Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 26338 Registered: 08-2008 Posted From: 119.56.125.117
Rating: N/A Votes: 0 | Posted on Friday, March 18, 2016 - 2:37 am: | |
లేడీ టీచర్‌తో వెళ్ళిపోయిన విద్యార్థి ఇంటికొచ్చాడు... 17-03-2016 18:50:37 మదురై: సరిగ్గా ఏడాది కిందట ఒక లేడీ టీచర్‌తో వెళ్ళిపోయిన విద్యార్థి ఇంటికి తిరిగి వెళ్లేందుకు సమ్మతించాడు. కిందటేడాది మార్చి నెలలో స్కూలుకు వెళ్లిన తన 16 ఏళ్ళ కుమారుడు తిరిగి ఇంటికి రాలేదని తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా కడయనల్లుర్ గ్రామానికి చెందిన సి.మారియమ్మాళ్ కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. అదే స్కూలులో పనిచేస్తున్న 25 ఏళ్ళ ఒక లేడీ టీచర్ తన కుమారుడిని కిడ్నాప్ చేసి ఉండవచ్చని తన పిటిషన్లో సదరు విద్యార్థి తల్లి సందేహం వ్యక్తం చేశారు. ఈ కేసు బాధ్యతలను మద్రాస్ హైకోర్టు పులియాన్కుడి డీఎస్పీకి అప్పగించగా రంగంలోకి దిగిన కడయనల్లుర్ పోలీసులు వారిని పట్టుకోవడంలో విఫలమయ్యారు. దీంతో మారియమ్మాళ్ విజ్ఞప్తితో కేసు సీబీసీఐడీకి అప్పగించారు. చివరికి తిరుపూర్‌లో ఆ లేడీ టీచర్‌ను, విద్యార్థిని కనుగొన్న పోలీసులు ఇద్దరినీ తెన్కాశి జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాలతో ఆ విద్యార్థిని హైకోర్టు బెంచి ముందు హాజరుపరిచారు. తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళేందుకు ఆ విద్యార్థి అంగీకరించగా, లేడీ టీచర్‌ను అరెస్ట్ చేసి తిరుచ్చి జైలుకు పంపించారు. ప్రస్తుతం ఆ టీచర్ గర్భవతి అని తేలింది. जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|