Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 25941 Registered: 08-2008 Posted From: 119.56.125.134
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, February 24, 2016 - 12:06 am: | |
నీకు పెళ్లెందుకురా.. వేస్ట్ 24-02-2016 01:43:11 నువ్వు గిఫ్ట్ ప్యాక్‌పై లేబుల్ పాటి చెయ్యవు యువతీయువకుల మధ్య పెళ్లి కానుక తెచ్చిన తంటా వ్యక్తిగత ద్వేషానికి దారితీసిన చదువులో పోటీ యువకుడి పెళ్లి సందర్భంగా యువతి వ్యంగ్యం ఆమెపై ఫేస్బుక్లో అతడి అసభ్యరాతలు యువతి ఫిర్యాదు.. యువకుడి అరెస్టు ఆంధ్రజ్యోతి, హైదరాబాద్ సిటీ: ఇద్దరు యువతీయువకులు! ఇద్దరికీ చదువులో పోటీ!! ఒకరిని దెబ్బతీయాలని మరొకరు ప్రయత్నిస్తుంటారు. సినిమాల్లో ఇలాంటి సీన్లు బోలెడన్ని చూసే ఉంటాం. కానీ.. నిజజీవితంలోనూ చదువులో పోటీ యువతీయువకుల మధ్య వ్యక్తిగత ద్వేషానికి దారి తీసింది. ఆ యువకుడి పెళ్లికి ఆమె గిఫ్ట్‌తోపాటు పంపిన లేఖ ఇద్దరి మధ్యా గోడవను పెంచింది. చివరికి పోలీసు కేసు స్థాయికి వెళ్లింది! యువకుడి అరెస్టుకు కారణమైంది!! గుంటూరుకు చెందిన పి.సాయికృష్ణ(23)కు చిన్నప్పటి నుంచీ తన తోటి విద్యార్థినితో చదువులో పోటీ ఉంది. ఇద్దరూ ఒకరిని ఒకరు దూషించుకునేవారు. కాలేజీస్థాయికి వచ్చినా వారి మధ్య ఇదే వైరం కొనసాగింది. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన సాయికృష్ణ ఇటీవలే.. తనతో పోటీపడుతున్న అమ్మాయి స్నేహితురాలిని పెళ్లి చేసుకున్నాడు. అతణ్ని చేసుకున్న యువతి.. ఆమెను కూడా పెళ్లికి పిలిచింది. అయితే, సాయికృష్ణతో వైరం నేపథ్యంలో ఆమె పెళ్లికి రాలేదు. కానీ.. గిఫ్ట్ పంపింది. అందులో.. ‘నీకెందుకురా పెళ్లి.. వేస్ట్’ అని కామెంట్ రాసింది. అది చూసిన సాయికృష్ణ ‘నువ్వు గిఫ్ట్ ప్యాక్‌పై లేబుల్ అంత చేయవు’ అంటూ ఆమెను దూషించాడు. ఇద్దరూ ఒకరినొకరు తిట్టుకున్నారు. తర్వాత ఆమె ఫేస్బుక్ వాల్‌పై అతడు అసభ్యరాతలు రాశాడు. దీంతో ఆమె హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సాయికృష్ణను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|