Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 26681 Registered: 08-2008 Posted From: 119.56.127.142
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, April 05, 2016 - 6:10 am: | |
Gaja Gaja... సినిమా చూస్తే 2 గంటల 45 నిమిషాలొచ్చింది. సెన్సార్ కీ ఇంత నిడివి ఉన్న సినిమానే వెళ్లింది. కటింగులేం లేవు కాబట్టి… పావు తక్కువ మూడు గంటల సినిమా సిద్ధమైంది. నిడివి మరీ ఎక్కువ ఉంది.. అంటూ శరత్ మరార్, బాబిలు భయపడుతున్నా పవన్ మాత్రం దీమాగానే ఉన్నాడు. సినిమా బాగుంటే.. మూడు గంటలైనా చూస్తారని పవన్ నమ్మకం. అయితే.. అది నిన్నటి వరకే. ఈ రోజు సడన్గా పవన్కీ భయం పట్టుకొంది. సినిమా లెంగ్తీ గా ఉంటే… మొదటికే మోసం వస్తుందని కంగారు పడుతున్నాడట. అందుకే ఆఘమేఘాలమీద ఈ సినిమా లెంగ్త్ తగ్గించే పనిని దర్శకుడు బాబికి అప్పగించినట్టు సమాచారం. కనీసం 15 నిమిషాల సినిమాని ట్రిమ్ చేయమని పవన్ ఆదేశించాడట. యాక్షన్ ట్రాక్ యధావిధిగా ఉంచి, అవసరమైతే కామెడీ సీన్లను కుదించమని సూచించాడట. దాంతో బాబి.. ఇప్పుడు ఎడిటింగ్ టేబుల్ దగ్గర కుస్తీలు పడుతున్నట్టు టాక్. जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|