Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 58633 Registered: 05-2004 Posted From: 66.117.193.162
Rating: N/A Votes: 0 | Posted on Monday, April 11, 2016 - 10:19 am: | |
‘దర్శకుణ్ని పక్కన పెట్టి పవనే సినిమా అంతా తీసుకొన్నాడు’ అనే కామెంట్లు వినిపిస్తుంటాయి.. దర్శకుడు ఏం చెప్పినా సరే.. నాకు ఇష్టమైతేనే చేస్తా. నా బలాలు, బలహీనతలు నాకు తెలుసు. ‘ఎన్టీఆర్‌లానో, చరణ్‌లానో డ్యాన్స్ చేయండి’ అంటే నా వల్ల ఏమవుతుంది. ‘నాకొచ్చే మూమెంట్స్ ఏడెనిమిది ఉంటాయి. వాటిలో నీకు ఏది నచ్చితే అది చేస్తా’ అంటాను. అందుకే నేను ఇన్వాల్వ్ అవుతా అంటారేమో? చిరంజీవి తమ్ముడు.. డాన్సులు బాగా చేయాలనుకోవడం తప్పు కాదేమో! హీరో అంటే అన్నీ చేయాలనే అభిప్రాయానికి నేను వ్యతిరేకం. నాకొచ్చేదేదో నేను చేస్తా. ‘ఇంద్ర’లో అన్నయ్య వీణ స్టెప్పు వేశారు. ‘సర్దార్...’లో నేనూ వేశా. అన్నయ్య నేలపై నుంచి స్టైల్‌గా పైకి లేస్తారు. నేనేదో అక్కడే నిలబడి.. నాకొచ్చింది చేశా. అది నా వీణ స్టెప్పు. ఏదో ఒకసారి డాన్స్ చేయమంటే చేస్తా. అదే ఫార్ములా అయిపోతేనే కష్టం. సినిమాల్లోకి వెళ్తాను అనగానే నాగబాబు అన్నయ్య ‘కల్యాణ్‌కి హార్స్ రైడింగ్ నేర్పించండి’ అన్నారు. అక్కడ మా నాన్న ఉన్నారు. ‘వీణ్ని గుర్రాలు తోలడానికి పంపిస్తున్నారా, నటించడానికి పంపిస్తున్నారా? ముందు నటించడం నేర్చుకో’ అన్నారు. నాన్న ఆ మాట అనగానే నిజమే అనిపించింది. నా పరిధిలో నేను కష్టపడి పనిచేస్తా. నాకు వచ్చిన దాన్ని సిన్సియర్‌గా చేస్తా. మిగిలినవాళ్లతో పోటీపడి నిరూపించుకోవాలనే ధ్యాస ఉండదు. Sardar Gabbar Singh Audio Review
|