Ramu
Yavvanam Kaatesina Bewarse Username: Ramu
Post Number: 7651 Registered: 03-2004 Posted From: 204.63.44.145
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, May 30, 2017 - 3:18 pm: | |
కర్ణుడు, అర్జునుడు స్టోరీ ని సోషలైజ్ చేసి తీసిన దాసరి సినిమా కట కటాల రుద్రయ్య... అది వచ్చిన 25 సంవత్సరాలకి మణిరత్నం దాదాపు అదే కథతో (కాకపోతే దుర్యోధన పాత్రని కలిపి దానికి, కర్ణుడి పాత్రకి ఎక్కువ సీన్స్ పెట్టాడు) దళపతి అని తీసాడు... తండ్రీ కొడుకులు ఇద్దరూ న్యాయం కోసం చట్టానికి ఒకరు అటు ఒకరు ఇటు నిలబడిన పాత్రలతో తీసిన సర్దార్ పాపారాయుడి ని బేస్ చేసుకొని తీసిన సిన్మాలు భారతి రాజా తీసిన ఒరు ఖైదియిన్ డైరీ (తెలుగు లో ఖైదీ వేట, హిందీ లో భాగ్య రాజా తీసిన ఆఖ్రీ రాస్తా), వి.వి. వినాయక్ తీసిన చెన్న కేశవ రెడ్డి ఒక సాధారణ మహిళ సినీ హీరోయిన్ అవ్వటం, ఐనాక ఎదుర్కొన్న పరిస్తితుల ని బేస్ చేసుకొని ఈయన 78 లో శివరంజని తీస్తే 1996 లో రాంగోపాల్ వర్మ రంగీలా తీసాడు.. పేదింటి కార్మికుడు తను పనిచేసే కంపెనీ యజమానురాల్ని పెళ్ళి చేసుకోవటం తదనంతర పరిణామాలు బేస్ చేసుకుని ఈయన తీసిన సీతారాములు సినిమా తరువాత రజనీకాంత్-విజయశాంతి-ఖుష్బూ నటించిన మన్నన్, చిరంజీవి-నగ్మ-వాణి విశ్వనాథ్ నటించిన ఘరానామొగుడు (వీటన్నిటికీ మూలం అన్నగారు నటించిన నిన్నే పెళ్ళాడతా).. తాను చనిపోతానని తెలిసి తాను ప్రేమించిన అమ్మాయికి వేరే వాళ్ళతో పెళ్ళి అయ్యేటట్లు చూసి తన ప్రేమని హీరో త్యాగం చేసే ఇతివృత్తంతో వచ్చిన ప్రేమాభిషేకం లోని పాయింట్ ని మార్చి (హీరోయినె త్యాగం చెయ్యటం) తీసిన సినిమాలు బొబ్బిలి సిమ్హం, బద్రి, మావి చిగురు.. rAmu(Du) manci bAluDu cinnappaTinuncI intE
|