Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 26080 Registered: 08-2008 Posted From: 58.182.87.144
Rating: N/A Votes: 0 | Posted on Saturday, March 05, 2016 - 10:32 am: | |
ఇయర్ బడ్స్ వాడితే చెవుడు వస్తుందట! 05-03-2016 18:22:52 లండన్: చెవుల్లో ఉండే గులిమిని తొలగించడానికి చాలా మంది మార్కెట్లో విరివిగా దొరుకుతున్న ఇయర్ బడ్స్‌ను వాడుతుంటారు. అయితే ఇవి వాడడం వల్ల భవిష్యత్తులో చెవుడు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందట. సాధారణంగా లోపల ఉండే వ్యర్థాన్ని తొలగించుకునే నిర్మాణం స్వతహాగా చెవుల్లోనే ఉంటుందట. మనం ప్రత్యేకంగా వాటిని శుభ్రపరచాల్సిన అవసరం లేదు. చెవులు సెల్ఫ్ క్లీనింగ్ చేసుకుంటాయని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు ఎప్పుడో వెల్లడించారు. చెవి లోపలి చర్మం కన్వేయర్ బెల్ట్‌లా పనిచేసి లోపలి వ్యర్థాలను బయటకు తోసేస్తుందట. అలా కాకుండా ఇయర్ బడ్స్ ద్వారా క్లీన్ చేయాలని ప్రయత్నిస్తే.. లోపల ఉండే గులిమి కొంత మాత్రమే బయటకు వస్తుందట. మిగిలినది ఇయర్ బడ్స్ తాకిడికి మరింత లోపలికి వెళ్లి ఇయర్ కెనాల్ గుండా ప్రయాణించి కర్ణభేరిపై పడతుందట. చెవిలోనికి ప్రవేశించిన ధ్వని తరంగాలకు అనుగుణంగా ప్రకంపనాలు సృష్టించి.. వాటిని మెదడుకు చేరవేయడం కర్ణభేరి విధి. అయితే ఇలా ఎక్కువ సంఖ్యలో గులిమి కర్ణభేరిపై పేరుకుపోవడం వల్ల సున్నితమైన కర్ణభేరి.. తరంగాలకు అనుగుణంగా ప్రకంపనాలు సృష్టించే సామర్థ్యం కోల్పోతుందట. కంపిస్తున్న వస్తువుపై భారం పడితే అది కంపనాలను ఆపేస్తుందన్న విషయం తెలిసిందే. ఇలా కర్ణభేరి పనికి ఆటంకం కలిగించడం వల్ల చెవుడు వస్తుందట. అందుకే చెవులు క్లీనింగ్ చేయడానికి బయట నుంచి ఎటువంటి వస్తువులూ వాడకూడదట. जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|