Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 26719 Registered: 08-2008 Posted From: 58.182.200.24
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, April 06, 2016 - 12:22 pm: | |
నేనే పార్టీలో చేరేది త్వరలో ప్రకటిస్తా: మోహన్‌బాబు Sakshi | Updated: April 06, 2016 19:00 (IST) నేనే పార్టీలో చేరేది త్వరలో ప్రకటిస్తా: మోహన్‌బాబు చంద్రగిరి(చిత్తూరు జిల్లా): నేను ఆవేశపరుడ్నే కానీ.. అవినీతిపరుడ్ని కాదు అని డైలాగ్ కింగ్ మోహన్ బాబు అన్నారు. తన సొంత విద్యాసంస్థ విద్యానికేతన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. త్వరలోనే తాను మళ్లీ రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నట్లు తెలిపారు. ప్రజలకు మోహన్‌బాబు అంటే ఏంటో తెలిసేలా చేస్తానన్నారు. ఈ రోజుల్లో పేపర్ చూస్తే చాలా బాధగా ఉందన్నారు. పేద ప్రజలకు జరుగుతున్న అన్యాయం చూస్తే గుండె తరుక్కుపోతుందని అన్నారు. గతంలో రాజకీయం వద్దనుకుని వదిలేశానని చెప్పారు. ఎంగిలి మెతుకులు తినేవాళ్లే పార్టీలు మారుతున్నారని ఆయన అన్నారు. జంపు జిలానీలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని మోహన్‌బాబు చెప్పారు. ఇప్పటి పరిస్థితుల్ని బట్టి మళ్లీ రాజకీయాల్లోకి రావాల్సిన సమయం ఆసన్నమైందని అనిపిస్తోందన్నారు. నేను పార్టీలో చేరేది త్వరలోనే ప్రకటిస్తానని తెలిపారు. నేను రాజకీయాల్లోకి వస్తే అన్ని కులాల వారు తనను అమితంగా ఆదరిస్తారని మోహన్‌బాబు తెలిపారు जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|