Andhrajamesbond
Kurra Bewarse Username: Andhrajamesbond
Post Number: 1864 Registered: 03-2004 Posted From: 68.93.142.53
Rating: N/A Votes: 0 | Posted on Sunday, September 03, 2017 - 9:56 am: | |
కోట్లు ఖర్చు పెట్టి పెట్టుకున్న కన్సల్టెంటు ‘పీకే’ చివరకు పార్టీని పీకేయించేస్తారేమోనన్న ఆందోళన పార్టీలో పెరగడం జగన్ భవిష్యత్తుకు మంచిది కాదు. డబ్బులిచ్చి పెట్టుకున్న ఈ ‘అరువు మేధావి’, సొంత మీడియాలోని భజన బృందం కలసి పార్టీని ముంచేస్తున్నారన్న విమర్శలతోపాటు, పీకేను ఎంత త్వరగా వదిలించుకుంటే అంతమంచిదన్న భావన ఇంకా జగన్కు తెలియకపోవడమే వింత! రాష్ట్రం, భాష, ప్రాంతాలు, కులాల గురించి తెలియని పీకే బృందాన్ని నమ్మేకంటే, సొంత మీడియాలో నిర్భయంగా, నిష్పాక్షికంగా నిజాలు చెప్పే జర్నలిస్టులను నమ్ముకోకుండా, ‘్భజనపరుల’ నివేదికలు చూసి భుజాలు చరచుకుంటున్న జగన్ అమాయకత్వానికి రెండు ఎన్నికలు సరైన ఫలితాలే ఇచ్చాయి. జ |