Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 25908 Registered: 08-2008 Posted From: 58.182.87.144
Rating: N/A Votes: 0 | Posted on Friday, February 19, 2016 - 12:18 pm: | |
న్యూఢిల్లీ : వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ కసరత్తు మొదలుపెట్టింది. హల్వా వేడుకతో ఆ ఘట్టాన్ని ప్రారంభించారు. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తదితరులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2016-17 ఏడాదికిగానూ అరుణ్‌జైట్లీ ఈ నెల 29న పార్లమెంట్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అందుకు సంబంధించి ముద్రణా పనులు ఊపందుకున్నాయు. హల్వా వేడుకను నిర్వహించిన తర్వాతే ప్రింటింగ్ పనులు ప్రారంభించడం ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. ఈసారి కూడా ఆ ఆనవాయితీని కొనసాగించారు. శుక్రవారం నార్త్ బ్లాక్ కార్యాలయంలో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, ఆ శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా హల్వా వేడుకల్లో పాల్గొన్నారు. హల్వాను సిబ్బందికి పంచారు. ప్రింటింగ్ ప్రారంభించిన దగ్గర నుంచి లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు సిబ్బంది కార్యాలయంలోనే ఉండాల్సి ఉంటుంది. కనీసం తమ వారికి ఫోన్ చేసుకునే వెసులుబాటు కూడా ఉండదు. కొందరు సీనియర్ అధికారులు తప్ప ఎవరూ ఇళ్లకు వెళ్లకూడదు. బడ్జెట్ అంశాలు బయటకు పొక్కకుండా ఉండేందుకు ఈ జాగ్రత్తలు తీసుకుంటారు. కుటుంబాలకు దూరం అయ్యే సిబ్బందిని ఉత్సాహపరిచేందుకు ఎప్పటిలాగే ఈసారి కూడా హల్వా వేడుక నిర్వహించారు. जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|