Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Andhrajamesbond
Kurra Bewarse
Username: Andhrajamesbond

Post Number: 1676
Registered: 03-2004
Posted From: 171.161.160.10

Rating: N/A
Votes: 0

Posted on Monday, August 21, 2017 - 8:26 am:   

నంద్యాల్లో వైసీపీకి మెజారిటీ ఎంతంటే...!

August 20 , 2017 | UPDATED 03:30 IST





నంద్యాల్లో ప్రచార పర్వానికి మరి కొన్ని గంటల్లోనే తెరపడనుంది. ఇప్పుడు కాదు.. దాదాపు రెండు నెలల నుంచి ఒకటే ప్రశ్న.. ఎవరు గెలుస్తారు? రాష్ట్ర రాజకీయాలకు అత్యంత కీలకమైనదిగా భావించబడుతున్న ఉపఎన్నిక ఇది. ఇక్కడ గెలుపు ఎవరిది? అనేది ఒకే ప్రశ్న అయినా.. దీనికి సమాధానం మాత్రం అనే ప్రశ్నలకు జవాబుగా నిలవబోతోంది.

మూడేళ్ల బాబు పాలనపై ప్రజల్లో ఎలాంటి భావన ఉంది? అనే దానికి నంద్యాల బైపోల్‌ ఫలితం ఒక సమాధానం కాబోతోంది. ఇది మాత్రమే కాదు.. జగన్‌ రాజకీయ స్ట్రాటజీలు ఎంత వరకూ సక్సెస్‌ ఫుల్‌గా సాగుతున్నాయి? ప్రతిపక్ష నేతగా జగన్‌ను ప్రజలు ఎలా చూస్తున్నారు? జగన్‌ వెంట జనాలు ఏ మేరకు ఉన్నారు? అనే ప్రశ్నలకూ నంద్యాల బైపోలే ఒక సమాధానం అవుతుంది.

ఇక కీలకమైన మరో విషయం.. ఫిరాయింపు రాజకీయం. దీన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారా? అలా అడ్డదారి తొక్కినా సరేలే.. అనుకుంటున్నారా? అనేది అత్యంత ఆసక్తికరమైన అంశం. ఈ రకంగా చూస్తే నంద్యాల ఇరవై నియోజకవర్గాల ఫలితాలకు సమాధానం. నంద్యాల ప్రజలు ఫిరాయింపును ఛీదరించుకుని భూమా కుటుంబాన్ని ఓడించారని.. అంటే అది ఫిరాయించిన ఎమ్మెల్యేలందరికీ చెంపపెట్టు.

నంద్యాల ప్రజలు ఫిరాయింపును ఛీదరించుకుంటే.. అది మరో ఇరవై నియోజకవర్గాల ప్రజలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. నంద్యాల స్ఫూర్తితో ఫిరాయించిన ప్రతి ఎమ్మెల్యేనీ ఆయా నియోజకవర్గాల ప్రజలు ఛీదరించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నంద్యాల బైపోల్‌ ఫలితం భూమా కుటుంబానికి వ్యతిరేకంగా వచ్చిందంటే.. మాత్రం, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కౌంట్‌డౌన్‌ మొదలైనట్టే.. నిస్సందేహంగా!

ఒకవేళ భూమా ఫ్యామిలీ ఏ ఫ్యాక్టర్‌ చేత విజయం సాధించినా.. ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఇప్పటికే ఫిరాయించిన వాళ్లు.. తమ తమ నియోజకవర్గాల్లో ప్రత్యర్థులను మరింతగా తొక్కేసి తాము స్టాండ్‌ కావడానికి మరింత గట్టిగా పని చేస్తారు. అంతేకాదు.. మరిన్ని రాజకీయ ఫిరాయింపులు జరగవచ్చు కూడా! వైకాపా నుంచి మరికొంతమంది ఎమ్మెల్యేలు ఫిరాయించి.. తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది.

ఇక వైసీపీ అభ్యర్థి నెగ్గితే.. ఫిరాయింపు దారులంతా డిఫెన్స్‌లో పడిపోతారు. వీలైతే కొంతమంది తాము తిరిగి వచ్చేస్తామని జగన్‌కు వర్తమానాలు పంపుతారు. అలాగే జగన్‌ గ్రాఫ్‌ పెరుగుతుంది. చంద్రబాబుకు భయం మొదలవుతుంది. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో తెగదెంపులు చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తుంది. జగన్‌కు కన్నుగీటి.. సీట్ల బేరం మొదలుపెడుతుంది. ఒకవేళ వైసీపీ ఓడితే మాత్రం.. బీజేపీ తెలుగుదేశం పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ వీడదు. బాబు ముష్టిగా కొన్ని సీట్లను విసిరినా చాలన్నట్టుగా వ్యవహరిస్తుంది.

ఇలా చెప్పుకొంటూ పోతే.. నంద్యాల ఫలితం తర్వాత ప్రతిదీ రివర్స్‌లోనే ఉంటుంది. వైసీపీ గెలిస్తే ఒక సమీకరణాలు ఉంటాయి, ఓడితే మరో సమీకరణం ఉంటుంది. కానీ నంద్యాల నాడి రాష్ట్రానికి అంతా వర్తించకపోవచ్చు.. అయితే రాజకీయ పార్టీలు మాత్రం తమ భవిష్యత్తును నంద్యాల ఫలితాన్ని బట్టే అర్థం చేసుకునేలా ఉన్నాయి.

మరి ఇలాంటి నంద్యాల ఫలితం ఎలా ఉంటుందనే అంశం గురించి చెప్పమంటే.. పరిశీలకులు, విశ్లేషకులు, ఆయా పార్టీల అభిమానులు.. తలా ఒకమాట చెబుతున్నారు. ఒక్కోరి ఒక్కో లాజిక్‌! తెలుగుదేశం అంటే కొంచెం రుచి ఉన్న వాళ్లను అడిగితే.. ఆ పార్టీదే విజయం అంటారు. దానికి రీజన్‌ ఏమిటి? అంటే.. ఉపఎన్నిక ఖరారు అయ్యాకా.. భారీ స్థాయిలో డెవలప్‌ మెంట్‌ ప్రోగ్రామ్స్‌కు కొబ్బరికాయలు కొట్టడం, టీడీపీ చేతిలో అధికారం ఉండటం.. సాధారణంగా ఎక్కడ ఎలాంటి ఉప ఎన్నికలు జరిగినా అధికార పార్టీలే గెలుస్తూ ఉంటాయి.

కర్ణాటకలో కూడా మొన్న ఇలాగే జరిగింది. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి గెలిచినా.. ఏం చేయడానికి అవకాశం ఉండదనే భావన ప్రజల్లోకి రావడం, తాము గెలవకపోతే.. శంకుస్థాపన రాళ్లు రోడ్డుకు అడ్డంగా మిగిలిపోతాయని అధికార పార్టీ వాళ్లు బెదిరించడం.. తరహా వ్యూహాల వల్ల అధికార పార్టీ నెగ్గుతుందనేది ఒక విశ్లేషణ. ఇదంతా నిజం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఇక వైసీపీ వాళ్లను కదిలిస్తే.. చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ఉంది.. బాబు చేసిన మోసాలు అన్నీ ఇన్నీ కావు.. వాటన్నింటి ఫలితంగా.. తాము గెలవడం నల్లేరు మీద నడకే అనేమాట చెబుతున్నారు. ఈ విషయాన్ని అధికార పార్టీ కూడా అర్థం చేసుకుంది. అందుకే.. చివరి నిమిషంలో భారీగా డెవలప్‌ మెంట్‌ స్కీములు వేసింది. వాటికి ప్రజలు కన్వీన్స్‌ అయితే మాత్రం.. ప్రభుత్వ వ్యతిరేకత దూదిపింజ అవుతుంది.

ఇక మూడో అంశం.. నియోజకవర్గం. ఒక్కో నియోజకవర్గం ఒక పార్టీకి అండగా నిలబడిపోవడం అనేది ప్రజాస్వామ్యంలో కొత్త ఏమీకాదు. ఇలాంటి నియోజకవర్గాలు బోలెడన్ని ఉంటాయి. ఐదారు టర్మ్‌ల పాటు ఒకే పార్టీని గెలిపించే నియోజకవర్గాలు ఎన్నో ఉన్నాయి. సదరు పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా.. ఆ నియోజకవర్గం మాత్రం ఆ పార్టీ తరపునే నిలుస్తూ ఉంటుంది. నంద్యాలకు కూడా ఆ లక్షణాలు లేకపోలేదు. ఇలా చూస్తే.. వైసీపీకే అనుకూలత ఉంది. ఇలా పరస్పర వైరుధ్య అభిప్రాయాలను కలిగించి ఫ్యాక్టర్లు ఎన్నో ఉంటాయి.

అయితే ఇవన్నీ జస్ట్‌ ఎనలిస్టుల అభిప్రాయాలే. లాజికల్‌ రీజనింగులు, గత ఫలితాల ఎనాలిసిస్సులు.. వీటన్నింటినీ పరిశీలించిన పిమ్మట ఒక లాజికల్‌ కంక్లూజన్‌కు రావొచ్చు. ఈ కంక్లూజన్‌ ఒక్కోరికి ఒక్కోలా అనిపిస్తుంది.

మరి వీటన్నింటినీ పక్కన పెట్టి.. ప్రచారంలో ఉన్న వారిని కదిలిస్తే.. దాదాపు నెలన్నర నుంచి నంద్యాల్లోనే మకాం వేసిన ఔట్‌ సైడర్స్‌ అభిప్రాయాన్ని సేకరించి చూస్తే.. మాత్రం నంద్యాల ఫలితం గురించి అడిగి చూస్తే.. వారూ ఒకమాట చెప్పారు. ఇలాంటి వారి నుంచి వినిపించిన మాటేమిటంటే.. వైసీపీ మెజారిటీపై ఒక అంచనా!

ఇది అధికార పార్టీ ప్రచార ట్రూపులోని వారి మాట. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక రాజకీయ నేత అనుచరగణం నంద్యాల్లో భారీ ఎత్తున దిగింది. నెలన్నర నుంచి టీడీపీ తరపున ప్రచారం చేస్తోంది ఆ గ్యాంగ్‌. వీళ్ల బాస్‌కు ఇటీవలే చంద్రబాబు మంచి ప్రమోషన్‌ కూడా ఇచ్చాడు. ఆ ఉత్సాహం కొద్దీ ఆయన నంద్యాల్లో తన మనుషులను దించి.. ప్రచారం చేయిస్తున్నాడు. అలాంటి గ్యాంగ్‌ వద్ద పరిస్థితి గురించి ఆరాతీస్తే.. పదిహేను వేలు గ్యారెంటీ అనే మాటతో తేల్చేశారు. బెట్టింగులే వేసుకుంటారో.. ముందుగా పండగా చేసుకుంటారో కానీ.. వైసీపీకి పదిహేను వేల మెజారిటీ గ్యారెంటీ అనే అభిప్రాయాన్ని వినిపించారు.

వాళ్లు లాజికల్‌గా ఆలోచించే వాళ్లు కాదు, మేధావులు అంతకన్నా కాదు, సమీకరణాల లెక్కలు తెలిసిన వాళ్లు కాదు.. నెలన్నర నుంచి నంద్యాల్లో తిరుగుతున్న వాళ్లు మాత్రమే.. వాళ్లు చెప్పిన మాట ఇది. క్షేత్ర స్థాయిలో తిరిగిన, తిరుగుతున్న వారి జడ్జిమెంట్‌కు మించి అంచనాలు ఏముంటాయి? ఫలితాలు వచ్చే వరకూ వీరి మాటే పరమావధి!

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration