Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 8936
Registered: 03-2004
Posted From: 68.109.27.99

Rating: N/A
Votes: 0

Posted on Saturday, July 23, 2016 - 11:00 pm:   


Musicfan:




Rao garu, mee kosam sunitha akka interview...

Family issues...


అవును. సునీత గాయని. ఎన్నో పాటలు పాడారు. అవును. సునీతకు గాయం అయింది. ఎన్నో పాట్లు పడ్డారు. మ్యారేజ్... మానని గాయం అయింది. ఇది... గాయని గాయం. - సునీత
* ఈ ఇంటర్వ్యూ చూసి ఎందుకమ్మా డాడీ గురించి ఇలా చెప్పావని మీ పిల్లలు అడుగుతారేమో..?
నా కొడుక్కి 17 ఏళ్లు, కూతురికి 14 ఏళ్లు. ‘మీ డాడీ ఇలా’ అని నేను పనిగట్టుకుని వాళ్లకు ఎప్పుడూ చెప్పలేదు. అయినా వాళ్లకు తెలుసు. అందుకని అడగరేమో. నా ఇష్యూ పక్కన పెడదాం. నో మేటర్ హి ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్.. రెస్పాన్సిబుల్ ఆర్ నాట్? హీ ఈజ్ డాడ్. పిల్లలతో పిలిపించుకోవడానికి కాదు.. వాళ్ల బాగోగులు పట్టించుకున్నప్పుడే రియల్ డాడ్ అవుతాడు.

* మీ బ్రేకప్ పిల్లలపై ఏమీ ప్రభావం చూపించలేదా?
ఏమీ లేదు. మోసం చేసే లక్షణం అవతలి వ్యక్తికి ఉండటం వలన దూరం పెట్టాల్సి వచ్చింది. మనుషులు మారతారేమో అని ఎదురు చూశాను.. మారలేదు. నేను విడాకులు తీసుకున్నానని అందరూ అనుకుంటారు. కానీ, అది నిజం కాదు. విడి విడిగా ఉంటున్నాం.

* విడిగా ఉండటం మొదలుపెట్టాక కొత్త విషయాలు ఏమైనా అర్థం అయ్యాయా?
కలిసి ఉన్నప్పుడు ఎంత అజ్ఞానంలో బతికాననేది విడిపోయిన తర్వాత తెలిసింది. మా ఇద్దరికీ పరిచయం ఉన్నవాళ్లలో కనీసం నలుగురు వ్యక్తుల దగ్గరైనా నాకు తెలియకుండా డబ్బులు తీసుకున్నాడు. ‘ఎందుకలా చేశావ్?’ అని అడిగితే.. ‘నిన్ను ఇవ్వమని అడిగారా.. అడగలేదు కదా.. ఎందుకు బాధపడుతున్నావ్’ అనేవాడు. అంత కూల్‌గా ఎలా ఉండగలుగుతాం? డబ్బులిచ్చిన ప్రతివాళ్లూ... మీ పేరు చెప్పడంవల్లే ఇచ్చామన్నారు.
* సింగర్‌గా మీరు 21 ఇయర్స్ ఇండస్ట్రీ.. కొత్త సింగర్స్ వస్తున్నారు కదా... ఇన్‌సెక్యూరిటీ ఏమైనా?
కాన్ఫిడెన్స్ లేకపోతే ఇన్‌సెక్యూరిటీ స్టార్ట్ అవుతుంది. అప్పట్లో నేను, కౌసల్య, ఉష ఎక్కువ పాటలు పాడేవాళ్లం. ఉషను ఆర్పీ పట్నాయక్, కౌసల్యను చక్రి ఎంకరేజ్ చేశారు. నాకలా ఎవరూ ఉండేవారు కాదు. అప్పుడే ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ రాలేదు. ఇప్పుడెందుకు వస్తుంది?

* మరి.. మీకంటూ పర్టిక్యులర్‌గా ఎంకరేజ్ చేసే మ్యూజిక్ డెరైక్టర్‌ని ఎందుకు సంపాదించుకోలేకపోయారు?
ఎవరు ఎవర్ని ఎంకరేజ్ చేయాలనే విషయంలో ఎవరి కారణాలు వాళ్లకు ఉండొచ్చు. సింగర్‌గా వచ్చినప్పుడు నేను మరీ చిన్నపిల్లని కాదు. మరీ పెద్దమ్మాయిని కాదు. చాలా చిన్న వయసులో పెళ్లయింది. ‘హౌ ఓల్డ్ యు ఆర్?’ అనేది ఎవరూ ఆలోచించరు. పెళ్లయితే ‘ఓల్డ్’ కింద జమ చేస్తారు. యూత్‌ఫుల్ సాంగ్స్ ఇవ్వడానికి వెనకాడతారు. ఎంకరేజ్‌మెంట్ గురించి పక్కన పెడితే.. నాకు అందరి మ్యూజిక్ డెరైక్టర్ల దగ్గర పాడే చాన్స్ లభించింది. దాంతో ఒకరు ప్రమోట్ చేయాల్సిన అవసరం ఏముంది?

* ఏ వయసులో పెళ్లి చేసుకున్నారు?
19 ఏళ్లకే చేసుకున్నాను. ఇప్పుడు నాకు 37 ఏళ్లు.

* 19 ఏళ్ల వయసులో పెళ్లంటే.. మానసికంగా మెచ్యూర్టీ లెవల్స్ అంతగా ఉండే అవకాశం లేదు కదా?
అవును.. మెంటల్‌గా మెచ్యూర్టీ లెవల్స్ లేని టైమ్‌లో పెళ్లి చేసుకున్నా. జీవితం అంటే ఏంటో కూడా అవగాహన లేదప్పుడు. చాలామంది పైకి ఆనందంగా కనిపిస్తున్నవారిని చూసి, ‘ఎవ్విరీ థింగ్ ఈజ్ ఫైన్’ అనుకుంటారు. కానీ, కాంప్రమైజ్‌లు, ఎన్నో త్యాగాలు చేస్తే.. ఎవరైనా ఇద్దరు వ్యక్తులు కలసి చాలా హ్యాపీగా ఉంటారు. అందర్నీ అనడం లేదు. కొన్ని జంటల పరిస్థితి మాత్రం ఇదే.
* అంటే.. మీరు త్యాగాలు చేశారా? రాజీ పడ్డారా?
నా పిల్లలకు మంచి జీవితం ఇవ్వడం కోసం పదేళ్లు పైనే రాజీపడ్డాను. ఎన్నో త్యాగాలు చేశాను.

* అసలు మీ వైవాహిక జీవితం ఎలా గడిచింది?
‘ఐయామ్ ద బ్రెడ్ అండ్ బటర్ ఫర్ మై ఫ్యామిలీ’. మా అత్తగారు, మామగారు, మామగారి అమ్మ, మా అమ్మానాన్న, నాన్నమ్మ, పిల్లలు... అందరి బాధ్యత నాదే. బాగా ఎనర్జిటిక్‌గా ఉన్నప్పుడు ఝాన్సీ లక్ష్మీభాయిలా అనిపిస్తుంది. అందరి బాగోగులూ చూస్తాం. జీవితంలో అలసట ప్రారంభమైనప్పుడు మొదలవుతుంది అసలు సమస్య. ఇంత చేస్తున్నాం.. మన గురించి ఎవరూ పట్టించుకోవడం లేదేంటి? మన గురించి ఆలోచించేవాళ్లు లేరా? అనిపించినప్పుడు అంతా కొలాప్స్ అవుతుంది.

* పదేళ్లు ఎలాగూ రాజీపడ్డారు.. ఆ తర్వాత ఇక విడిపోవాలని నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణం ఏదైనా ఉందా?
పిల్లలకు మంచి జీవితం ఇవ్వాలనేది నా తపన. ఎదుటి వ్యక్తి సరైన మార్గంలో నడవటం లేదు. పిల్లలను కనడం మాత్రమే కాదు, విలువలు తెలియజేయాలి. ఇంట్లో మనల్ని చూసి నేర్చుకోవడం పిల్లల అలవాటు. బాధ్యత ఉన్న వ్యక్తిని చూసి ఎంత నేర్చుకుంటారో... బాధ్యతారాహిత్యమైన వ్యక్తిని (భర్త కిరణ్‌ని ఉద్దేశించి) చూసి, బంధాలకు విలువ ఇవ్వనివాళ్లను చూసి కూడా అంతే నేర్చుకుంటారు. పెరిగే వయసు కదా. అందుకే, ఇక కాంప్రమైజ్ కాదల్చుకోలేదు.

* అఫ్‌కోర్స్ పడేవాళ్లకే బాధ తెలుస్తుంది... కానీ, ఎలా ఉన్నా సర్దుకుపోవాలని మన సమాజం చెప్తుంది కదా?
నా పిల్లల స్కూల్ ఫీజ్ కట్టమని, నేను ఎమోషనల్‌గా డౌన్ అయినప్పుడు ఓదార్చమని సమాజానికి చెప్పండి. నేను రోడ్డు మీద వెళ్తుంటే నా గురించి చెడుగా మాట్లాడే వాళ్ల నోళ్లు మూయించమని చెప్పండి. నా పిల్లలకి సమాధానం చెప్పమనండి. ప్రతి నెలా నాకు ఇంత అమౌంట్ ఇవ్వమనండి. ఆ డబ్బుతో నా కుటుంబాన్ని చూసుకోవడంతో పాటు సమాజసేవ కూడా చేస్తా.

* విడిపోవాలనుకున్న తర్వాత మీ పిల్లలతో డిస్కస్ చేశారా?
ఏదీ డిస్కస్ చేయాల్సిన అవసరం లేకుండానే.. ఎవరేంటి? ఎవరేం చేస్తున్నారు? అనేది వాళ్లు చూశారు. నేను చేసిన మంచి పని ఏంటంటే.. ఎదుటి వ్యక్తి గురించి పిల్లల దగ్గర చెడుగా చెప్పలేదు. ఎవరంతట వాళ్లు తెలుసుకోవాలని నేను నమ్ముతాను.

* మీది లవ్ మ్యారేజ్ కదా?
ఇట్స్ నాట్ ఏ లవ్ మ్యారేజ్. కానీ అటువంటిదే.

* అసలేంటి మీ ఇద్దరి మధ్య సమస్య?
జీవిత భాగస్వామిని నమ్మాలి, నమ్మాను. అవతలి వ్యక్తి తప్పులు చేసి, వాటిని కప్పిపుచ్చే ప్రయత్నం చేసినప్పుడు ఊరుకోగలమా? ఎవ్వరినైనా భరించవచ్చు గానీ, పక్కనే ఉంటూ మోసం చేస్తూ, బయట అమ్మా.. బుజ్జీ.. కన్నా.. అంటూ మాట్లాడేవాళ్లని భరించలేం. ‘హి చీటెడ్ మి’.

* ఇప్పుడు ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తే మీ గురించి ఇలా..
(ప్రశ్న పూర్తికాక ముందే..) తనకంటే దేవత ఈ ప్రపంచంలో లేదని చెప్తాడు. నా అవసరం తనకుంది.

* ఏంటా అవసరం?
సునీత భర్త కాకపోతే అతనికి బయట ఐడెంటిటీ లేదు. ‘సునీత చాలా కష్టాల్లో ఉంది. అడగలేకపోతోంది. నా కూతురికి ఏదో అవసరం వచ్చింది’ అని నా పేరు వాడుకోకపోతే డబ్బులు ఎవరిస్తారు?

పిల్లలు మీతోనే ఉంటున్నారు కదా.. నాన్నతో ఉంటామని ఎప్పుడూ అనరా?
వాళ్లకా డిఫరెన్స్ కూడా తెలియకుండా పెంచానని గర్వంగా చెప్పగలను. నేనేదో గొప్ప పని చేశానని ఫీలవడం లేదు కానీ అలా పెంచే అవకాశం వచ్చింది. సింగిల్ హ్యాండెడ్‌గా రెండు రోల్స్ (అమ్మానాన్న) ప్లే చేయలేమా? దీన్నో సవాలుగా స్వీకరించాను. ఇండియాలో మంచి యూనివర్శిటీలో నా కొడుకు చదువుతున్నాడు. అది తల్లిగా నాకో గర్వం. వాళ్లకి ఓ మంచి జీవితాన్ని ఇస్తున్నాను. అంతకంటే ఏం కావాలి? వాళ్ల నాన్న ప్రభావమో.. మరొకటో.. వాడికి సినిమాల్లోకి రావాలనుంది. పీజీ వరకూ చదివి ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అన్నా. ‘వాటీజ్ గుడ్.. బ్యాడ్.. రియల్’ అనే విషయాలపై అప్పటికి వాడికి ఓ క్లారిటీ వచ్చేస్తుంది కదా.




* ఇప్పటికీ అలా జరుగుతోందా?
ఇంకా ఎవరైనా డబ్బులు ఇస్తున్నారంటే.. వాళ్లంత ఫూలిష్ ఎవరూ ఉండరు.

* విడాకులు ఇవ్వమని అడగలేదా?
ఇవ్వడు. ‘నీకు విడాకులు కావాలని ఎంత గొడవ చేసినా, ఇవ్వను’ అని భయపెడతాడు.

* ఫైనాన్షియల్ విషయాలు పక్కన పెడితే.. అతని క్యారెక్టర్??
నా దృష్టిలో భార్యాపిల్లల పట్ల బాధ్యతగా లేనివాడు క్యారెక్టర్‌లెస్ ఫెలోనే. ఈ రోజుకీ నా కొడుకు ఏ యూనివర్శిటీలో చదువుతాడో అతనికి తెలియదు. తెలుసుకోవాలని అనుకోడు. అంత ఇర్రెస్పాన్సిబుల్.

*వృత్తిపరంగా సక్సెస్ అయిన మీరు వ్యక్తిగతంగా నిలవకూడని వార్తల్లో నిలవడం.. ఓ రాజకీయనాయకుడితో కూడా...?
మధు యాష్కీగారితో ఎవరికి శత్రుత్వం ఉందో నాకు తెలియదు. దానికి నేను బలయ్యాను. ఓ బ్యూటిఫుల్ సింగర్‌తో ఆయనకేదో ఉందని వార్తలు రాయడం మొదలుపెట్టారు. ఉన్న బ్యూటిఫుల్ సింగర్స్‌లో నేనూ ఒకదాన్ని కావడంతో చాలామంది నా పేరు ఫిక్స్ చేసేశారు. అదెంత అన్యాయమో చెప్పండి. నా పక్కన ఓ స్ట్రాంగ్ పర్సన్ ఉండి ఉంటే ఇలాంటి రూమర్స్ వస్తాయా? లేకపోవడంతో ఎవరైనా ఏదైనా మాట్లాడొచ్చు అన్నట్లయిపోయింది. భర్త ఎలా ఉన్నా సర్దుకుపోయి ఉంటే ‘సునీత గ్రేట్’ అని గొప్పగా మాట్లాడుకునేవారు. లింకప్ రూమర్స్ కూడా వచ్చి ఉండేవి కావు. నన్ను ఎమోషనల్‌గా టార్చర్ చేసిన వాళ్లు చాలామంది ఉన్నారు. నా పర్సనల్ లైఫ్‌లో వచ్చిన సమస్యల కారణంగా చాలా అవకాశాలు తగ్గాయి. ఆ తర్వాత వాళ్లంతట వాళ్లే తెలుసుకుని ‘మేం తప్పు చేశాం.. సారీ’ అని చెప్పి, అవకాశం ఇస్తున్నారు. నాతో పరిచయం లేనివాళ్లు నా గురించి ఏవేవో మాట్లాడతారు. పరిచయం అయ్యాక ‘మీరింత మంచి మనిషి అనుకోలేదు’ అంటారు.
* ఇంకో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా..?
నా పిల్లలు, స్నేహితులు.. నా చుట్టూ మంచి వ్యక్తులు ఉన్నారు. అందరూ నా ఎమోషన్స్‌ని అర్థం చేసుకునేవాళ్లే. అందుకే, నాకు మళ్లీ పెళ్లి చేసుకునే అవసరం కనిపించడం లేదు.

*ఈ మధ్య రహస్యంగా పెళ్లి చేసుకున్నారని ఓ వార్త... చేసుకోబోతున్నారని మరో వార్త వినిపించాయి.
విడిపోయాక అతని తాలూకు వాళ్లు నాతో లేరు. నా పిల్లలు, అమ్మా, నాన్న, నానమ్మ... నా చుట్టూ మనుషులే. ఇల్లీగల్ రిలేషన్‌షిప్ పెట్టుకోవాలనుకునేవారు ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు. నా ఇంటికి వచ్చి నా చుట్టూ ఉన్న మనుషులను చూసిన తర్వాత, ‘ఈవిడగార్ని పెళ్లి చేసుకుంటే మన పరిస్థితి అంతే’ అనుకోనివాళ్లు ఉండరు.
* మీరు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌లో ఉన్నారనే వార్త కూడా...?
సదరు కిరణ్‌గారి వల్లే ఈ పేరు కూడా వచ్చింది. నాకు ఒక్క పైసా అప్పు చేసే అలవాటు లేదు. ఉంటే తింటాను. లేకపోతే లేదు. నా డిగ్నిటీని వదులుకునే పనులు ఏ రోజూ చేయలేదు. చేయను. అలాంటిది సునీత ఫైనాన్షియల్‌గా ఇబ్బందుల్లో ఉందని చెప్పి, నా క్యారెక్టర్ బ్యాడ్ చేశాడు. ‘సునీత నన్ను ఇంట్లోంచి వెళ్లగొట్టింది. తినడానికి తిండి లేదు. వారం రోజులుగా హాస్పిటల్‌లో ఉన్నాను, ఎవ్వరూ పట్టించుకోవడం లేదు’ అని చెప్పుకున్నవాడు విడాకులు ఎందుకు ఇవ్వడం లేదు?

* మీ భర్తని మార్చుకోవడానికి ప్రయత్నించవచ్చు కదా..?
సగం తెలిసినవాడితో మాట్లాడొచ్చు. తెలియనివాడికి తెలియజెప్పొచ్చు. అన్నీ తెలిసిన వాళ్లను మార్చలేం కదా. వాళ్లు పరమ మూర్ఖుల కింద లెక్క.

*కిరణ్ గారి గురించి మీరింత ఘాటుగా ఎక్కడా మాట్లాడినట్లు లేదు. ఇప్పుడెందుకు ఇంతలా రియాక్ట్ అవుతున్నారు..?
ఒకప్పుడైతే.. చెప్పేదాన్ని కాదేమో. ఇప్పుడెందుకు మాట్లాడుతున్నానంటే నా సహనాన్ని పీక్స్‌లో పరీక్షించాడు. ఎవరికీ తె లియకుండా ఎంత ఏడ్చానో నాకే తెలుసు (చెమర్చిన కళ్లతో). ‘తిన్నావా.. ఏ సినిమా చూశావ్? ఎలా ఉన్నావ్?’ అని కొడుక్కి ఫోన్ చేసి, మాట్లాడతాడు. ఫైనాన్షియల్‌గా కాకపోయినా పిల్లాడికి ఏ కాలేజ్ మంచిది? ఏం చేస్తే మంచిది?.. ఇవన్నీ మాత్రం పట్టించుకోడు (కన్నీళ్లు పెట్టుకుంటూ).
* బాధ నుంచి బయటపడడానికి సైకియాట్రిస్ట్‌ని ఏమైనా..?
ఆరేళ్ల క్రితం ఓసారి, రీసెంట్‌గా మరోసారి సైకియాట్రిస్ట్‌ని కలిసి డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి టాబ్లెట్స్ కూడా తీసుకున్నాను. ఇవన్నీ ఎవరికి తెలుసు? ఇక్కడ ఆశ్చర్యం వేసే విషయం ఏంటంటే.. సొసైటీలో ఓ వ్యక్తి గురించి ఒక రకమైన ఇంప్రెషన్ ఉంటుంది. వాళ్ల జీవితం గురించి తెలుసుకోకుండానే ఓ అభిప్రాయం ఏర్పరచుకుంటారు. అది చాలా తప్పు.

*చివరిసారిగా అతనితో ఎప్పుడు మాట్లాడారు..?
రీసెంట్‌గా మాట్లాడాను. ‘ఎందుకిలా ?.. డబ్బుల గురించి వదిలెయ్. బాధ్యత తీసుకో. పిల్లాడు పెద్ద చదువులకు వెళుతున్నాడు. గెడైన్స్ ఇవ్వు’ అన్నాను. ‘నాకంటే నీకు బాగా తెలుసు కదమ్మా’ అన్నాడు. తప్పించుకునే తత్వం అది. ఏ భార్య అయినా భర్త నుంచి కోరుకునేది ‘నీకు నేను ఉన్నాను’ అనే నమ్మకం. పక్కన ఉంటూనే దారుణంగా మోసం చేశాడు. ఏ మనిషికైనా మారడానికి కాస్త టైం ఇవ్వాలి. ఎక్కువ టైమ్ ఇచ్చి చూశాను కాబట్టి.. ఇప్పుడు అతని గురించి ఓపెన్‌గా మాట్లాడా.

* ప్రస్తుతం మీ కెరీర్ ఎలా ఉంది..?
బాగుంది.. కాకపోతే తమన్, దేవిశ్రీ ప్రసాద్, అనూప్‌ల టైమ్ కదా. వాళ్లు కొత్త వాయిస్‌ల కోసం చూస్తున్నారు. తమన్ దగ్గర తప్ప మిగతా ఇద్దరి సంగీతంలోనూ పాడాను. ఈ రోజున వాయిస్ ప్రాసెస్ చేసే పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరు పాడినా ఓకే అన్నట్లుగా ఉంది. అనుభవమున్న సింగర్ కావాలనే రూల్ లేదు.

* ఒకవేళ మీ రెమ్యునరేషన్ ఎక్కువేమో ?
నాకు డబ్బులు ఇవ్వాల్సినవాళ్ల లిస్టు ఇస్తా. సగం మీరు తీసుకుని సగం నాకు ఇవ్వండి (నవ్వుతూ). డబ్బుల గురించి ఏనాడూ ఆలోచించలేదు. పిలిచి పాట ఇస్తే పాడేస్తా.

* ఫైనల్లీ... మీ యాంబిషన్ ఏంటి..?
మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్ పెట్టాలనుంది. ఆన్‌లైన్ క్లాసులు స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. శారీస్, డ్రెస్ డిజైనింగ్ స్టార్ట్ చేయాలని ఉంది. డిజైనింగ్ అంటే నాకు చాలా ఇంట్రస్ట్.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration