లీ సాక్షిగా వివరిస్తుంటాడు కూడా!

Janareddy

ఈ పార్టీకి చెందిన మీరు వేరే పార్టీకి చెందిన సీఎం ఇంటికి ఆర్ధరాత్రి ఎందుకు వెళ్లారంటే మా కులపోడు కదా మాట్లాడుకోవద్దా ఎర్రగా మొహంపెట్టి అడిగాడో దయాళువు.
Errabelli

‘మీరు కేసీఆర్‌ను ఘాటుగా విమర్శించారటగా’ అని విలేకరులు ఒక నాయకుడిని ఫోన్‌ చేసి అడిగితే.. ‘‘రామ రామ! ఆయనను అంతమాట నేనెందుకంటా?’ అని విస్తుపోయాడో కమలనాథుడు.
????

పీసీసీ అధ్యక్ష పదవి కోసం అంగలారుస్తూనే, మంత్రి పదవికీ ట్రై చేస్తున్నాడు మరో నేత.
?????

వేదిక మీద కేకేసే ఓ నాయకుడు కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరాక మూగనోము పట్టాల్సి వచ్చింది. ఈ దుస్థితిపై ‘ఎలాంటి వాడివి, ఎలా మారిపోయావు?’ అని సన్నిహితులు సానుభూతి ప్రకటిస్తే... ‘నేనేం మారలేదు. అలాగే ఉన్నా. కాకపోతే అప్పుడు రోజూ వేదిక మీద ప్రసంగించేవాడిని. ఇప్పుడూ అనర్గళంగా మాట్లాడుతున్నా... అద్దం ముందు!’ అని తనమీద తానే జోకేసుకున్నాడట ఆ నేత.
KK

ఇక టీడీపీ మీద వీర లెవల్లో దాడి చేసి వైసీపీలోకి వెళ్లిన ఓ సీనియర్‌ నాయకుడు, ‘బాబు పిలిస్తే మళ్లీ వస్తా’ అని కొత్త పిలుపు ఇచ్చాడు.
Daadi

కేసీఆర్‌పై నంగి నంగిగా మాత్రమే విమర్శలు చేసే విపక్ష పార్టీ అధినేత ఒకరు టీఆర్‌ఎస్‌లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారట. హోంమంత్రి పదవిపై కూడా ఒప్పందం కుదిరిపోయిందట.
Janareddy??
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 7707
Registered: 03-2004
Posted From: 100.6.46.233
Posted on Sunday, July 05, 2015 - 12:35 am:    Edit Post Delete Post Print Post

కుక్కలన్నీ పక్కపక్కన కూర్చుని... తాము విశ్వాసంగా ఉండడం విషాదమా, విధి వైపరీత్యమా అని విషమ పరీక్ష పెట్టుకున్నాయి. కప్పలన్నీ కుప్పలుగా తెప్పమీదకు చేరి, గెంతుడులో తాము తప్పెక్కడ చేస్తున్నామా అని తక్కెడతో తరచి చూసుకున్నాయి. పిల్లులన్నీ ఓ గోడ మీదకు వచ్చి, దుంకుడు విద్యలో దూకుడుతనం ఎవరు నేర్పుతారా అని దూరాలోచనలు చేశాయి. నక్కలు కొత్త జిత్తుల కోసం కత్తులు నూరుతూ చెత్త ఎత్తులు వేశాయి. ఊసరవెల్లులు ఉసూరుమంటూ చేరువలోని చెట్లెక్కి, మరిన్ని రంగులు మార్చెదెట్లా అని మాయాన్వేషణ చేశాయి. ఔరా.. తెలుగు నాయకులు! ఎంత లాఘవము? ఏమి లంఘన నైపుణ్యము? అని సకల జంతు ప్రపంచమూ నిబిడాశ్చర్యముతో నివ్వెరపోయింది. పదిన్కొక్కరంగులు.. పదేపదే కండువాలేమని కొనుక్కుంటారు? ఎంతకని మార్చుకుంటారు? ఈ కష్టాన్ని చూడలేక సెంట్రల్‌ ఫ్లోరిడా వర్సిటీకి చెందిన భారత శాస్త్రవేత్త దేవాశీష్‌ చందా.. క్షణాల్లో రంగులు మారే మహత్తర చర్మరాజాన్ని సృష్టించాడు!!
కలికాలం ఇది. కలకాలం ఒకే పార్టీలో ఉండమంటే ఎలా? అందుకే తెలుగు నేతలు ఎడాపెడా అటూఇటూ దూకుతున్నారు. రాత్రికి ఒక పార్టీలో ఉన్నవాడు పొద్దున ఏ పార్టీలో ఉంటాడో అతడి కే తెలియదంటే అంత ఆశ్చర్యపోనక్కరలేదు. వెనకటికి ఎవరినైనా... ఓటెవరికి వేశావంటే గెలిచినోడికి వేశానని చెప్పేవాడు. ఇప్పుడు నువ్వే పార్టీలో... అంటే అడగక ముందే అధికార పార్టీలో అని జవాబు చెబుతున్నారు. ‘ఆకాశాత్‌ పతితం తోయం యథాగచ్ఛతి సాగరం’ అన్నట్టు... ఏ పార్టీ నుంచి గెలిచామన్నది కాదు, ఇప్పుడెక్కడ ఉన్నమన్నది సంగతి! బయట ఉన్నంత వరకే పుణ్య నదులు. సాగరంలో కలిశాక అంతా ఒకటే! చట్టమెప్పుడూ అధికార పార్టీకి చుట్టమే కనుక కట్టుదిట్టాలు, కట్టుబాట్లు ఉత్తమాట. ఇప్పుడు ఓటరు ఓటిగాడు.. విజేత వీరుడు! పార్టీకి విలువ లేదు. సిద్ధాంతాలకూ విలువ లేదు. విలువైన వాటికే విలువ! ఏది విలువైనదంటే ఎవరు చెప్పగలరు? ‘రెండు మెట్లు దిగి ఆ పార్టీలోకి వెళుతున్నా. ఇంతకన్నా ఏం చేయగలను చెప్పండి!’ అని ఉత్తరాంధ్ర యాసలో ఊపిరి వదిలి చెప్పాడొక పెద్దాయన. ‘మా ఫ్యామిలీ ఒత్తిడి తట్టుకోలేక పోతున్నా’ అని అసలు విషయమే అన్నాడు మరో సీమ నేత.
ఇలా గతిలేక వెళ్లేది కొందరైతే అతి చేసి వెళ్లేవారు మరికొందరు. ‘చచ్చేదాకా తెలుగుదేశంలోనే ఉంటా. శవంపై టీడీపీ జెండా కప్పించుకునే అంత్యక్రియలు చేయించుకుంటా’ అని అనౌన్స్‌ చేసిన సీతారాముడొకరు అనతి కాలంలోనే ఒక్క దూకు దూకారు. ‘కార్యకర్తలు పొమ్మంటున్నారు. కాదనేదెలా?’ అంటూ సాగిపోయాడొక బడా లీడర్‌. ‘కొడుకు భవిష్యత్తు కోసం కొన్ని పనులు చేయక తప్పదు’ అని సూత్రీకరించుకున్నాడో తెలంగాణ వామపక్షీయుడు. ‘ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన టీఆర్‌ఎస్‌ సర్కారును కూల్చడానికి కుట్రలు జరుగుతున్నాయి’ అని అకస్మాత్తుగా గుర్తొచ్చి కాపాడడం కోసం తరలివెళ్లాడు మరో బరువైన నేత. మేయర్‌ పదవి కోసం కొత్త మేత మేసిన నేత ఒకరైతే, ఫ్యామిలీ ప్యాకేజీ బాగుందని బయటపడ్డది ఇంకొకరు. అధినేతకు మర్యాదగా చెప్పి పోయేవారు కొందరైతే, పోతూపోతూ చెప్పులు విసిరే వారు ఇంకొందరు. పిల్లల పెండ్లికి, తల్లిదండ్రుల కర్మకు కూడా పార్టీ నుంచి ఖర్చులు తీసుకున్న ఓ మహానాయకుడు, ఫిరాయించిన తర్వాత, పాత పార్టీ అధినేతను అరేయ్‌ ఒరేయ్‌ అని బూతులు తిట్టాడు. మార్కెట్‌ లీడర్‌ స్థాయి నుంచి మంచి నాయకుడిగా మార్చిన పార్టీనే అంతు చూస్తానని బెదిరించాడు మరో నాయకుడు. సీఏగా లెక్కలు చూసుకునే వ్యక్తిని ఎన్నికలతో సంబంధం లేకుండా ఏకాయెకిన లీడర్‌ చేస్తే ఏరు దాటాక ఎడాపెటా తిట్టడం మొదలుపెట్టాడు ఆయన.
వేరేరకం వారూ ఉన్నారు. మనిషొకచోట, మనసొక చోట అన్నటైపు! ఉన్న పార్టీలోనే ఉంటారు. పక్కపార్టీకి పనిచేస్తారు. అధికార పక్షాన్ని ఏకి పారేయాల్సిన ఓ మహానాయకుడు, ప్రతిపక్ష పార్టీ పాటించాల్సిన విలువల గురించి జానా బెత్తలతో సహా లెక్కలేస్తుంటాడు. విపక్షాల పరిధులేవో అసెంబ్లీ సాక్షిగా వివరిస్తుంటాడు కూడా! ఇక మరో నాయకుడి సంగతి! ఈ పార్టీకి చెందిన మీరు వేరే పార్టీకి చెందిన సీఎం ఇంటికి ఆర్ధరాత్రి ఎందుకు వెళ్లారంటే మా కులపోడు కదా మాట్లాడుకోవద్దా ఎర్రగా మొహంపెట్టి అడిగాడో దయాళువు. ‘మీరు కేసీఆర్‌ను ఘాటుగా విమర్శించారటగా’ అని విలేకరులు ఒక నాయకుడిని ఫోన్‌ చేసి అడిగితే.. ‘‘రామ రామ! ఆయనను అంతమాట నేనెందుకంటా?’ అని విస్తుపోయాడో కమలనాథుడు. పీసీసీ అధ్యక్ష పదవి కోసం అంగలారుస్తూనే, మంత్రి పదవికీ ట్రై చేస్తున్నాడు మరో నేత.
పెళ్లి చేసుకోని వాడు తాళి కట్టేందుకు ఉబలాటపడితే, చేసుకున్న వాడు ఎందుకు చేసుకున్నాను మొర్రో అని ఏడుస్తుంటాడట. కొత్త పార్టీలోకి పోవడం కూడా ఇలాంటిదే! ‘వెల్కమింగ్‌ బాగుంటది శీనన్నా.. ఆ తర్వాత ఏమీ ఉండదు’ అని వీహెచ్‌ లాంటి పెద్దలు హెచ్చరించినా పోయేవాళ్ల చెవికది ఎక్కదు. వేదిక మీద కేకేసే ఓ నాయకుడు కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరాక మూగనోము పట్టాల్సి వచ్చింది. ఈ దుస్థితిపై ‘ఎలాంటి వాడివి, ఎలా మారిపోయావు?’ అని సన్నిహితులు సానుభూతి ప్రకటిస్తే... ‘నేనేం మారలేదు. అలాగే ఉన్నా. కాకపోతే అప్పుడు రోజూ వేదిక మీద ప్రసంగించేవాడిని. ఇప్పుడూ అనర్గళంగా మాట్లాడుతున్నా... అద్దం ముందు!’ అని తనమీద తానే జోకేసుకున్నాడట ఆ నేత. తన మాతృపార్టీ నుంచి మహామహులు వస్తుంటే, తాజాగా తన పరిస్థితి ఏమవుతుందో అన్నది ఆయన ఆందోళన. ఇక టీడీపీ మీద వీర లెవల్లో దాడి చేసి వైసీపీలోకి వెళ్లిన ఓ సీనియర్‌ నాయకుడు, ‘బాబు పిలిస్తే మళ్లీ వస్తా’ అని కొత్త పిలుపు ఇచ్చాడు. అయన రాకుండా ప్రాంతీయ నేతలంతా జట్టుకట్టి అడ్డుకుంటుండడంతో ఆయనకు ఇక అధినాయకుడే శరణ్యమయ్యాడు.
కొత్తకొత్త వాళ్లు సరికొత్త ప్యాకేజీలతో వచ్చేస్తుంటే అధికార పార్టీల్లోని పాతవాళ్లు, తామేం త్యాగాలు చేయాల్సి వస్తుందో అని పరేషాన్‌అవుతున్నారు. ఇక వలసలను ఆపేందుకు విపక్ష సారథులు హైలెవల్‌, లోలెవల్‌, వర్కింగ్‌, నాన్‌ వర్కింగ్‌ పదవులను సృష్టిస్తున్నారు. అయినా ఆగుతారా? అనుమానమే! గడ్డిలా ఎండి కూడా మళ్లీ పచ్చబడే కాంగ్రెస్‌ పార్టీయే దెబ్బ కాచుకోలేకపోతోంది. ఉమ్మడి రాష్ట్రంలో చిట్టచివరి సీఎం, చివరి ముగ్గురు పీసీసీ అధ్యక్షులు ఇప్పుడు ఆ పార్టీకిఅండగా లేరంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అయినా పర్వాలేదు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడం అన్న సామెతకు ఇప్పుడు విలువ లేదు. ఎందుకంటే రాష్ట్రంలోని అన్ని ప్రాంతీయ పార్టీల అధినేతలూ నిజానికి ఫిరాయింపుదార్లే. టీఆర్‌ఎస్‌లోకి జోరుగా సాగుతున్న వలసలను చూసి ఓ విశ్లేషకుడు ‘గంగ చంద్రముఖి రూముకి వెళ్లింది. గంగ చంద్రముఖిలా నుంచుంది. గంగ చంద్రముఖిగా తనను ఊహించుకుంది. గంగ చంద్రముఖిగా మారింది. చూడు.. ఇప్పుడు చూడు. పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగను చూడు!’ అనే డైలాగును గుర్తు చేశారు. ‘చంద్ర’ ముఖిలా మారడం అంటే వేరే చెప్పాలా?!
చివరాఖరు : కేసీఆర్‌పై నంగి నంగిగా మాత్రమే విమర్శలు చేసే విపక్ష పార్టీ అధినేత ఒకరు టీఆర్‌ఎస్‌లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారట. హోంమంత్రి పదవిపై కూడా ఒప్పందం కుదిరిపోయిందట. కానీ అంతలోనే రేవంత్‌ వ్యవహారం బయటపడి, ఫిరాయింపులు పెద్ద ఇష్యూ కావడంతో ప్రస్తుతానికి ఆయన వెనక్కు తగ్గినట్టు కారిడార్లు కోడై కూస్తున్నాయి!

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration