Superman
Kurra Bewarse Username: Superman
Post Number: 1638 Registered: 10-2005 Posted From: 73.185.138.54
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, February 10, 2016 - 10:55 am: | |
హైదరాబాద్: టీటీడీఎల్పీని టీఆర్ఎస్లో విలీనం చేస్తూ రేపు స్పీకర్ మధుసూదనాచారికి లేఖ ఇవ్వనున్నట్లు ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. ఎర్రబెల్లి, ప్రకాష్ గౌడ్లు గులాబి కండువా కప్పుకున్న తరువాత..ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. తప్పని పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన అన్నారు. కేసీఆర్ను నేను పదవులు అడగలేదు, ఆశించలేదంటూఎర్రబెల్లి చెప్పారు. ఇందుకు స్పందించిన రేవంత్..పార్టీని వీడిన వారు ఫిరాయింపు చట్టం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరంటూ ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల తీర్మానంతో పార్టీ విలీనం కాదంటూ రేవంత్ చెప్పుకొచ్చారు. రాజ్యాంగ వ్యతిరేక చర్యలపై కోర్టుకు వెళ్లి న్యాయంకోసం పోరాడతామని రేవంత్ మీడియాతో తెలిపారు. |