Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Mudiripoyina Bewarse
Username: Fanno1

Post Number: 10540
Registered: 03-2004
Posted From: 32.212.213.128

Rating: N/A
Votes: 0

Posted on Friday, January 12, 2018 - 6:34 pm:   

chala issues vunnattunnayi vundhi kada..

సీబీఐ జడ్జి లోయా మృతి కేసు విచారణ లిస్టింగే తక్షణ కారణం!..
జస్టిస్‌ దీపక్‌ మిశ్రా తీరును ప్రశ్నించిన నలుగురు జడ్జ్జిలు
న్యూఢిల్లీ, జనవరి 12: మహారాష్ట్రకు చెందిన జడ్జి బీహెచ్‌ లోయా అనుమానాస్పద మరణం కేసులో సుప్రీంకోర్టు తాజా నిర్ణయమే జడ్జీలు మీడియాకెక్కడానికి తక్షణ కారణంగా కనిపిస్తోంది. సంచలనం సృష్టించిన సొహ్రాబుద్దీన్‌ హత్యకేనును విచారిస్తూ జడ్జి బీహెచ్‌ లోయా 2014లో అనుమానాస్పదంగా మృతి చెందారు. సొహ్రాబుద్దీన్‌ కేసులో విచారణ ఎదుర్కొన్న అమిత్‌షా ఇప్పుడు బీజేపీలో అత్యున్నత స్థానంలో ఉండగా, మరోపక్క లోయా మృతి కేసుపై సమగ్ర విచారణ జరపాలని చాలా డిమాండ్లు వచ్చాయి. అయితే దాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం తోసిపుచ్చుతూ వచ్చింది. బాంబే హైకోర్టు సైతం దీనికి అంగీకరించలేదు. కానీ- లోయా కుటుంబసభ్యుల అభిప్రాయాలు తీసుకొని కారవాన్‌ అనే పత్రిక- నిరుడు డిసెంబరులో ప్రచురించిన ఓ కథనం ప్రకంపనలు రేపింది. దీనిపై విచారణ కోరుతూ బాంబే హైకోర్టులో మళ్ళీ ఓ పిటిషన్‌ దాఖలైంది. అదే సమయంలో- ఇటు సుప్రీంకోర్టులోనూ రెండు వేరు వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. ఒకటేమో- బీఆర్‌ లోన్‌ అనే జర్నలిస్టు, మరొకటి తెహసీన్‌ పూనావాలా అనే కాంగ్రెస్‌ నేత దాఖలు చేశారు.

దీనిని- ఛీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఏఎం ఖాన్విల్కర్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ గురువారం నాడు పరిశీలించింది. ఇది చాలా సీరియస్‌ వ్యవహారమన్న పిటిషనర్ల వాదనతో ఏకీభవిస్తూ- దీన్ని వెంటనే విచారణకు టేకప్‌ చేయాలన్న అభ్యర్థనను మన్నిస్తూ- దీన్ని శుక్రవారానికి వాయిదా వేసింది. శుక్రవారంనాడు లిస్టింగ్స్‌లో ఈ కేసును - జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ ఎంఎం శంతనగౌదార్‌లతో కూడిన బెంచ్‌కు కేటాయించారు. ఇది సీనియర్‌ జడ్జీలకు ఆగ్రహం కలిగించినట్లు సమాచారం.. రాజకీయంగా కీలకమైన కేసుల విచారణలో తమను ఎందుకు బైపాస్‌ చేస్తున్నారో చెప్పండని- జస్టిస్‌ చలమేశ్వర్‌, జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ మదన్‌ లోకూర్‌, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌ ప్రభృతులు ఛీఫ్‌ జస్టిస్‌ ను ప్రశ్నించినట్లు సుప్రీంకోర్టు వర్గాల కథనం. అయితే రోస్టర్‌ అంతా ప్రధాన న్యాయమూర్తి చేతిలోనే ఉంటుంది కాబట్టి వీరి ప్రశ్నకు సమాధానం దొరకలేదని తెలుస్తోంది. ఆ తరువాత కొద్ది గంటలకే- జస్టిస్‌ చలమేశ్వర్‌ ఇంట్లో ఈ నలుగురు జడ్జీలు మీడియా సమావేశం నిర్వహించారు.

జడ్జి లోయా డెత్‌ మిస్టరీ...!
సొహ్రబుద్దీన్‌ షేక్‌ అనే వ్యక్తిని, ఆయన భార్య కౌసర్‌ బీ ని, వారి స్నేహితుడు తులసీదాస్‌ ప్రజాపతిని గుజరాత్‌ యాంటీ- టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ 2005 నవంబరు 3న హైదరాబాద్‌ నుంచి సాంగ్లీ వస్తున్నపుడు బస్సులో నుంచి దించి- విడివిడిగా తీసికెళ్ళి ఎన్‌కౌంటర్‌ చేసి చంపేసింది. ఆ హత్యల కేసులో అప్పటి గుజరాత్‌ హోంమంత్రి అయిన అమిత్‌ షా కీలక నిందితుడు. ఆ కేసు విచారణను గుజరాత్‌ నుంచి ముంబైకు మార్చారు. దానిని మొదట చేపట్టిన జడ్జిని ఆకస్మికంగా బదిలీ చేసేశారు. అతని స్థానంలో వచ్చిన రెండో జడ్జి బీహెచ్‌ లోయా. కేసును చాలా పకడ్బందీగా విచారణ జరపుతున్న లోయా- విచారణకు హాజరుకావాల్సిందిగా అనేకసార్లు అమిత్‌ షాకు నోటీసులిచ్చారు. షా వాటిని ఎప్పడూ ఖాతరు చేయలేదు. ఏదో ఓ కారణంతో వాయిదా వేయిస్తూ వస్తున్నారు. ఓ సారి లోయా ఓ జడ్జి కూతురి పెళ్ళికి హాజరవడానికి 2014 డిసెంబరు 1న నాగ్‌పూర్‌ వెళ్ళారు.

అక్కడే రవి భవన్‌ అనే వీఐపీ గెస్ట్‌ హౌస్‌లో బసచేశారు. కానీ తెల్లవారు ఝామున - గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తీసికెళుతుండగా చనిపోయారని- వార్తా కథనాలు వచ్చాయి. అయితే ఆయన మరణం వెనుక మిస్టరీ ఉందని ఆ తరువాత లోయా సోదరి బియానీ, తండ్రి ఆరోపించారు. దీనిపై పునర్విచారణ జరపాలన్నది వారి డిమాండ్‌. లోయా సోదరి, తండ్రి ఇలా మీడియాకు చెప్పినప్పటికీ- లోయా కుమారుడు అనూజ్‌ మాత్రం తన తండ్రి మరణంలో తమకెలాంటి సందేహాలు లేవని బాంబే హైకోర్టు ఛీఫ్‌ జస్టిస్‌ మంజులా చెల్లూర్‌ను వ్యక్తిగతంగా కలిసి చెప్పాడం విశేషం. అయితే ఆయన- బయటి ఒత్తిళ్ళ వల్లే అలా చెప్పి ఉంటారని కథనాలొచ్చాయి.
పోస్ట్‌మార్టం నివేదిక పంపండి

మహారాష్ట్ర సర్కార్‌కు సుప్రీం ఆదేశం
లోయా మృతి కేసే ఇప్పుడు కీలకం కావడంతో- ఇద్దరు సభ్యుల సుప్రీం బెంచ్‌- దీనిపై విచారణ మొదలెట్టింది. ‘‘కేసు చాలా సీరియస్‌.. పోస్ట్‌ మార్టం రిపోర్టును, ఇతర సంబంధ డాక్యుమెంట్లను పంపాల్సిందిగా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాం. ఈ కేసును దీనితో సంబంధం ఉన్న వారి సమక్షంలోనే విచారించడం సముచితం. వారు లేకుండా విచారణ సరికాదని భావిస్తున్నాం. జనవరి 15లోగా పోస్ట్‌మార్టం రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వం పంపాలి’’ అని అరుణ్‌ మిశ్రా సారథ్యంలోని బెంచ్‌ పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి కేసు బాంబే హైకోర్టులో విచారణలో ఉన్నందున ఇక్కడ(సుప్రీంలో) విచారణ వద్దని సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే అభ్యర్థించినా బెంచ్‌ దాన్ని తిరస్కరించింది. సుప్రీం విచారణ- బాంబే హైకోర్టు విచారణపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నది దుష్యంత్‌ దవే వాదన. బెంచ్‌ మాత్రం- మీ అభ్యంతరాలను పరిశీలిస్తాం.. చూద్దాం.. అని ముగించింది.

లోయా కుటుంబ సభ్యులు లేవనెత్తిన అంశాలివీ..
మరణించడానికి వారం ముందు ఆయనకు ఓ ఆఫర్‌ వచ్చింది. కేసులో అమిత్‌ షా ను నిర్దోషిగా ప్రకటించి- క్లీన్‌చిట్‌ ఇస్తే వంద కోట్ల రూపాయలిస్తామన్నది ఆ ఆఫర్‌.
ఈ ఆఫర్‌ చేసినది సాక్షాత్తూ అప్పటి బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మొహిత్‌ షా
లోయా కు గుండెల్లో నొప్పి వచ్చినపుడు తామే కార్లో ఆయనను దగ్గర్లోని దండే ఆసుపత్రికి తీసికెళ్ళామని ఇద్దరు జడ్జీలు జస్టిస్‌ శ్రీధర్‌ కులకర్ణి, జస్టిస్‌ శ్రీరామ్‌ మోదక్‌లు చెప్పారు. స్థానిక జడ్జి అయిన విజయ్‌కుమార్‌ బోర్డే కారును డ్రైవ్‌ చేశారని వెల్లడించారు. ఇది నిజం కాదు.
దండే ఆసుపత్రిలో అసలు ఈసీజీ మిషను పనిచేయలేదని, అందుకని కొంత దూరంలోని కార్పొరేట్‌ ఆసుపత్రి- మెడిట్రినాకు తీసికెళ్లారని, కానీ తీసికెళ్ళేసరికే ఆయన మార్గమధ్యంలో చనిపోయారని చెబుతున్నారు. ఇందులో వాస్తవాలపై సందేహాలున్నాయి. చనిపోయినప్పుడు తాము ఆసుపత్రిలోనే ఉన్నామని, ఇందులో మిస్టరీ ఏమీ లేదని, ఆయనకు హార్ట్‌ ఎటాక్‌ వచ్చిందని మరో ఇద్దరు జడ్జీలు జస్టిస్‌ భూషణ్‌ గవాయ్‌, జస్టిస్‌ సునీల్‌ షుక్రే మీడియాకు చెప్పారు. కానీ వారు అక్కడ లేరని వేరే దర్యాప్తులో వెల్లడైంది. లోయాను ఆటోలో ఆసుపత్రికి తీసికెళ్లారు. ధండే ఆసుపత్రిలో ఈసీజీ చేశారు. దాని మీద ఉన్న డేటు నవంబరు 30. అప్పటికి లోయా అసలు నాగ్‌పూరే రాలేదు.
ముంబై హైకోర్టు జడ్జీలు అసలు సీన్లోనే లేరు.. సడెన్‌గా వారు ఎందుకు ప్రెస్‌ స్టేట్‌మెంట్లు ఇచ్చారో తెలీదు.
ఆయన చనిపోయారని మాకు 5 గంటలప్పుడు చెప్పారు. కానీ రిపోర్టులో 6:15కి చనిపోయినట్లు రాశారు
లోయా బట్టలపై రక్తపు మరకలున్నాయి.. అవి ఎందుకు వచ్చాయి? తలమీద ఎవరో మోదినట్లు కూడా ఉంది. గుండెపోటు వస్తే రక్తం కారుతుందా?
లోయా బస చేసిన వీవీఐపీ గెస్ట్‌ హౌస్‌వద్ద కార్లు ఎందుకు లేవు?
ఆస్పత్రికి తీసికెళ్ళడానికి ఆరు నిమిషాలు చాలు.. 45 నిమిషాలు తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration