Superman
Kurra Bewarse Username: Superman
Post Number: 1683 Registered: 10-2005 Posted From: 73.185.138.54
Rating: N/A Votes: 0 | Posted on Monday, April 04, 2016 - 12:40 pm: | |
అమెరికా: ఊపిరి సినిమా చూసినందుకు టెక్సాస్‌లో నలుగురు భారతీయ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ నలుగురు విద్యార్థుల గురించి థియేటర్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. టెక్సాస్ పోలీసులు వచ్చి వారిని తీవ్రంగా మందలించి ఫైన్ కూడా విధించారు. విద్యార్థులు కూడా చేసేదేమీలేక నేరం ఒప్పుకుని ఫైన్ కట్టేశారు. ఇంతకీ వారిని పోలీసులు ఎందుకు అరెస్టు చేశారనుకుంటున్నారా.. టికెట్ కొనకుండా దొంగతనంగా థియేటర్లోకి దూరారు. కొనడానికి వారి వద్ద డబ్బులున్నా ఎందుకో బుద్ది గడ్డితిని ఈ పని చేశారు. సినిమా మొదలయిన కొద్ది సేపటి తర్వాత సిబ్బంది వారిని గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిని అరెస్టు చేసిన అంశం భారతీయ విద్యార్థుల్లో తీవ్రమైన చర్చకు దారితీసింది. |