Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Lovebewarsetalk
Kurra Bewarse
Username: Lovebewarsetalk

Post Number: 4662
Registered: 08-2014
Posted From: 183.82.98.78

Rating: N/A
Votes: 0

Posted on Monday, April 17, 2017 - 7:41 am:   

జయపుర: ‘రాష్ట్రపతి’ మేకల్ని మేపడానికి వెళ్లాడు.. ‘ప్రధానమంత్రి’ సరకులు కొనడానికి పట్టణానికి వెళ్లాడు. ‘హైకోర్ట్‌’ ఎక్కడికి వెళ్లాడు..? ఉదయం నుంచి కన్పించడంలేదు. ఏంటిది? మన దేశ నేతలు.. వ్యవస్థల గురించి అలా మర్యాదలేకుండా మాట్లాడుతున్నారని అనుకుంటున్నారా? ఇవన్నీ రాజస్థాన్‌కి చెందిన గ్రామస్థుల పేర్లు. ఇంతకీ ఈ పేర్ల వెనకున్న కథేంటంటే..

రాజస్థాన్‌లో రాంనగర్‌ పేరిట ఓ చిన్న గ్రామం ఉంది. ఈ గ్రామంలో సుమారు 500 మంది జనాభా నివసిస్తున్నారు. ఈ గ్రామంలో పుట్టిన పిల్లలందరికీ వెరైటీగా శాంసంగ్‌, కలెక్టర్‌, హైకోర్ట్‌, చిప్‌, సిమ్‌ కార్డ్‌ అని విచిత్ర పేర్లుతోనామకరణం చేస్తుంటారు.

వీరి పేర్లు చూసి వాటికి తగ్గట్టే చదువులుంటాయని మాత్రం అనుకోకండి. ఈ గ్రామంలో ఏ ఒక్కరికీ సరైన చదువు లేదు. చిన్నచితకా పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం జిల్లా కలెక్టర్‌ ఈ రాంనగర్‌ గ్రామాన్ని సందర్శించారు. అప్పుడు ఆ కలెక్టర్‌ పని తీరు నచ్చి ఇదే గ్రామానికి చెందిన ఓ మహిళ తన మనవడికి ‘కలెక్టర్‌’ అని పేరుపెట్టింది. ఇప్పుడు ఆమె మనవడికి 50 ఏళ్లు. ఇప్పటివరకు అతను స్కూల్‌కెళ్లిందిలేదు. అంతేకాదు ఒక్కోసారి వ్యక్తిగత సమస్యల వల్ల గ్రామస్థులు పోలీస్‌స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతుంటారు. అప్పుడు జనం పోలీసులకు, న్యాయవాదులకు ఇచ్చే మర్యాదలు చూసి తమ పిల్లలకి ఐజీ, ఎస్పీ, మేజిస్ట్రేట్‌ అని కూడా పేర్లు పెడుతున్నారని ఇక్కడే పనిచేస్తున్న ఓ ప్రభుత్వ ఉద్యోగి తెలిపాడు.

ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పుట్టుకతోనే అవిటివాడు. అతను పుట్టినప్పుడు అతని తాతయ్యకి ఓ కేసు విషయంలో హైకోర్ట్‌ నుంచి బెయిల్‌ వచ్చింది. దాంతో అతనికి ‘హైకోర్ట్‌’ అని పేరుపెట్టేశారు. ఈగ్రామానికి బదిలీపై వచ్చే అధికారులు వారి పేర్లు విని షాకయ్యేవారట. ఆ తర్వాత నిదానంగా వారికి, వారి విచిత్ర పేర్లకి అలవాటుపడుతున్నారట.
MOVIEART--bemmi.lol1

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration