Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 9058 Registered: 03-2004 Posted From: 24.249.211.73
Rating: N/A Votes: 0 | Posted on Monday, September 19, 2016 - 1:44 pm: | |
ఓ ప్రైవేట్ ఫంక్షన్లో పాల్గొనేందుకు విజయవాడకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరిస్థితులు అనుకూలిస్తే 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీఆర్ఎస్ పోటీ చేస్తుందని నాయిని వ్యాఖ్యానించారు. ప్రజలు కోరితే ఏపీలో పోటీ చేయడానికి టీఆర్ఎస్ సిద్ధంగా ఉందన్నారు. కేంద్రం ఏపీతో సమానంగా తెలంగాణకు న్యాయం చేయాలని నాయిని కోరారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని ఆయన కితాబిచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమస్యలను సృష్టించి, తమపైనే విమర్శలు చేస్తున్నారని నాయిని ఆరోపించారు. |