Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 27082 Registered: 08-2008 Posted From: 116.88.82.203
Rating: N/A Votes: 0 | Posted on Friday, May 27, 2016 - 12:36 pm: | |
టాలీవుడ్లో టాప్ హీరో.. మహేష్‌బాబు. టాప్ దర్శకుడు… రాజమౌళి. వీళ్లిద్దరి కాంబినేషన్ కలిస్తే – అదో సంచలనమే. మహేష్ – రాజమౌళి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. బాహుబలి తరవాత రాజమౌళి టేకప్ చేసే ప్రాజెక్ట్ ఇదే కావొచ్చు. దీనికి సంబంధించి రాజమౌళి, మహేష్ మధ్య చర్చలు కూడా జరిగాయి. రాజమౌళితో పనిచేయడానికి మహేష్ కూడా చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాడు. వీరిద్దరి కలయికలో ఎలాంటి సినిమారాబోతోంది? అన్నది ఆసక్తిగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఇదో పౌరాణిక గాథ అని తెలుస్తోంది. ఇతిహాసాల్లోని ఓ వీరోచిత ఘట్టంతో ఈ సినిమా తెరకెక్కబోతోందట. మహేష్ ఇప్పటి వరకూ పౌరాణిక చిత్రం చేయలేదు. ఒక వేళ చేస్తే.. అందుకు రాజమౌళినే సరైన దర్శకుడు అని భావిస్తున్నాడట. రాజమౌళితో మహేష్ చేయబోయే సినిమా ఓ విజువల్ వండర్‌గా ఉండబోతోందని టాక్. ఇప్పటికే… విజయేంద్రప్రసాద్ మహేష్ కోసం కథ రెడీ చేసే పనిలో పడ్డాడని తెలుస్తోంది. 2017 చివర్లో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|