Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 60923 Registered: 05-2004 Posted From: 73.191.151.120
Rating: N/A Votes: 0 | Posted on Thursday, January 26, 2017 - 11:33 am: | |
జల్లికట్టు కోసం తమిళ యువత చేసిన ఆందోళనను స్పూర్తిగా తీసుకుని ప్రత్యేక హోదా కోసం పోరాడాలని, విశాఖ ఆర్కే బీచ్లో జరిగే ఆందోళనలో పాల్గొనాలని ఏపీ యువత పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే జల్లికట్టు నుంచి స్పూర్తి పొందడం అనే అంశంపై కేంద్ర మంత్రి సుజనా చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జల్లికట్టు నుంచి స్పూర్తి పొందితే కోళ్ల పందేలు, పందుల పందేలు వేసి ఆడుకోవాలని కాస్త ఘాటుగా స్పందించారు. ఈ వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా బదులిచ్చారు. యువత పోరాట స్పూర్తిని సుజనా చౌదరి గారు పందుల పందాలతో పోల్చడం బాధాకరమని పవన్ ట్వీట్ చేశారు. ఇంక మీరు నోరు జారే కొద్దీ యువతను రెచ్చగొట్టినట్టేనని, సరే అలాగే కానివ్వండి అంటూ పవన్ ట్వీట్ చేయడం కొసమెరుపు. అలాగే కానివ్వండి అంటూ పవన్ ట్వీట్ చేయడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. KN150 Review
|