Prasanth
Censor Bewarse Username: Prasanth
Post Number: 77553 Registered: 03-2004 Posted From: 165.225.104.85
Rating: N/A Votes: 0 | Posted on Monday, May 23, 2016 - 8:22 am: | |
జయ కేబినెట్లో ఐటీ మంత్రి తెలుగోడే.. సర్వే ఫలితాలు అక్కడ తారుమారయ్యాయి! సంప్రదాయానికి వ్యతిరేకంగా తమిళ ప్రజలు ఓటేశారు! తమ కోసం నిరంతరం శ్రమించి.. ఎన్నో సంక్షేమ పథకాల ప్రవేశపెట్టి.. అభిమానం చూరగొన్న `అమ్మ`కే పట్టం కట్టారు. తమిళనాట అధికారంలో ఉన్న వారు.. మరోసారి అధికారంలోకి రావడం చాలా అరుదు! కానీ ఆ చరిత్రను బద్దలు కొట్టారు పురుచ్చితలైవి.. జయలలిత! సీఎంగా రెండోసారి ఆమె ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆమెతో పాటు.. 28మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.అయితే జయ మంత్రివర్గంలో తెలుగు తేజం మెరవబోతోందని సమాచారం. అత్యంత కీలకమైన పదవి ఆయనకు కట్టబెట్టబోతున్నారట. అన్నాడీఎంకే తరఫున బరిలోకి దిగిన రాజు.. భారీ మెజారిటీతో గెలుపొందారు. తమిళనాట తెలుగువారికి కొదవే లేదనే విషయం తెలిసిందే! కీలక నియోజకవర్గాల్లో గెలుపోటములను కూడా ప్రభావితం చేయగల స్థితిలోఉన్నారు. అటువంటి కీలక నియోజకవర్గాల్లో తెలుగువారికి టికెట్లు ఇచ్చి.. వ్యూహాత్మకంగా వ్యవహరించారు జయ. ఇటువంటి స్థానాల నుంచి రాజు గెలుపొందారు. అందుకే ఆయనకు కీలకమైన ఐటీ శాఖను కేటాయించినట్టు సమాచారం. మరి ఇక్కడే కాదు తమిళనాడు ప్రభుత్వంలోనూ కీలక పదవి దక్కడం గర్వించదగ్గ విషయమే! telugu biDDa (staying in bangalore and from vijayawada)
|