Esperanza
Celebrity Bewarse Username: Esperanza
Post Number: 27398 Registered: 08-2004 Posted From: 213.214.155.38
Rating: N/A Votes: 0 | Posted on Friday, November 03, 2017 - 11:44 am: | |
నా జీవితం మొత్తం వైస్సార్ భావాజాలాన్ని వ్యాప్తిచేయడానికి ప్రయత్నించా. సమయాన్ని, ఎమోషనల్ ఎనర్జీని పూర్తిగా వినియోగించా, ఎంతోమందిని భాగస్వామ్యులని చేశా! వైస్సార్ మరణం నన్ను పూర్తిగా కుంగతీసింది. తరవాత జగన్ గారు వచ్చారు. ఆయన పార్టీ పెట్టాలని నేను కూడా వత్తిడి తెచ్చా. వైస్సార్ పాలన తేవడానికి ఆయన చేసిన ప్రయత్నంలో పనిలోపనిగా నేనొక చెయ్యేసాను. అనంత విశ్వములో నేనొక అణువుని! ఏనాడూ నేను స్వార్ధం కోసం పనిచేయలేదు. సరే, వైస్సార్ సువర్ణ పాలన కోసం ఎన్ని కలలు కన్నానో, ఏ పచ్చ విషాన్ని ఎదుర్కోవడానికి నేను సైతం అనుకున్నానో తపించానో చాలా మందికి తెలుసు. కానీ, మొత్తం తెలీదనుకుంటా! అదే శ్వాసగా బతికా. తప్పులు జరుగుతున్నాయని చాలా సార్లు ఈమైల్స్ రాశా, ఫోన్లు చేసి మాట్లాడా, కలిసి బతిమాలా! జగన్ గారి చుట్టూ ఉన్న కోటరీకి కనికరం లేకపోయింది. అయ్యా ఇది మీ వ్యక్తిగత వ్యవహారం కాదు లక్షలాది కుటుంబాలకి, కోట్ల మంది ప్రజలకి సంబంధించిన విషయమయ్యా, కొంచెం దయ ఉంచి సరిగ్గా వ్యవహరించాడని బతిమాలా బామాలా! మన నాయకుడికి అనుభవం లేదు, ఆయన చుట్టున్నోళ్ళకి తెలివి లేదు, నిస్స్వార్ధమనేది వాళ్ళ డిక్షనరీలో లేదు! 2014 ముందెలా పరిస్థితులున్నాయో అంతకంటే ఘోరంగా ఇప్పుడున్నవి. మనం చంద్రబాబుతో డబ్బులో గాని, పార్టీ నడపడంలో గాని, వ్యవస్థల్ని మేనేజ్ చెయ్యడంలో గాని, అబద్దాలు చెప్పడంలో గాని పోటీ పడలేము. మనకున్నది వైస్సారుని అభిమానించే గుండెలు, జగన్ గారి పట్టుదలని వెన్ను చూపని వ్యక్తిత్వం - ఈరోజు వీటిని కూడా కాలదన్నారు, ప్రజలని వంచించారు, రాష్ట్రాన్ని పచ్చ మాఫియా చేతుల్లో నలిపేయమని వదిలేశారు. ఇక నాలాంటి సామాన్యుడు పార్టీకి ఏమి చెయ్యలేని స్థితికి తీసుకొచ్చారు. నేను పార్టీకి రాజీనామా చేసాను. నేనేదో గుర్తింపు కోసమో ఇంకేదో ఆశించో చేయలేదు. నాలాంటి కరుడు గట్టిన వాళ్ళు కూడా నిరాశా నిసృహులకి గురవుతున్నారంటే మేమేమి తప్పులు చేస్తున్నామా అని పార్టీ ఆలోచించాలనేది నా అభిమతం! గెలవములే అని వెళ్లిపోవడంలేదు, తప్పులు సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయడంలేదనే నిరాశతో వెళ్తున్నా! జోహార్ వైస్సార్! space for lease
|