Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 26182 Registered: 08-2008 Posted From: 58.182.87.144
Rating: N/A Votes: 0 | Posted on Friday, March 11, 2016 - 11:02 am: | |
'ముద్దుపేర్లతో పిలిస్తే జైలుశిక్ష తప్పదు' Others | Updated: March 11, 2016 17:20 (IST) 'ముద్దుపేర్లతో పిలిస్తే జైలుశిక్ష తప్పదు' డెహ్రాడూన్: పోకిరీ యువకులే కాదు.. అమ్మాయిల బాయ్ ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారి నోటి నుంచి 'బేబీ', 'హనీ' అనే పిలుపు వచ్చిందంటే చాలు జైలు శిక్షకు గురవుతారట. ప్రస్తుతం ప్రేమికులు తమ ప్రేయసినో, లేక గర్ల్ ఫ్రెండ్ ను ముద్దుముద్దుగా తమకు నచ్చిన పేర్లతో పిలుచుకుంటారన్న విషయం తెలిసిందే. మహిళలు, విద్యార్థినులకు ప్రత్యేక రక్షణ కల్పించేందుకు, వారి సంరక్షణ కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఒకరిని ఉద్దేశించి మాట్లాడుతూ.. మరొక యువతిని 'బేబీ', 'హనీ' పిలిచినా లైంగిక వేధింపుల కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఉత్తరాఖండ్ మహిళా కమిషన్ అధికారులు హెచ్చరిస్తున్నారు. కొందరు యువకుల ప్రవర్తనతో యువతులు, విద్యార్థినులు మానసికంగా చాలా ఇబ్బందులు పడుతుంటారని ఉత్తరాఖండ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ సరోజినీ కైంతురా తెలిపారు. ఆడవారితో ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండకూడదన్న విషయాలను.. పోకిరీలు హద్దుమీరుతున్న సమయాలలో మహిళలు ఎలా రియాక్ట్ కావాలో తెలుసుకోవాలను కుంటున్నట్లు ఆమె చెప్పారు. జోక్స్ వేయడం, మారు పేర్లతో పదేపదే పిలుస్తూ ఆటపట్టించడం లాంటివి చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. గతేడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ నెలల మధ్య తమ కమిషన్ కు 1,118 ఫిర్యాదులు అందినట్లు చైర్ పర్సన్ వెల్లడించారు. ఆడవాళ్ల వ్యక్తిగత జీవితాలలో ఆడుకోవడం, వారితో దురుసుగా ప్రవర్తించడం లాంటి ఘటనలపై ఫిర్యాదులు వస్తే ఊరుకునేది లేదని ఐపీసీ 509 సెక్షన్ కింద ఆ వ్యక్తులకు ఏడాది జైలు శిక్ష విధిస్తామని పోకిరీలను ఆమె హెచ్చరించారు. ఈ విషయంపై కాలేజీలు, స్కూళ్లలో అమ్మాయిలకు అవగాహనా కల్పించాలని కమిషన్ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వివరించారు. जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|