Kubang
Celebrity Bewarse Username: Kubang
Post Number: 36210 Registered: 09-2011 Posted From: 161.141.1.1
Rating: N/A Votes: 0 | Posted on Monday, July 17, 2017 - 12:26 pm: | |
ఈనాడు, హైదరాబాద్: కల్తీ ఆహార కాటు నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యంగా మారింది. అధీకృత సంస్థల ఉత్పత్తులను కూడా కొందరు కేటుగాళ్లు కల్తీ చేస్తున్నారు. చివరికి పిల్లలు తాగే పాలనూ వదలడం లేదు. ప్రముఖ సంస్థల బ్రాండ్ల పాలల్లో కూడా కల్తీ జరుగుతున్నట్లు గతంలో గుర్తించడంతో వినియోగదారులు విస్తుపోయారు. టీ పొడి మొదలు సర్వం కల్తీ అవుతున్నాయి. వంటల్లో వేసే అల్లం మిశ్రమం మసాలాలనూ వదలడం లేదు. టాస్క్ఫోర్సు పోలీసు దాడుల్లో ఎన్ని కేసులు నమోదు చేస్తున్నా కల్తీ కేటుగాళ్లకు అడ్డుకట్ట పడటం లేదు. ఎవరో వస్తారు.. ఏదో చేస్తారు... అని ఎదురు చూసే కంటే స్వయంగా ఎవరికి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కల్తీల నుంచి కొంత వరకు రక్షించుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లో వస్తువులు కొనేముందు కూడా జాగ్రత్తలు పాటించడం ద్వారా కల్తీ కాటు పడకుండా చూసుకోవచ్చునని పేర్కొంటున్నారు Ignorance is bliss
|