Dobbey
Mudiripoyina Bewarse Username: Dobbey
Post Number: 22210 Registered: 12-2009 Posted From: 71.201.156.4
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, February 17, 2016 - 6:26 pm: | |
గర్ల్‌ఫ్రెండ్స్ కోసం... దోపిడీలు నాగపూర్: తన గర్ల్‌ఫ్రెండ్స్‌ను సంతోషపెట్టడానికి ఏకంగా దోపిడీలకు, దొంగతనాలకు పాల్పడ్డాడు ఓ ప్రబుద్ధుడు. పోలీసులు ఎంతో చాకచక్యంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు దోపిడీలకు పాల్పడుతున్నావని అడిగిన పోలీసులకు నివ్వెరపోయే సమాధానం చెప్పాడు. మహారాష్ట్రలోని బల్దాన జిల్లాకి చెందిన పోలీసులు ఓం ప్రకాశ్ రంగనాథ్ ఖంద్వే(26)ని అరెస్టు చేశారు. తొమ్మిది దోపిడీ కేసుల్లో అతడు ప్రధాన నిందితుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓంప్రకాశ్‌పై పలు ప్రాంతాల్లో దొంగతనాలు, దోపిడీ కేసులు నమోదయ్యాయి. మద్యానికి బానిసై విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన ఓం ప్రకాశ్ ఈ దొంగతనాలకు పాల్పడ్డాడు. అదుపులోకి తీసుకున్న అతడి దగ్గర నుంచి 17 మొబైల్ ఫోన్లు, రూ.4.5లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అతడ్ని విచారించిన పోలీసులు ఓం ప్రకాశ్ చెప్పిన సమాధానానికి కంగుతిన్నారు. తనకున్న ఏడుగురు గర్ల్‌ఫ్రెండ్స్‌ను సంతోషపెట్టడానికి దొంగతనాలు చేస్తున్నట్లు చెప్పాడు. నిందితుడిపై ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లోని పలు నగరాల్లో కేసులు ఉన్నాయి. ప్రస్తుతం అతను పోలీసుల కస్టడీలో ఉన్నాడు. అతని వద్దనుంచి బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తున్న వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.
|