Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 26367
Registered: 08-2008
Posted From: 58.182.87.144

Rating: N/A
Votes: 0

Posted on Saturday, March 19, 2016 - 12:14 am:   

త్వరలోనే క్రియాశీల రాజకీయాల్లోకి వస్తా- మోహన్ బాబు
Updated : 18-Mar-2016 : 20:08

‘‘ఒకప్పుడు రాజకీయంగా కొంతమందికి సపోర్ట్‌ ఇచ్చాను. త్వరలోనే క్రియాశీల రాజకీయాల్లోకి వస్తా. ఏ పార్టీ అనేది అప్పుడే చెబుతా’’ అని ఆశ్చర్యపరిచారు మోహన్‌బాబు. విలక్షణ నటుడిగా తెలుగు చలనచిత్రసీమలో తనకంటూ ప్రత్యేక చరిత్రను లిఖించుకున్న ఆయన చాలా కాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. శనివారం తన పుట్టినరోజును ఎప్పట్లా శ్రీ విద్యానికేతన్ సంస్థలో జరుపుకుంటున్న ఆయన సినిమా సహా పలు అంశాలపై ‘చిత్రజ్యోతి’ అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో ముక్కుసూటిగా జవాబులిచ్చారు. ఆ విశేషాలు...

విలన్, హీరో, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌.. ఈ మూడింటిలో ఏ దశను ఎక్కువ ఇష్టపడతారు?
అన్నింటిలోకీ నేను ప్రతినాయకుడి పాత్రను ఇష్టపడతాను. ఆ పాత్రకు కొన్ని ఇష్టాలుంటాయి. ఏదైనా డైరెక్టుగా చెబుతాడు. మేనరిజమ్స్‌కు, పర్ఫార్మెన్స్‌కు ఎక్కువ అవకాశం ఉంటుంది. నేను విలన్ పాత్రకు ఓ ఒరవడి తీసుకొచ్చా. హీరోగా సిల్వర్‌ జూబ్లీ హిట్స్‌ వచ్చినా, ప్రతినాయకుడి పాత్రల్నే ఎక్కువ ఆస్వాదించాను. మా ఊరి నుంచి సినిమా ఇండస్ట్రీకి నేను వెళ్లింది విలన్ పాత్రల కోసమే. ప్రతినాయకుడిగా ‘శివరంజని’, ‘దేవత’ సినిమాల్లోని పాత్రలు బాగా ఇష్టం. హీరోగా ‘అల్లుడుగారు’, ‘పెదరాయుడు’, ‘రాయలసీమ రామన్నచౌదరి’, కేరక్టర్‌ ఆర్టిస్ట్‌గా చూసుకుంటే ‘కొండవీటి సింహం’లో చేసిన యాంటీ హీరో, ‘యమదొంగ’లోని యమధర్మరాజు పాత్రలు ఇష్టం.

చాలా కాలం క్రితమే ‘రావణ బ్రహ్మ’ చేస్తానన్నారు. ఆ ప్రాజెక్ట్‌ ఏమైంది?
‘రావణ బ్రహ్మ’ కథ రెడీగా ఉంది. విష్ణుతో ‘కన్నప్ప’, MOVIEART--bemmi.shock మనోజ్‌తో ఇంకో సినిమా నిర్మించబోతోంది లక్ష్మి. ఆ రెండు సినిమాలయ్యాక ‘రావణ బ్రహ్మ’ ఉంటుంది. ప్రతి నటుడికీ ఏదో ఓ మంచి పాత్ర చెయ్యాలని ఉంటుంది. నా దగ్గరకు వచ్చిన పాత్ర నచ్చితే, అది ఏ తరహాదైనా చేస్తా.

మీ పిల్లల కెరీర్‌ తీరుపై సంతృప్తిగా ఉన్నారా?
నా పిల్లల కెరీర్‌, భవిష్యత్తు చూస్తుంటే ఆనందంగా ఉంది. వాళ్లు పైకి ఎదుగుతున్నారే కానీ కిందకు దిగడం లేదు. ముఖ్యంగా క్రమశిక్షణతో ఉన్నారు. విష్ణుకు ‘ఢీ’, ‘దేనికైనా రెడీ’ వంటి హిట్లు, మనోజ్‌కు ‘పోటుగాడు’ లాంటి హిట్‌ వచ్చాయి. నాకొచ్చిన బ్లాక్‌బస్టర్లు వాళ్లకింకా రాలేదంతే. దానికి కొంత టైమ్‌ పట్టొచ్చు. అది ఎప్పుడొస్తుందనేది చెప్పలేం. ఈ ఏడాదే రావచ్చేమో. ఓ తండ్రిగా పిల్లలకు ఎలాంటి సపోర్ట్‌ ఇవ్వాలో అదిస్తాను.

మీ కెరీర్‌, మీ పిల్లల కెరీర్‌ విషయంలో మీ భార్య పాత్ర ఎంతవరకుంటుంది?
ఆ విషయాల్లో నిర్మల పాత్ర తక్కువే. తను ఎందులోనూ జోక్యం చేసుకోదు. అయితే ఇంటిని చక్కగా, ప్రశాంతంగా ఉంచుతుంది. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉండటం ముఖ్యం. నా పనులు నేను ఏ ఇబ్బందీ లేకుండా చేసుకోవడానికి ఆ వాతావరణం దోహదపడిందని అనుకుంటాను.

మనవరాళ్లతో ఆడుకుంటుంటారా?
వాళ్లతో ఆడుతూ గడపడం ఆనందంగా ఉంటుంది. అరియానా, వివియానా, విద్యా నిర్వాణ.. ముగ్గురూ మంచి యాక్టివ్‌. నాతో బాగా చనువుగా ఉంటారు.

శ్రీ విద్యానికేతన్‌ను విస్తరింపజేస్తారా?
1992లో శ్రీ విద్యానికేతన్ పేరుతో మొదట స్కూలు పెట్టాను. 1993లో స్కూలులో 600 మంది పిల్లలుంటే ఇవాళ కాలేజీలుగా మారాక 12,500 మంది విద్యార్థులు, 1500 మంది టీచింగ్‌, నాన్ టీచింగ్‌ స్టాఫ్‌తో విస్తరించింది. త్వరలో శ్రీ విద్యానికేతన్ యూనివర్శిటీ అయ్యే అవకాశాలున్నాయి. తిరుపతిలో ఉన్న ఈ విద్యాసంస్థను ఇతర ప్రాంతాల్లోనూ విస్తరింపజేయాలనే ఆలోచన ఉంది. నాన్న స్కూల్‌ టీచర్‌గా పనిచేశారు. అందుకే ఆయన పేరుమీద రెండు రాష్ట్రాల్లో ఉత్తమ ఉపాధ్యాయుణ్ణి ఎంపికచేసి, అవార్డుతో పాటు రూ. లక్ష నగదు బహుమతి ప్రతి ఏటా ఇవ్వాలని నిర్ణయించాం. శ్రీ విద్యానికేతన్‌లో 19న ఛైర్మన్ పుట్టినరోజు, 20న వార్షికోత్సవం వస్తుంటాయని అక్కడ చదువుకొనే పిల్లలు ఆనందపడుతుంటారు. సాధారణంగా బర్త్‌డేలు చేసుకోవడం ఇష్టముండదు. నటుణ్ణయిన పదేళ్ల తర్వాత బర్త్‌డే చేసుకున్నాను. 1993 నుంచీ నా పుట్టినరోజును కల్లాకపటం తెలీని ఆ పిల్లల మధ్య చేసుకుంటూ వస్తున్నా. ఈసారి నా పుట్టినరోజుకు వెంకటేశ్, వార్షికోత్సవానికి టి. సుబ్బరామిరెడ్డి, గ్రంథి మల్లికార్జునరావు, శత్రుఘ్న సిన్హా వస్తున్నారు.

కులపరంగా సమాజం విడిపోయిందనే అభిప్రాయం ఉంది. మీరేమంటారు?
వేదికలపై ఒక కులంవాళ్లను ఇంకో కులం వాళ్లు తిట్టుకుంటున్నారు. ఆ తర్వాతే వాళ్లు కలుస్తుంటారు, బంధుత్వాలూ కలుపుకొంటున్నారు. వాళ్ల రాజకీయాల్ని జనం గమనిస్తూనే ఉంటారు.

ఇప్పటి రాజకీయాలు చూస్తుంటే ఏమనిపిస్తోంది?
పేపర్‌ తీస్తే వీళ్ల మీద వాళ్లు, వాళ్ల మీద వీళ్లు బురద చల్లుకునే వార్తలే. ప్రజలు అంతా గమనిస్తూనే ఉంటారు. అడవిలో జంతువులు ఆహార మైథునాల కోసం కలహించుకుంటాయి, కలుస్తుంటాయి. అది ప్రకృతి సహజం. ఇక్కడ మనుషులు ఎందుకు కొట్టుకుంటున్నారు? ఇది ప్రకృతి సహజం కాదు. అన్నింటిలో మానవజన్మ ఉత్తమమైంది. ఎవరు ఎప్పుడు పోతారో తెలీదు. మంచి చెయ్యాల్సిన వాళ్లు చెయ్యకుండా పోతే అది వెంటాడుతూనే ఉంటుంది. ఇవాళ స్వార్థం మరీ ఎక్కువైపోయింది. రోజు రోజుకూ రాజకీయం దిగజారిపోతోంది. సినిమా పరిశ్రమలోనూ విలువలు లేవు. చిన్న నిర్మాతలు దెబ్బతింటున్నారు. ఎన్నో యేళ్లుగా చిన్న నిర్మాతకు న్యాయం చెయ్యాలని అనుకుంటున్నామే కానీ ఏమీ చెయ్యలేకపోతున్నాం. ఇటీవల ముద్రగడ పద్మనాభంను విష్ణు కలవడంపై రకరకాల వ్యాఖ్యానాలు వినిపించాయి...
ముద్రగడ పద్మనాభం మాకు చిరకాల మిత్రుడు. విష్ణు ఆ దగ్గరలో ఓ పెళ్లుంటే వెళ్లాడు. నా సూచన మేరకు ఆయనను పరామర్శించి వచ్చాడు. ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవు.
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration