Andhrajamesbond
Kurra Bewarse Username: Andhrajamesbond
Post Number: 1860 Registered: 03-2004 Posted From: 68.93.142.53
Rating: N/A Votes: 0 | Posted on Sunday, September 03, 2017 - 9:51 am: | |
‘అక్క ఆర్భాటమే తప్ప బావ బతికుంది లేదన్నట్లు’.. కాపులను టిడిపికి ఎంత దూరం చేయాలన్నా ముద్రగడకు సాధ్యపడటం లేదు. కాకినాడ, నంద్యాల ఉప ఎన్నికలో ఆయన సామాజిక వర్గం టిడిపికి ‘కాపు’కాయడమే ఇందుకు నిదర్శనం. టిడిపిని ఓడించాలని పిలుపునిచ్చిన ముద్రగడ, పోనీ ఎవరిని గెలిపించాలనో చెప్పినా బాగుండేది. సొంత జిల్లాలోనే చెల్లని రూపాయి, రాష్ట్రంలో ఎలా చెల్లుతుందన్న ప్రశ్నాస్త్రాలు తన సామాజిక వర్గంలో పెరగడం సహజమే. తాజా ఫలితాల తర్వాత ఇక ముద్రగడకు- మీడియాలో ‘డైలీ సీరియల్ మాదిరి’ వస్తున్న ప్రచారానికి తెరపడక తప్పదేమో! |