Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 27570
Registered: 08-2008
Posted From: 116.88.66.65

Rating: N/A
Votes: 0

Posted on Wednesday, June 22, 2016 - 9:56 am:   

తెలుగు భాషకు ఏ ప్రాతిపదికన ప్రాచీన హోదా ఇచ్చారు?
కేంద్రాన్ని ప్రశ్నించిన మద్రాసు హైకోర్టు
ఆధారాలివ్వాలని ఆదేశం
విచారణ జూలై 13కు వాయిదా


ఆంధ్రజ్యోతి, చెన్నై: తెలుగు, మలయాళం, కన్నడ భాషలకు ఏ ప్రాతిపదికగా ప్రాచీన హోదా కల్పించారంటూ మద్రాసు హైకోర్టు ప్రథమ ధర్మాసనం కేంద్రప్రభుతాన్ని ప్రశ్నించింది. వేటి ఆధారంగా ఆ భాషలకు ప్రాచీనహోదా కల్పించారో సవివరంగా నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ భాషలకు ప్రాచీన హోదా కల్పించటాన్ని సవాలు చేస్తూ సీనియర్‌ న్యాయవాది ఆర్‌.గాంధీ మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషనపై ఏళ్ల తరబడి విచారణ కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆరువేలకు పైగా భాషలున్నాయని, అందులో గ్రీకు, లాటిన, హిబ్రూ, తమిళం, సంస్కృతం, చైనీస్‌ భాషలకు మాత్రమే ప్రాచీన హోదా కల్పించారని, రెండువేల సంవత్సరాలకు పైబడిన చరిత్ర, సాహిత్య అంశాలు కలిగిన గ్రంథాలు మెండుగా ఉండే భాషకే ప్రాచీన హోదా కల్పించటం ఆనవాయితీగా వస్తోందని పిటిషనర్‌ వివరించారు. ఈ అర్హతలు లేని కారణంగా ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన భాషలుగా చెప్పబడుతున్న అరబిక్‌, పర్షియన భాషలు కూడా ప్రాచీన హోదాను పొందలేకపోయాయని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో 2005లో కన్నడం, తెలుగు భాషలకు, 2013లో మలయాళ భాషకు, 2014లో ఒడియా భాషకు కేంద్రప్రభుత్వం ప్రాచీనా హోదాను ప్రకటించింది. భాషాపటుత్వం, సాహిత్య లక్షణాలు, ప్రాచీన సాహిత్య సంపదలు, (ప్రాచీన భాష అని చెప్పేందుకు వీలైన) ఆధారాలు లేని భాషలన్నింటికీ కేంద్రప్రభుత్వం ప్రాచీనా హోదా కల్పించినందున ఈ భాషలకు ప్రాచీనా హోదా కల్పిస్తూ జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయాలని న్యాయవాది గాంధీ ఆ పిటిషనలో కోర్టును కోరారు. ఈ పిటీషనపై విచారణ యేళ్ల తరబడి పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం ప్రధాన న్యాయమూర్తి సంజయ్‌ కిషనకౌల్‌, ఆర్‌.మహదేవనలతో కూడిన మద్రాసు హైకోర్టు ధర్మాసనం ఎదుట ఈ పిటీషన విచారణకు వచ్చింది. పిటిషనర్‌గా ఉన్న ఆర్‌.గాంధీ హాజరై ‘తొల్‌కాప్పియం, తిరుక్కురళ్‌, శిలప్పదికారం వంటి తమిళ సాహిత్యాలు 2 వేల యేళ్లకు ముందునాటివని, అయితే ఇలాంటి అత్యంత ప్రాచీనమైన సాహిత్యం, పటుత్వం, కన్నడం, తెలుగు, మలయాళం, ఒడియా వంటి భాషల్లో లేవని వాదించారు. ఆ భాషాల్లో రెండువేలకు ముందునాటి సాహిత్య ఆధారాలు ఉంటే దాఖలు చేయవచ్చునని సూచించారు. తగు ఆధారాలను ధర్మాసనం ఎదుట సమర్పిస్తే తాను పిటిషన ఉపసంహరించుకునేందుకు సిద్ధంగా ఉన్నానని వివరించారు. ఈ విషయంలో కేంద్రప్రభుత్వం వద్ద ఆధారాలు ఉన్నా వాటిని సమర్పించవచ్చునని తెలిపారు. తాను ఇతర భాషాలకు వ్యతిరేకిని కానని, అదే సమయంలో తమిళంలో ఇతర భాషా పదాలు లేని విస్తారమైన పదజాలం ఉందని వివరించారు. అయితే తెలుగు, మలయాళ భాషలను పరిగణనలోకి తీసుకుంటే ఆ రెండు భాషల్లోనూ సంస్కృత పదాలు కలసిపోయి ఉన్నాయని, ఈ పరిస్థితులలో ఆ భాషలకు ప్రాచీన హోదా ప్రకటించడం ఘోరతప్పిదం అవుతుందన్నారు. కేంద్రప్రభుత్వం జారీ చేసిన ఆ ఆదేశాన్ని రద్దు చేయాలని న్యాయవాది ఆర్‌.గాంధీ వాదించారు. కేంద్రప్రభుత్వం తరఫున హాజరైన అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ రాజోగోపాలన తన వాదనలను వినిపిస్తూ ఇతర భాషలకు చెందిన పదాలతో కలిసిపోయిన భాషలకు ప్రాచీన హోదా కల్పించకూడదని పిటిషనర్‌ చెబుతున్నారని, అయితే తమిళంలో ‘వ్యవసాయం’ అనే సంస్కృతపదం ప్రధానంగా వాడబడుతోందని అన్నారు. వెంటనే న్యాయమూర్తి ఆర్‌. మహదేవన్ జోక్యం చేసుకుంటూ ‘వ్యవసాయం‘ అనే పదం తమిళ పదం కాదని, అది సంస్కృతపదమేనని అంగీకరిస్తున్నామని, అయితే ఆ వృత్తి (వ్యవసాయం)ని సంబోధించడానికి తమిళభాషలోనూ కొన్ని పదాలు ఉన్నాయని, తమిళంలో వ్యవసాయానికి ‘ఉళవు’ అనే పదం కూడా ఉందని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదప్రతివాదనల అనంతరం న్యాయమూర్తులు కేసు తదుపరి విచారణను జూలై 13వ తేదీకి వాయిదా వేస్తున్నామని, ఆ లోపున తెలుగు, కన్నడ, మలయాళ భాషలకు ఏ ప్రాతిపదికన ప్రాచీన హోదా కల్పించారో వివరిస్తూ తగు ఆధారాలను కేంద్రప్రభుత్వం తరఫున ఓ ఉన్నతాధికారి హాజరై సమర్పించాలని ఆదేశించారు.
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration