Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Andhrajamesbond
Kurra Bewarse
Username: Andhrajamesbond

Post Number: 2132
Registered: 03-2004
Posted From: 171.161.160.10

Rating: N/A
Votes: 0

Posted on Thursday, September 21, 2017 - 7:11 am:   

చంద్రబాబు కుటిల చాణక్య నీతి ముందు, జగన్ ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ పోరాటం పనిచేస్తున్నట్టా? లేదా? ప్రస్తుత పరిస్థితి చూస్తే ప్రజలలో ఉండి చేస్తున్న పోరాటం పనిచేస్తున్నట్టు లేదు.

ప్రజలలో వున్న నిర్లిప్త ధోరణి, జగన్ ఒంటరిగా ఒకవైపు, అన్ని వ్యవస్థలు మరోవైపు, ప్రస్తుతానికి స్పష్టంగా గెలుపు చాణక్య నీతిదే. ఇందులో ఎవరిది తప్పు? బాబును గుడ్డిగా నమ్ముతున్న జనాలదా? జనాలకు తాను ప్రత్యాన్మాయం అని నమ్మించలేక పోతున్న జగన్ దా?

తన సంపూర్ణ రాజకీయ అనుభవంతో జగన్ ను శాశ్వతంగా రాజకీయ సమాధి చేయాలనుకుంటున్నబాబు దా? ఎన్నికలకు సమయం అతి దెగ్గర పడుతుండటం తో ప్రజాబలం లేకపోయినా చెక్కు చెదరని విశ్వాసంతో తెలుగు దేశం ఉన్నది. ప్రజల బలం ఉన్నట్టు కనపడుతున్నా సరైన వ్యూహాలు లేక ఎక్కడికక్కడ నాయకత్వ సమస్యతో వైస్సార్సీపీ పుంజుకోలేక పోతున్నది.

నేటి రాజకీయం మారింది. మునుపటి లాగా నా దేశం, నా ప్రాంత భవిష్యత్తు, మంచితనం, మానవత్వం, విలువలు లాంటి పదాలకు అర్ధం లేకుండా పోయింది, జనాలకు కావాల్సింది డబ్బు, కులం, సినిమాల ప్రభావం, ఇంట్లో కూర్చొని చాట్టింగ్లు, పోస్టింగులు. ఇది గమనించి రాజకీయం చెయ్యాలి, అంతే కానీ జనాల్లో కి వెళ్లి ముద్దులు పెడితే ఓట్లు రానే రావు. ప్రజలు సమస్యలలో వున్నప్పుడు కాకుండా తన ఇష్టం వచ్చినప్పుడు బయటకు వచ్చే ప్యాకేజీ పవర్ స్టార్ కూడా వ్యూహాత్మకం గా ముందుకు వెళుతున్నాడు. ఏ వ్యూహం లేకుండా గుడ్డెద్దు చేలో పడినట్టు వెళుతున్నారు వైస్సార్సీపీ వారు. ఇదే వరం గా మారింది అనుభవం వున్న అధికార పార్టీ కి. ఇందులో వారిని యెంత మాత్రం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. వారు రాజకీయమే చేస్తున్నారు, గెలుస్తున్నారు, గెలుపు వైపు బాటలు వేసుకుంటూ వెళుతున్నారు.

ఇంత నష్టం జరిగినా, జరగబోతున్నా, పట్టుదల, అహం, నేను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్టు పోతున్నది వైస్సార్సీపీ. క్రింది స్థాయిలో పార్టీ నిర్మాణం లేక జాతీయ స్థాయిలో ఏ పార్టీ అండలేకుండా, అనుభవం వున్న రాజకీయ నాయకులు లేకుండా, డబ్బుతో అధికార పార్టీతో పోటీ పడలేక టీడీపీ మీద ఎలా గెలుస్తుందో జగన్ ఒక్కరికే తెలియాలి.

రాజకీయాలలో శాశ్వత శత్రువులు, మిత్రులు లేరంటారు, వైస్సార్సీపీ పంధా చూస్తుంటే మాకు వాళ్ళు వొద్దు, వీళ్ళు వొద్దు, మాకు అంతా తెలుసు, ఒకసారి నా మనసులోకి వస్తే ఇక శత్రువే, అనే పంధా తో అందరిని పోగొట్టుకొని, ఎవ్వరిని దరి చెర నివ్వక వైయస్సార్ ని అభిమానించే అనేకమంది అభిమానుల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నది వైస్సార్సీపీ అది నాయకత్వం.

జగన్ మోహన్ రెడ్డి నిస్సందేహంగా కష్టపడుతున్నారు. కానీ వ్యూహాలు లేని ఆ కష్టం వ్యర్థం. బాబు లాంటి రాజకీయ దురంధుడిని ఎదుర్కోవాలంటే అన్ని శక్తులను కలుపుకు పోవాలి. అందరిని దరిచేర నివ్వాలి, చేర్చుకోవాలి. అతి కొద్దీ మందిని మినహాయించి ఎక్కడా సరైన నాయకత్వమే లేదు వైస్సార్సీపీ కి. వైఎస్సార్ కి ట్రెడిషనల్ వోట్ బ్యాంక్స్ గా వున్న వర్గాలు ఒక్కొక్కటిగా టీడీపీ వైపు కు వెళ్లి పోతున్నాయి. కాపులే ఇందుకు చక్కటి ఉదాహరణ. గోదావరి జిల్లాల నుండి ఉత్తరాంధ్ర వరకు వైస్సార్సీపీ పుంజుకోలేదు అనే వాదన వినిపిస్తున్నది. గుంటూరు లాంటి ఢీ అంటే ఢీ అనే జిల్లాలు కూడా వన్ సైడెడ్ గా మారుతాయేమో అనే భయాందోళనలు కలుగుతున్నాయి.

అనుభవం లేని బంధువులను చుట్టూ పెట్టుకొని, అనుభవజ్ఞులు దూరంగా పెడితే నష్టపొయ్యేది వైస్సార్సీపీ ఏ. 2014 లో ఈ బంధువర్గం లోని అనేక మంది ఎలా పనిచేసారో, ఏ తప్పుడు రిపోర్టులు, తప్పుడు సర్వే లు ఇచ్చి జగన్ ని పక్క దారి పట్టించారో ఆయనకు బాగా తెలిసి ఉండాలి. నిరంతరం నెగటివ్ ప్రచారంని తట్టుకొని జగన్ పార్టీ ని నిలబెట్టడం హర్షించతగ్గ విషయం. కానీ రాను రాను అనేక జిల్లాలలో తీవ్రమైన నాయకత్వ లేమిడి తో వైస్సార్సీపీ ఇబ్బంది పడుతోంది. స్థానిక నాయకత్వాన్ని ఎక్కడి కక్కడ డిసెంట్రలైజ్ చేసి పూర్తి బాధ్యతలు అప్పజెప్పినట్టు, వారి ఫై పూర్తి విశ్వాసం చూపిస్తున్నట్టు అధినాయకుడి తీరు కనబడటం లేదు.

ఆంధ్రాలో ప్రస్తుతం పాలక పక్షం మీద వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. కానీ టీడీపీ తమ అద్భుతమైన థింక్ థాంక్ స్ట్రాటజీ లో భాగంగా "డబ్బుల్లేవు, బాబు మునుపటి లాగా సరిగ్గా చెయ్యడం లేదు అని అంటూనే, ఆంధ్రాలో మరి ప్రత్యాన్మాయం లేదు కదా" అని ప్రచారం చేస్తున్నారు. అంటే బాబుకి, జగన్ ప్రత్యాన్మాయం కానే కాదు అని తమ బలమైన మీడియా ద్వారా, ప్రజలలో ప్రచారం చేస్తున్నారు. 2014 కి ముందు జగన్ మీద వున్న నమ్మకాన్ని జనాలలో సడలిస్తున్నారు.

ఒక్క అవకాశం ఇవ్వండి నేనేంటో చూపిస్తాను అని ప్రాజెక్ట్ చేసుకోలేకపోతుంది వైస్సార్సీపీ. అనేక కులాలు ఇంకా వైస్సార్సీపీ కి దూరం గా ఉంటున్నాయి. దూరం చేసారు. మారిన జనాలు, మారిన రాజకీయం ప్రకారం రాజకీయాలు చెయ్యాల్సిన వైస్సార్సీపీ ఇంకా పాత వ్యూహాలనే పట్టుకు అగాధం వైపు ప్రయాణం చేస్తున్నది.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా అభిప్రాయాన్ని ప్రజా పోరాటం లాగా మార్చలేక పోతున్నది వైస్సార్సీపీ. నవ్యంధ్ర అంటూ, సినిమాలు తీసుకునే వాళ్లతో కాపిటల్ డిజైన్ లంటూ చంద్రబాబు ఆడుతున్న దారుణమైన డ్రామాలను ఎండగట్ట లేని స్థితిలో వైస్సార్సీపీ ఉన్నదంటే నే మనకు అర్ధం అవుతుంది చంద్ర బాబుకు 2019 ఎదురుండదేమోనని. నిలకడ, ధైర్యం లేని ముద్రగడ లాంటి వారిని నమ్ముకుంటే "అవ్వను పట్టుకు వసంతం ఆడినట్టే". నిజమెంతో అబద్దమెంతో తెలియదు గాని జగన్ సలహాలు తీసుకోరా? లేక సలహాలు ఎవ్వరు ఇవ్వడానికి సాహసించరా? అంతి నిష్ఠురం కంటే ఆది నిష్ఠురం మేలు. నాయకులందరూ ఒక్క తాటి పైకి వచ్చి సూచనలు సలహాలు ఇవ్వాలి, నాయకుడు వినాలి. అదే ప్రజాస్వామ్యం.

వైస్సార్ మీద అభిమానం , వైస్సార్ పాలన రావాలని అనేకమంది కోరుకుంటున్నారు.కానీ ఆ దిశగా పార్టీ ని తీసుకెళ్లాల్సిన బాధ్యత అధినాయకుడి, అధి నాయకత్వానికి వుంది. వ్యూహాత్మక తప్పిదాలతో కుట్రల వల్ల, జగన్ అందుబాటులో లేని రోజుల్లో పార్టీ ని ఒంటి చేత్తో నిలబెట్టిన షర్మిల పూర్తిగా తెరమరుగు అవ్వడం సముచితం కాదేమో? అవి ఏ సంకేతాలు పంపుతాయి జనాలకి. జగన్ విశ్వసనీయత మీదే మచ్చ తెచ్చిన వ్యవహారం ఇది. వ్యతిరేక పార్టీ కి, మీడియా ఇది ఒక అస్త్రమే.

ఎక్కువ ప్రైవేట్ సంభాషణలలో విశ్వసనీయం గా తెలుసున్నది సాక్షి టీవీ మరియు పేపర్ లలో బాబు కోవర్టులు బాగా పని చేస్తున్నారని, పార్టీ లో కూడా టీడీపీ కోవర్టులు ఉన్నారనేది విశ్వసనీయంగా తెలుస్తున్నది. ఇంటి దొంగ ని ఈశ్వరుడు కూడా పట్టనట్టు ఆ దొంగలను ఏరి పారేయ్యాల్సిన బాధ్యత జగన్ దే. ఆయన యుద్ధం చేస్తున్నది ఒక ఆశ మాషి పార్టీ తో కాదు, విపరీతమైన బీసీ వోట్ బ్యాంకు, కార్యకర్తలు కలిగిన టీడీపీ తో యుద్ధం. అధినాయకుడు అన్ని చూడలేదు కాబట్టి తన కళ్ళు చెవులుగా అనుభవం కలిగిన వాళ్ళు ఉండాలి. ఒకరిద్దరు తప్ప మచ్చుకకు అనుభవం లేని వాళ్లే జగన్ చుట్టూ ఉన్నారనేది జగమెరిగిన సత్యం.

వైయస్సార్ వున్నప్పుడు చుట్టూ రాజకీయ దురంధరులే. ఇప్పుడు వారు లేరు. ఇప్పుడు వున్నది ఎక్కువగా అధినాయకుడి తరుపు బంధువులే అని అభిమానులు బాహాటం గా చెబుతున్నారు. కనుచూపు మేరలో అనుభవజ్ఞులు పార్టీ లోకి వచ్చే పరిస్థితి కనపడటం లేదు. కేవీపీ లాంటి అనుభవం ఎక్కడా? 8 ఏళ్ళ నుండి పార్టీ కోసం వేలాది మంది విపరీతమైన డబ్బు, ఆస్తులు పోగొట్టుకొని, పనులు అవ్వక ఇబ్బంది పడుతున్నారు. ఒక ప్రాంతీయ పార్టీ ఇంకా బ్రతికి వుంది అంటే ప్రజలలో ఇంకా వైస్సార్ మీద ఉన్న అభిమానం మాత్రమే. ఆ అభిమానాన్ని, కళలు సార్ధకం చెయ్యాల్సిన బాధ్యత వైస్సార్సీపీ అధినాయకత్వం మీద వున్నది.

జిల్లాల వారి వైస్సార్సీపీ నాయకులు నాయకత్వానికి నిజాలు చెప్పకపోవడం, అల్ గుడ్ ఫీల్ కలిగించడం, ఆత్మ హత్య సదృశ్యం. పార్టీ కి, నాయకుడికి మేలు చేసే వారైతే అధినాయకత్వంతో మీ మంచి కోసం పార్టీ ని ముంచకూడదు. చివరికి నష్టపొయ్యేది అందరు. నిజాలు చెప్పేవారిని నాయకుడే దూరంగా పెట్టడం ఖచ్చితంగా ఆత్మహత్యే. ఫై విషయాలు ఎందుకు చెబుతున్నానంటే ఇది జరుగుతోంది అనే ప్రచారం విస్తృతంగా వుంది.చంద్ర బాబు అంతటి వారు పవన్ కళ్యాణ్ దెగ్గరకు వెళ్లగా లేనిది, అందరిని కలుపుకు పోయి అనుకున్నది సాధించడం చెయ్యాలి జగన్ అని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నా ఆ వైపు అడుగులు నేటి వరకు పడటం లేదు . శత్రువు ఫై విజయం ముఖ్యమా? స్వాభిమానం ముఖ్యమా? స్వాభిమానం కోసం నమ్ముకున్న లక్షలాది మంది ఆశలు వొమ్ము చెయ్యటం భావ్యమా?

ప్రజల ఆకాంక్షకు అనుగుణం గా పార్టీ ని విజయపదం లోకి వైస్సార్సీపీ వారు నడిపిస్తారో, లేక మరొక్కసారి వారి తప్పుల వల్ల అబద్దాలాలకి, మోసాలకు అగ్రపీఠం వేసే వారికి అధికారం మళ్ళి అప్పచెపుతారో కాలమే సమాధాం చెప్పాలి!

రమణా రెడ్డి కంజుల
మెల్బోర్న్, ఆస్ట్రేలియా
\u}

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration