Tingari_xx
Celebrity Bewarse Username: Tingari_xx
Post Number: 48845 Registered: 08-2006 Posted From: 76.109.163.196
Rating: N/A Votes: 0 | Posted on Sunday, February 21, 2016 - 9:21 am: | |
Blazewada:నేనొక అమ్మాయిని ప్రేమించాను. నా ప్రేమను తనకు చెప్పినప్పుడు తన గతం చెప్పింది. ఓ అబ్బాయిని ప్రేమించానని, అతనికి అన్ని రకాలుగానూ దగ్గరయ్యానని, ఇద్దరూ విడిపోయారని చెప్పింది. తన నిజాయతీ కారణంగా నేను తనని యాక్సెప్ట్ చేశాను. కానీ తను ఈ మధ్య సడెన్‌గా మారిపోయింది. నాకు ప్రేమ మీద నమ్మకం పోయింది, నువ్వు నాకు మంచి స్నేహితుడిగానే ఉండు అంటోంది. కారణం అర్థం కాక ఆరా తీస్తే... తన పాత లవర్‌కి మళ్లీ దగ్గరయ్యిందని తెలిసింది. నేనేం చేయాలి? తను కోరుకున్నట్టు స్నేహితుడిగా ఉండాలా లేక తనతో అన్ని సంబంధాలూ తెంచేసుకుని నా పని నేను చేసుకోవాలా? - కె.కె.రెడ్డి, మెయిల్ మీరు చెప్పినట్టు మీకు రెండే ఆప్షన్లు. తనతో స్నేహంగా ఉండటం... తనతో సంబంధాలన్నీ తెంచేసుకోవడం. స్నేహితుడిగా ఉండటం వల్ల మీకొచ్చే లాభనష్టాలు బేరీజు వేసుకోండి. ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటున్నారా? లేక కేవలం స్నేహితుడిగానే ఉందామను కుంటున్నారా? సంబంధాలన్నీ తెంచేసు కుంటే మీరు మరింత మనఃస్థిమితంగా ఉంటారేమో ఆలోచించండి. స్నేహితు రాలు ఎవరితో ఉంటోంది, ఎక్కడికి వెళ్తోంది లాంటి ఆరాలు తీయడం, డిటెక్టివ్‌లను పెట్టడం వంటి పత్తేదారు పనులు ఎప్పుడూ మనసులను కలచి వేస్తూ ఉంటాయి. ఆమెను మీరు వివాహం చేసుకునే ఉద్దేశం లేనప్పుడు ఆమె జీవితం ఆమెది, మీ జీవితం మీది. లేదూ కేవలం ఆమెను స్నేహితురాలిగానే చూసే పక్షంలో... ఆమె జీవితంలో మీరు ఒక చిన్న భాగం మాత్రమే. మిగతా భాగంలో ఎవరుంటే మీకు ఎందుకు? ఈ విధంగా ఆలోచిస్తే మనశ్శాంతి దొరుకుతుంది. - యండమూరి వీరేంద్రనాథ్
baaga seppad :D |