Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 26870 Registered: 08-2008 Posted From: 116.88.82.203
Rating: N/A Votes: 0 | Posted on Monday, May 16, 2016 - 11:18 am: | |
చెన్నై: గ్రహబలం, వాస్తురీత్యా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే అధినేత్రి జయలలితే మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని తిరుపతికి చెందిన శ్రీరాజరాజేశ్వరి జ్యోతిషాలయం వ్యవస్థాపకుడు సుబ్రహ్మణ్యస్వామి జోస్యం చెప్పారు. ఆయన చెన్నై ప్రెస్‌క్లబ్‌లో విలేఖరులతో మాట్లాడుతూ... ఈసారి కూడా జయలలితే అధికారం చేపట్టడం తథ్యమని ప్రకటించారు. 2011లో జయలలిత ముఖ్యమంత్రి అవుతారని తాను చెప్పానని, ఆమె గ్రహబలం, వాస్తురీత్యా ఈసారి కూడా విజయం ఆమెనే వరిస్తుందన్నారు. అంతేగాక 2014లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన ఎన్నికల్లో తాను ముందుగానే చెప్పినట్టు చంద్రబాబునాయుడు సీఎం అయ్యారని, 2019లో జరుగబోయే ఎన్నికల్లో చంద్రబాబు తనయుడు నారా లోకేష్ సీఎంగా అధికారం చేపడతారని వ్యాఖ్యానించారు. जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|