Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 8490
Registered: 03-2004
Posted From: 68.109.27.99

Rating: N/A
Votes: 0

Posted on Thursday, March 10, 2016 - 6:33 am:   


Musicfan:




" సాగునీటి ఒప్పందం"

మహారాష్ట్ర , తెలంగాణా ల మధ్య జరిగిన సాగునీటి ఒప్పందం ద్వారా- పాలకులు గెలిచారు. ప్రజలు ఓడారు. ఇది రెండు రాష్ట్రాల్లోనూ జరిగింది.

ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు యధాతథంగా అమలు జరిపినా - తెలంగాణలో 16లక్షల ఎకరాలకు నీరు అందుతుంది. మహారాష్ట్రకు జరిగే నష్టమేమీ లేదు. మరి డిజైన్‌ ఎందుకు మారినట్టు?

తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తున ప్రాజెక్టు నిర్మించడానికి 2012లోనే ఉభయ రాష్ట్రాల మధ్య ఆనాటి కేంద్ర మంత్రి పవన్‌కుమార్‌ బన్సల్‌ సమక్షంలో ఒప్పందం జరిగింది. ఇప్పుడు దానిని పక్కనపెట్టి ఎత్తు కుదించి ఒప్పందం చేసుకున్నారు. ఇందుకు చెపుతున్న కారణాలకు పొంతనలేదు.

ఈ ప్రాజెక్టు విషయంలో- ఆలస్యానికి కారణం ఆనాటి కాంగ్రెస్‌ పాలకుల బాధ్యతారాహిత్యమే. ఏమైనా 2012లో జరిగిన ఒప్పందం మెరుగైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాని అమలు కోసం కృషిచేసి ఉండాల్సింది.అక్కడ బీజేపీ ఇక్కడ టీఆర్‌ఎస్‌ రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజల ప్రయోజనాలు లేవు. ఫలితంగా తెలంగాణ ప్రజలు నష్టపోయారు.

అంతే కాదు, రెండు రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం తిరగదోడటాన్ని అనుమతించడం ద్వారా ఒక తప్పుడు సాంప్రదాయానికి తెరలేపినట్టయింది. దేశంలో వివిధ రాష్ట్రాల మధ్య జరిగిన అనేక ఒప్పందాలను ఎవరైనా తిరగదోడవచ్చుననే సంకేతాలిచ్చినట్టయింది. 2019 ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వాలు మారితే ఇప్పుడు జరిగిన ఒప్పందాన్ని కూడా తిరగదోడవచ్చు. తెలంగాణ ప్రభుత్వం 2012 ఒప్పందానికి కట్టుబడి ఉండాలని సూత్రబద్ధమైన వైఖరిని ప్రదర్శించి వుండవల్సింది.

కేంద్రం సహకారం తీసుకుని పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధపడలేదు. డిజైన్‌ మార్పుకే మొగ్గుచూపింది. పాత ప్రాజెక్టులు యధాతథంగా నిర్మిస్తే వాటిమీద టీఆర్‌ఎస్‌ ముద్ర ఉండదు. కేవలం ఈ రాజకీయ ప్రయోజనం కోసం డిజైన్లు మార్చి కొత్త ప్రాజెక్టులుగా కొత్త ఒప్పందాలు చేస్తున్నారు.

డిజైన్‌ మార్చడం వల్ల ప్రాజెక్టు నిర్మాణం వ్యయం బాగా పెరుగుతున్నది. ఆదిలాబాద్‌కు సాగునీటి సరఫరా తగ్గే ప్రమాదం ఉన్నది. కాళేశ్వరం వద్ద తొందరగా పూడిక చేరుకునే అవకాశం ఉన్నది. ఫలితంగా నీటినిల్వ సామర్థ్యం తగ్గిపోయే ప్రమాదం ఉన్నది. ఇప్పటికే శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు అనుభవం మనముందున్నది. పైగా ఇప్పుడు డిజైన్‌ మార్చడం వల్ల మూడు చోట్ల ఎత్తిపోతలకు పెద్ద ఎత్తున అదనపు విద్యుత్‌ అవసరం అవుతున్నది. ఇది మరో భారం. ఈ భారాలూ నష్టాలూ మోయవల్సింది తెలంగాణ ప్రజలే. టీఆర్‌ఎస్‌ రాజకీయ ప్రయోజనం కోసం ప్రజల మీద ఈ బరువు మోపడం సమంజసం కాదు.

త్వరలో పూర్తిచేయడానికే ఈ ఒప్పందం అన్నారు. ఒప్పందంలోనే ఎనిమిది నుండి పది సంవత్సరాలు పడుతుందని చెప్పారు. ఆచరణలో మరింత ఆలస్యం అవుతుందన్నది దేశవ్యాపిత అనుభవం.

నీరు సముద్రంలో కలవకుండా వుండటానికే ఈ ఒప్పందం అన్నది నిజం కాదు. కంతనపల్లి ప్రాజెక్టును నిర్మిస్తే ఈ సమస్య ఉత్పన్నం కాదు. దాన్ని రద్దుచేసింది కూడా ఈ ప్రభుత్వమే. ఒప్పందాలను తిరగదోడడం ఆందోళన కరం. రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రం తగదు.

దశాబ్దాలుగా సాగునీటి కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ రైతన్నలకు ఇది గొప్ప ఒప్పందమని చెప్పడంలో కొంతకాలం జయప్రదం కావచ్చు.
కానీ నిజం తెలుసుకోవడానికి ప్రజలకు ఎంతోకాలం పట్టదు !

Source: Nava Telangana

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration