Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Capvenu
Kurra Bewarse
Username: Capvenu

Post Number: 2299
Registered: 10-2007
Posted From: 192.195.66.3

Rating: N/A
Votes: 0

Posted on Thursday, November 02, 2017 - 11:28 am:   

తుది ర్యాంకులివ్వలేదు
ఇంకా రెండు నెలలు పడుతుంది
మూల్యాంకనం ముగియలేదు
ఇప్పటి దాకా ఏపీకి సంబంధించి 48 సంస్కరణలే లెక్కింపు
తెలంగాణవి 224 మదింపు
‘సులభతర వ్యాపార నిర్వహణ’ ర్యాంకులపై పరిశ్రమల శాఖ వివరణ
ఈనాడు - అమరావతి
1ap-main3a.jpg
దేశంలో సులభతర వ్యాపార నిర్వహణ (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌)లో తుది ర్యాంకులకు సంబంధించి మూల్యాంకన ప్రక్రియ ఇంకా ముగియలేదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. సులభతర వ్యాపార నిర్వహణలో తెలంగాణ రాష్ట్రం దేశంలో మొదటి ర్యాంకు సాధించిందని, ఆంధ్రప్రదేశ్‌ 15వ స్థానంలో నిలిచిందని ‘ఈనాడు’లో వచ్చిన కథనంపై రాష్ట్ర పరిశ్రమల శాఖ స్పందించింది. ఆ శాఖ కమిషనర్‌ సిద్ధార్థజైన్‌ బుధవారం ఒక ప్రకటనలో సులభతర వ్యాపార నిర్వహణ ర్యాంకులపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ‘‘సులభతర వ్యాపార నిర్వహణకు సంబంధించి ప్రతిపాదనలు పంపడానికి గడువు ఈ నెల 7వ తేదీ వరకు పొడిగించారు. వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక (బిజినెస్‌ రిఫార్మ్స్‌ యాక్షన్‌ ప్లాన్‌-బ్రాప్‌) అనేది దేశంలో సులభతర వ్యాపార నిర్వహణపై రాష్ట్రాలను గుర్తించేందుకు భారత పారిశ్రామిక, ప్రోత్సాహక విధాన(డీఐపీపీ) విభాగం ప్రపంచబ్యాంకు సహకారంతో రూపొందించిన ఒక సూచిక. దీన్ని ఆ సంస్థ 2015లో రూపొందించింది. ప్రస్తుతం మూడో ఏడాది ఈ సూచి ప్రకారం ప్రమాణాలను అమలు చేస్తున్నాం. బ్రాప్‌ ప్రమాణాల మేరకు ఆయా రాష్ట్రాలు తాము అమలు చేస్తున్న సంస్కరణలను సులభతర వ్యాపార నిర్వహణ ర్యాంకుల కోసం పంపుతాయి. వాటిని మదింపు చేసిన తరువాత ఆ సంస్థ తుది ర్యాంకులు ప్రకటిస్తుంది. బ్రాప్‌ గతేడాది ప్రకటించిన ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్‌ మొదటి ర్యాంకులో నిలిచింది. ఈ ఏడాది మొత్తం 12 విభాగాల్లో 372 సంస్కరణలను బ్రాప్‌ సూచించింది. వాటిని ఎంతమేర అమలు చేస్తున్నాయనేది ఆధారాలతో సహా చూపిస్తూ రాష్ట్రాలు ఈ సంస్థలకు నివేదికలు పంపుతుంటాయి. వాటిని ఆ సంస్థ మదింపు చేస్తుంటుంది. ఈ ప్రతిపాదనలు పంపడానికి అక్టోబరు 31 తుది గడువుగా నిర్ణయించి తరువాత దాన్ని ఈ నెల ఏడో తేదీ వరకు పొడిగించారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఆ సంస్థ 48 సంస్కరణలు, తెలంగాణకు సంబంధించి 224 సంస్కరణలు, హరియాణకు సంబంధించి 198 సంస్కరణలను మదింపు చేసింది. మొత్తం మదింపు ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం రెండు నెలల సమయం పడుతుంది. ఆ తరువాతే ఆ సంస్థ తుది ర్యాంకులను ప్రకటిస్తుంది. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోకుండా... ఈ ప్రక్రియను అర్థం చేసుకోకుండా ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్‌కు ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో 15వ ర్యాంకు వచ్చినట్లు పేర్కొనడం సమంజసం కాదు’’ అని ఏపీ పరిశ్రమల శాఖ కమిషనర్‌ సిద్ధార్థజైన్‌ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు మరికొన్ని రాష్ట్రాలు కూడా ఇంకా ప్రతిపాదనలు పంపుతున్నాయని దీన్ని కూడా అంతా గుర్తించాలని కోరారు.
Ninna NTR... Nedu Balayya... Repu Mokshagna

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration