Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 27556 Registered: 08-2008 Posted From: 116.88.66.65
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, June 21, 2016 - 12:16 pm: | |
తన సినిమాల డేట్ల విషయం చాలా పక్కాగా ఉంటాడు మహేష్ బాబు. ఫలానా టైమ్ లో సినిమా రిలీజ్ చేయాలంటే.. చేసేయాల్సిందే. డేట్ ముందు ఫిక్స్ చేసేస్తే… దానికి తగ్గట్టుగా సినిమానిప్రిపేర్ చేయొచ్చన్నది మహేష్ ప్లాన్. అందుకే ఇప్పుడు మరుగదాస్ సినిమాకీ మహేష్ రిలీజ్ డేట్ లాక్ చేశాడని టాక్. 2017 ఏప్రిల్ 28న ఈ సినిమాని విడుదల చేయాలని భావిస్తున్నాడట. సమ్మర్ సీజన్‌ని క్యాష్ చేసుకోవాలన్నది మహేష్ ఆలోచన. ఈ యేడాది అదే ప్లాన్‌తో వచ్చిన బ్రహ్మోత్సవం బోల్తా కొట్టింది. అయితే… మురుగదాస్ కథ విషయంలో మహేష్ చాలా కాన్ఫిడెన్ట్‌గా ఉన్నాడు. అందుకే సమ్మర్‌కి ఇదే సరైన సినిమా అన్నది మహేష్ అభిప్రాయం. జులై 15న ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. అదే నెలలో షూటింగ్ మొదలెట్టేస్తారు. మురుగదాస్ ఆల్రెడీ స్క్రిప్టు రెడీ చేసేశాడు. హరీష్‌జైరాజ్ ఇప్పటికే ట్యూన్లు సిద్ధం చేశాడట. కాబట్టి… మహేష్ తన టార్గెట్‌పై నమ్మకంతో ఉన్నాడు. ఈ చిత్రంలో పరిణితీ చోప్రాని కథానాయికగా ఎంచుకొన్న సంగతి తెలిసిందే. जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|