Ramu
Yavvanam Kaatesina Bewarse Username: Ramu
Post Number: 7758 Registered: 03-2004 Posted From: 204.63.44.147
Rating: N/A Votes: 0 | Posted on Monday, October 23, 2017 - 11:19 am: | |
"నారాయుడు, ఆ ఎగస్పార్టీ ఇచ్చే సొమ్మేదో నువ్వే ఇచ్చుకోరా మగడా మిగిలిపోతావ్ అంటే ఇన్నావా? ఇనలా? ఇప్పుడేమయ్యింది? కరుసైపోయావ్... కార్ ఎనక సీట్ లో దర్జాగా మహారాజు లా కూకునేవోడివి ఇప్పుడు డిక్కీ లో తొంగున్నావ్, దర్జా తగ్గిపోలా" ఎప్పుడో 42 సంవత్సరాల క్రితం రమణ గారు రాసిన ఈ డవిలాగులు రావు గోపాల రావు గారి నోటి వెంట ఉమ్మడి ఆంధ్రప్రదేష్ మొత్తం మారుమోగిపోయాయి... కానీ అవి కేవలం సినిమా కోసం రాసిన డైలాగ్స్ కాదు, కొందరు వేసే తప్పటడుగులు వారిని ఏ స్థాయికి తీసుకుపోతాయో ఆనాడే చెప్పారు... దానికి ఉదాహరణ చిరంజీవి (సినిమాలు వదిలి రాజకీయాలలోకి రావటం మొస్దటి తప్పిదం ఐతే, తన పర్టీ ని తీసుకెళ్ళి కాంగ్రెస్ లో కలపటం రెండో తప్పిదం... సినీ పరిశ్రమలో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడు, ప్రజారాజ్యం ఉన్నప్పుడు ఎలా ఉండేవాడు, నేడు పశ్చిమ గోదావరి జిల్లాకి పి.సి.సి. పదవా హవ్వ...), అన్నగారు (లక్ష్మీ పార్వథి అనే ఆమెకి తన జీవితం లో చోటివ్వటం మొదటి తప్పు ఐథే, భార్య ఐనాక ఆమెని రాజకీయాలకి దూరం గా పెట్టటం రెండో తప్పు), చంద్రబాబు (ఆ నాడు కె.సి.ఆర్ అడిగిన మినిస్ట్రీ ఇచ్చి ఉంటే ఆంధ్ర రాష్ట్రం రెండు ముక్కలయ్యేది కాదు).. వాళ్ళకంటే మొనగాడివి కాదు నువ్వు రేవంథ్... నీకు తె.దే.పా లో లెక్కకు మిక్కిలి అభిమానులు ఏర్పడింది నువ్వు ఉమ్మడి రాష్ట్రం లో జగన్ మోహన రెడ్డిని, కాంగ్రెస్ ని, టి.ఆర్.ఏస్ ని ఎదిరినిచిన/విమర్శించిన విధానానికి... ఇప్పుడు నువ్వు వోటు కి నోటు కేస్ లో ఇరుక్కున్నాక దానిని కే.సి.ఆర్ మీద యుధ్ధం గా మార్చావు... రాజకీయ వైరాన్ని వ్యక్తిగత వైరం గా మార్చావు... కే.సి.ఆర్ మీద దుగ్ధ ఉన్న ఆంధ్ర కుర్రకారు నీకు జేజేలు పలికారు కానీ, తెలంగాణా లో ఎంత మంది అభిమానులని సంపాదించుకున్నావు? ఏదో సినిమా లో సత్య నారాయణ అన్నట్టు, "ఇంత ఆవేశం ఉన్నవాడు రాజకీయాలలో ఏమి పనికి వస్తాడయ్యా?" నీకు సరిగ్గా సరిపోతుంది... నరసిమ్హ లో రజనీకాంత్ డైలాగ్ "అతిగా ఆశపడే మగాడు, అతిగా ఆవేశపడే ఆడది బాగుపడరు" జగన్ కి, రోజాకి వర్తిస్తుంది... ఒక్కసారి నువ్వు కాంగిరేసు లో జేరితే మొదట నిన్ను మూలన కూర్చోబెట్టేది మీ పెదమామ జైపాల్ రెడ్డే... rAmu(Du) manci bAluDu cinnappaTinuncI intE
|