Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 8661 Registered: 03-2004 Posted From: 68.109.27.99
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, May 10, 2016 - 9:13 pm: | |
KG2PG ani cheppi ippudu Kadiyam gadi comedy.. ఉత్తరాంధ్ర వ్యక్తి ఉద్దేశపూర్వక పిటిషన్ తెలంగాణలోనే అన్యాయం జరుగుతుందనటం తప్పు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది: కడియం గత ఏడాది కూడా ఒక్క విద్యార్థీ నమోదు కాని పాఠశాలలు ఉన్నా వాటిని తాము మూసేయలేదని, ఈ ఏడాది కూడా అలాంటి పాఠశాలలు ఉంటాయని, విద్యార్థుల సంఖ్య నమోదు తక్కువైపోతున్న పాఠశాలల్ని ఏం చేయాలనేది పరిశీలిస్తున్నామని డిప్యూటీ సీఎం, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఆయా పాఠశాలల్ని కాపాడుకునే బాధ్యతను ప్రజలకే అప్పగిస్తున్నామని, అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నానన్నారు. తల్లిదండ్రుల్లో విద్యపై అవగాహన పెరిగిందని, తమ పిల్లలు ఇంగ్లిషు మీడియంలో చదివితే మెరుగైన విద్య లభిస్తుందని, ఉపాధి దొరుకుతుందనే భావనలో ఉన్నారని అన్నారు. ఆ భావన తప్పని తాను చెప్పడం లేదని, అయితే, ఇంగ్లిషు పాఠశాలల్ని తెరవాలంటే ప్రభుత్వానికి సమస్యలు ఉన్నాయని తెలిపారు. ఇంగ్లిషు మీడియం పట్ల తల్లిదండ్రుల ఆసక్తి, ఉదయాన్నే ప్రైవేటు స్కూలు బస్సులు పల్లెలకు వచ్చి పిల్లల్ని తీసుకెళ్లటం, ప్రభుత్వ ఉపాధ్యాయులు సరిగా పాఠశాలలకు వెళ్లకపోవటం వంటి చాలా కారణాల వల్ల సున్నా విద్యార్థుల నమోదు ఉందని తెలిపారు. ఈ స్థితి తెలంగాణది మాత్రమే కాదని, దేశవ్యాప్తంగా ఉందని, కావాలనే ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తి తమపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారని అన్నారు |