Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Censor Bewarse
Username: Kingchoudary

Post Number: 99463
Registered: 03-2004
Posted From: 185.46.212.74

Rating: N/A
Votes: 0

Posted on Thursday, March 24, 2016 - 8:11 am:   

పురుషుడిగా నటిస్తూ.. ఓ మహిళ టీనేజ్‌ అమ్మాయిలను లోబర్చుకొని.. వారిపై లైంగిక దాడులకు పాల్పడింది. జాసన్‌ పేరుతో సోషల్‌ మీడియలో నకిలీ ఖాతాను తెరిచి.. 12 నుంచి 17 ఏళ్ల వయస్సు ఉన్న టీనేజ్‌ అమ్మాయిలకు ఆ కిలాడీ లేడీ గాలం వేసింది. మాయమాటలతో లోబర్చుకొని.. రబ్బరు అంగంతో వారితో శృంగారం జరిపింది. ఈ నేరానికి గాను జెన్నిఫర్‌ స్టెయినెస్‌కు ఇంగ్లండ్‌లోని బ్రిస్టల్ క్రౌన్‌ కోర్టు 39 నెలల జైలుశిక్ష విధించింది.

23 ఏళ్ల జెన్నిఫర్ ఇంట్లో పోలీసులకు రబ్బరు అంగం, డీఎన్‌ఏ పత్రాలు లభించాయి. ఆమె బాలికలతో శృంగారం చేసే సమయంలో కండోమ్‌ కూడా వాడేదని పోలీసులకు కోర్టుకు నివేదించారు. మొదటి బాధితురాలిపై లైంగిక దాడి చేసి.. ఆమెతో అసభ్యంగా ఫొటోలు దిగినట్టు, రెండో బాధితురాలపై రెండుసార్లు, మూడో బాధితురాలిపై మూడుసార్లు లైంగిక దాడులు జరిపినట్టు జెన్నిఫర్ కోర్టు ముందు నేరాన్ని అంగీకరించింది. ఆ ముగ్గురితో దాదాపు ఏడాదిపాటు అనుబంధాన్ని కొనసాగించినట్టు తెలిపింది.

'ఈ మోసం చేసేందుకు నువ్వు చాలా జాగ్రత్తగా పథకం రచించావు. నువ్వు పురుషుడిగా నటించేందుకు.. రిలేషన్‌షిప్‌ కొనసాగించే సామర్థ్యం నీకుందని నమ్మించేందుకే నువ్వు ప్రతిదీ చేశావు. నువ్వు ఇది ప్రేమ కోసం చేశావా? లేక ప్రేమ, శృంగారం కోసమా? లేక కేవలం శృంగారం కోసమా? అన్నది నిర్ధారించలేం' అని బ్రిస్టల్ క్రౌన్‌ కోర్టు జడ్జి బెరీ కొటర్ తీర్పు వెలువరించే సందర్భంగా పేర్కొన్నారు.

'యువకుడిగా నటిస్తూ జెన్నిఫర్ స్టెనెస్‌ పలువురిని మోసగించింది. తన సొంత కోరికలు, వ్యామోహంతోనే ఆమె ఈ చర్యకు పాల్పడింది. బాధితుల సమ్మతితోనే ఆమె శృంగారం జరిపినప్పటికీ, ఆమె అసలైన ఉనికిని దాచిపెట్టి విశ్వాస ఉల్లంఘనకు పాల్పడ్డారు. ఆమె తనను వలిచిన వారిని ఎంత ఘోరంగా మోసగించారంటే.. ఇప్పటికీ ఒక బాధితురాలు తాను ఒక పురుషుడితో కాకుండా సాటి స్త్రీతో అనుబంధం కొనసాగించిన విషయాన్ని నమ్మలేకపోతున్నది' అని ఇన్వెస్టింగ్ ఆఫీసర్ నదిన్‌ ప్రాట్రిడ్జ్‌ తెలిపారు.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration