Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Mudiripoyina Bewarse
Username: Fanno1

Post Number: 10350
Registered: 03-2004
Posted From: 24.249.211.73

Rating: N/A
Votes: 0

Posted on Thursday, October 19, 2017 - 1:38 pm:   

ఇది తెలుగు దేశం పార్టి కార్యకర్తల కమిట్మెంట్...
వేటకొడవల్లు వెంటాడినా
బాంబులు దద్దరిల్లినా..
మా తోటలు నరికినా
మా పొలాలను తగలెట్టినా
ఇంటి ముందు పసుపు జెండా మాత్రం
వదలని # పచ్చ పిచ్చ గాల్లం.....
మహానాడు నుండి
మినీ వార్డ్ వరకూ ప్రతి ప్రోగ్రాం కి ప్రతీ సభకి
మందు విందు ఆశించకుండా
వస్తూ...
మా కుటుంబ సభ్యులను చంపిన వారే
మమ్మల్ని తొక్కిన వారే...
మా జీవితాలను జైల్ల పాలను చేసిన వారే
మళ్ళీ పసుపు కండువాలతో...
పార్టీ లో చేరుతుంటే.....
కడుపులో మంట ఉన్నా..
కళ్ళల్లో ఆనందంతో స్వాగతిస్తూ...
మళ్ళీ వాల్లని భుజాల మీద మోస్తూ...
కార్యకర్తలకొచ్చే ప్రతీ పని,ప్రతీ కాంట్రాక్టు ను...
వలసదారుల అనుచరులకు వస్తున్నా...
క్రమశిక్షణ తొక్క తోలు తోటకూర అంటూ...
పసుపు గీతకు విధేయులమై...
చేతులు కట్టుకొని నిలబడే...
బీద కార్యకర్తలం మేము....
పార్టీలో ఉన్న కుటుంబ సభ్యులు
ప్రచారం చేయడం మానినా...
పక్క పార్టీ కి మద్దతు ఇచ్చినా...
మాట తప్పకుండా
మడిమ తిప్పకుండా....
ఐదేళ్ళ కోసారి మేం భుజాల మీద
మోసినోడు పార్టీ మారితే...
గుండెల మీద తంతే..
అయ్యో మన కుటుంబ సభ్యుడు పోయాడే అనుకొని
మళ్ళీ కొత్త వాడిని...
భుజాల మీద మోసీ...
మళ్ళీ గెలిపించుకొనే...
ఏ స్వార్థం లేని నిర్మలమైన మనసు గల కార్యకర్తలం..
మా కులం మా మతం కాకపోయినా ..
మా కుటుంబం అనుకుంటూ
పార్టీ కోసం బంధువులను దూరం చేసుకుంటూ ..
కాలేజీ లు బడులు ఉద్యోగాలు ఆఫీసు లు
పొలాలు ఎగ్గోట్టి మరి ....
మా నాయకుడి పార్టీ కి స్వచ్ఛందంగా
నడిచొచ్చే పసుపు పిచ్చ కార్యకర్తలం....
అలాంటి మా కార్యకర్తలకు...
పనులు కావాలన్నా..
లంచాలు ఇవ్వాలి
కమీషన్లు ఇవ్వాలీ...
వాల్ల వర్గం లో ఉండాలీ...
వేచి చూడాలీ....
పెద్దల దగ్గరకు వెలితే ఇంఛార్జీ లేదా
నేత సంతకం కావాలీ..
తీసుకొని రా అంటుంటే...
మళ్ళీ ఇంఛార్జీ దగ్గరకు వెలితే..
నీదీ ఏ కులం? ?
నీ వెనుక ఎంత ఉందీ??
నీవు ఎవరి వర్గం??
నీకు పని చేస్తే నాకు ఏం లాభం??
చేద్దాం చూద్దాం అంటూ పుష్కరకాలం గడుపుతూ
పక్క పార్టీ లో పసుపు జెండా మోయనివాడు...
కూడా...మీకు ఏం కావాలో
మమ్మల్ని అడగండి అంటు..
అవహేళన గా మాట్లాడుతుంటే .....
అవమానం భరించి
ఇంటికి వచ్చి ఇంత టీ నో,మజ్జిగనో తా..గీ...
మళ్ళీ కళ్లల్లో నీరు తుడుచుకొని....
మళ్ళీ మా పనులు మేం చేసుకొంటూ..
కాలం వెల్లదీస్తున్న....
అన్న గారి అభిమానులం....మేము....
కమ్మ కాపు మాల మాదిగ రెడ్డి గౌడ రజక కుమ్మరి,రాజు కమ్మరి నాయీ,విశ్వ బ్రాహ్మణుల నుండి ......
అన్ని కులాలు మతాలు వర్గాలు కూడా
కార్యకర్తలం మేం కలిసే ఉంటూ....
ప్రేమగా అన్నా తమ్ముడు అక్కా చెల్లీ
అంటూ అప్యాయంగా
ఒకరికొకరు కుటుంబం గ ఉంటూ.....
పార్టీ ని కష్టకాలంలో కూడా ...
తల మీద మెడలు లేచిపోయినా....
ఈ సారి మనం గెలవాలసిందే...
మన లీడరే CM కావాలీ అంటూ .......
ఎలక్షన్ సమయంలో పార్టీ ఫండ్ ని మేసే మేతల దగ్గర
డబ్బు అయిపోయింది అనీ చేతులెత్తేస్తే....
ATM లు జేబులు కూడా ఖాళీ చేసుకుంటూ...
పసుపు జెండా ని పడిపోకుండా ...
ఇటు రాయలసీమలో ఫ్యాక్షనిజంని...
గుంటూరు లో గ్రూప్ వార్లనీ..
గోదావరి జిల్లా నుండి...
విశాఖపట్నం వరకూ ......
రౌడీయిజంకు గూండాయిజంకి భయపడకుండా
ఓటేస్తూ..ఓటేపిస్తూ....
ప్రతిపక్ష పార్టీ తో ఢీ అంటే ఢీ అంటూ ....
ఒక పసుపు టెర్రరిస్టులాగా....పార్టీ కి ప్రచారం చేస్తూ
చంటి బిడ్డలకూ కూడా పసుపు దుస్తులతో అలంకరణ చేస్తూ ....
మీరు గెలిస్తే..
సంక్రాంతి దీపావళి అంత సంబరంగా..
సంబరాలు జరుపుకుంటూ ...
పార్టీ లు జరుపుతూ
మళ్ళీ మా జేబులు ఖర్చు చేసుకుంటూ.....
సంతోషపడే పసిమనసున్న కార్యకర్తలం సర్....
తీరా అధికారం వచ్చాక...
మహానాడుకు
జన్మభూమి కమీటీలకి
మీ సభలకు ప్రోగ్రాం లకు...
జనచైతన్య యాత్రలకు
మెసెజ్ లు పెడితే ....
పిచ్చి కుక్కల్లాగా.....
పనులు మానుకొని మరీ వెల్లే...
పిచ్చ అభిమానులం .....
ఒరేయ్ ఉన్నారా..సచ్చారా...
ఉంటే తిన్నారా......
అని అడిగే ఏ నేతలు మాలో చాలామంది కి లేకపోయినా ....
వచ్చిన ప్రతీ నేత కోటీశ్వరులు అయిపోతుంటే..
సచ్చాక మీరిచ్చే లక్షల రూపాయలను..కూడా
పసుపు జెండాను కప్పు కొనీ మరీ....
సచ్చిపోయే పసుపు ఉన్మాదులం మేము....
కొత్త కార్యకర్తల.కోసం వెంపర్లాడుతున్నాం..
ఒక్కసారి పదేళ్ళలో పార్టీ కోసం ప్రాణాలర్పించిన వారి కుటుంబాలను...జెండాలు మోసి ఇప్పుడు సైలెంట్ అయిన వారి కుటుంబాలకు కనీసం ఒక భరోసా ఇవ్వండి సర్.....
మీ నామినేటెడ్ పోస్టు లు ఎలాగో డబ్బున్నోడో రెకమెండేషన్ చేసుకున్నోల్లకే కదా పోయేదీ...
కనీసం అందరినీ ఆక్టివ్ చేసి ..
మళ్ళీ పాత పునరుత్తేజం చేసీ...
కార్యకర్తలను బతికించుకోండి సర్...
పార్టీ ఆటోమేటిక్గా బతుకుంది...
-------------------------
అయినా మేం మారము.సర్...
బతికినా తెలుగుదేశమే
సచ్చినా తెలుగుదేశమే....
మా గుండె ఆడినా ఆగినా..
అదీ పసుపు జెండా కోసమే ...
తెలంగాణా అయినా
ఆంధ్ర అయినా
అండమాన్ అయినా
అమెరికా అయినా
ఆస్ట్రేలియా అయినా ......
Uk or Gulf....
మేం ఇంతే .... సచ్చినా... బతికినా....
మా దేశం # తెలుగుదేశం సర్...

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration