Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 25657
Registered: 08-2008
Posted From: 58.182.87.144

Rating: N/A
Votes: 0

Posted on Sunday, January 17, 2016 - 7:38 am:   


Kingchoudary:




ఉత్తర ప్రదేశ్‌లోని ఫరీద్‌పూర్...
సమయం రాత్రి పదకొండున్నర దాటింది. రోడ్లన్నీ నిర్మానుష్యమై పోయాయి. ఎక్కడ చూసినా నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ దూసుకుపోతోంది ఒక ఆటో. ‘‘డ్రైవర్... కాస్త త్వరగా పోనీ’’ అన్నాడు వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి. ‘‘పోతున్నా కద సాబ్... ఇంతకంటే స్పీడుగా అంటే కష్టం’’ అన్నాడు డ్రైవర్. ఆ మాటల్లో కాస్త విసుగు ధ్వనించింది. అది గమనించి సెలైంట్ అయిపోయాడా వ్యక్తి. తన పక్కనే కూర్చున్న మహిళ వైపు చూశాడు. ఆమెకు ఒళ్లంతా చెమటలు పోస్తున్నాయి. కళ్లు మెల్లమెల్లగా మూతలు పడుతున్నాయి. అది చూడగానే అతడి గుండె గుభేల్‌మంది. నిండు చూలాలు. ఇప్పటి వరకూ నొప్పులతో అల్లాడిపోయింది. ఇప్పుడు ఉన్నట్టుండి మౌనంగా అయిపోయింది. కళ్లు కూడా మూసుకు పోతున్నాయి. కొంపదీసి తన ప్రాణానికేమైనా...?

ఆ ఆలోచనే కంగారు పెట్టిందతణ్ని. డ్రైవర్ తిట్టుకున్నా ఫర్వాలేదని మళ్లీ అన్నాడు... ‘‘ఏమనుకోకు బాబూ. తన పరిస్థితి చూస్తుంటే కంగారుగా ఉంది నాకు. వీలైనంత త్వరగా తీసుకెళ్లు ప్లీజ్.’’ డ్రైవర్ ఏమీ అనలేదు. అద్దంలోంచి ఆమెను చూశాను. ఆమె పరిస్థితి దిగజారుతోందని అర్థమవుతోంది. అందుకే ఆటో వేగం మరింత పెంచాడు. పావుగంట తర్వాత ఆటో ప్రభుత్వాసుపత్రి ముందు ఆగింది. ఆ వ్యక్తి మహిళను జాగ్రత్తగా దింపాడు. తను నిలబడలేకపోతోంది. తూలిపోతోంది. దాంతో రెండు చేతులతో ఎత్తుకుని లోనికి నడిచాడు. కానీ లోపల ఎవ్వరూ కనబడ లేదు. వాచ్‌మెన్ ఒక్కడే కునికిపాట్లు పడుతూ కనిపించాడు. ఆమెని స్ట్రెచర్ మీద పడుకోబెట్టి, వాచ్‌మేన్ దగ్గరకు వెళ్లాడతను. ‘‘బాబూ... డాక్టర్‌గారు లేరా?’’

‘‘లేరు. ఎప్పుడో వెళ్లిపోయారు. మీరు కూడా రేపు రండి’’... విసుగ్గా అన్నాడు.
‘‘లేదు బాబూ... తన పరిస్థితి బాలేదు. అర్జెంటుగా డాక్టర్‌గారికి చూపించాలి. ఫోన్ చేసి పిలుస్తావా దయచేసి?’’ వాచ్‌మెన్ అతణ్నీ ఆమెనీ మార్చి మార్చి చూశాడు. ‘‘ఫోన్ చేస్తే నన్ను చంపేస్తాడు. పక్క వీధిలో ఎడమ పక్కన ఉన్న మూడో ఇంట్లో ఉంటాడాయన. నువ్వే వెళ్లి బతిమాలుకుని తీసుకు తెచ్చుకో.’’ అతని నిర్లక్ష్యానికి మండుకొచ్చింది. కానీ కోపానికి అది సమయం కాదు.

అందుకే ఆలస్యం చేయకుండా తక్షణం కదిలాడతను. గుమ్మం దాటబోతోంటే వెనక నుంచి అడిగాడు వాచ్‌మేన్... ‘‘ఇంతకీ ఆవిడెవరు?’’ ‘‘ఎవరేంటి, నా భార్య. నువ్వు తనని లోపలకు తీసుకెళ్లి పడుకోబెట్టు. డాక్టర్‌ని తీసుకొస్తా’’... చెప్పేసి పరుగుదీశాడు. పావుగంట తర్వాత డాక్టర్‌తో పాటు వచ్చాడు. డాక్టర్‌ని చూస్తూనే లేచి నమస్కారం పెట్టాడు వాచ్‌మేన్. ‘‘పేషెంట్ ఎక్కడ?’’ అడిగాడు డాక్టర్. ‘‘లోపల పడుకోబెట్టాను సర్’’ అన్నాడు వాచ్‌మేన్ ఎంతో వినయంగా.

డాక్టర్ లోపలికి నడిచాడు. వెనుకే ఆ వ్యక్తి కూడా. లోపలకు వెళ్తూనే ఇద్దరూ అవాక్కయ్యారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ‘‘పేషెంట్ ఎక్కడ?’’ అన్నాడు డాక్టర్ కంగారుగా. ‘‘అవును ఏది? ఏమయ్యా... తను ఏది?’’ అరిచినట్టే అన్నాడా వ్యక్తి. అయోమయంగా చూశాడు వాచ్‌మేన్. ‘‘నాకేం తెలుసు సార్. లోపలకు తీసుకెళ్లి పడుకోబెట్టాను. బయటకు వచ్చి కాపలా ఉన్నాను. తను ఏమయ్యిందో నాకేం తెలుసు?’’ అన్నాడు కంగారుగా. ‘‘ఒకవేళ తను బయటకు వెళ్లిపోయి ఉంటుందా? కానీ తను స్పృహలోనే లేదు. ఎలా వెళ్తుంది?’’... నసిగాడతను. ‘‘చూడండి సర్. నిండు చూలాలు, స్పృహ లేని స్థితిలో ఎలా మాయమవు తుంది? మీవాళ్లెవరైనా వచ్చి తీసు కెళ్లారేమో కనుక్కోండి’’ అన్నాడు డాక్టర్.

‘‘మావాళ్లా? ఎవరూ రారు. అయినా మావాళ్లు తననెందుకు తీసుకెళ్తారు?’’ ‘‘తను నీ భార్య కాబట్టి.’’ అతని ముఖంలో రంగులు మారాయి. ‘‘క్షమించండి డాక్టర్. తను నా భార్య కాదు. అసలు తనెవరో కూడా నాకు తెలియదు.’’ విస్తుపోయాడు డాక్టర్. ‘‘అదేంటి? ఇందాక మీ భార్య అని చెప్పారు కదా?’’ ‘‘అలా చెప్పకపోతే మీరు ట్రీట్‌మెంట్ ఇవ్వరేమోనన్న భయంతో చెప్పాను. కానీ నిజంగా తనెవరో నాకు తెలీదు. నేనో చిన్న పనిమీద ఫరీదాబాద్ వచ్చాను. తిరిగి వెళ్లి పోతుంటే పొలిమేరల్లో ఒకామె ఎదురొ చ్చింది. బాగా నొప్పులు పడుతోంది. హాస్పిటల్‌కు తీసుకెళ్లమని బతిమాలింది. జాలేసి, ఓ ఆటోవాణ్ని బతిమాలుకుని ఇక్కడికి తీసుకొచ్చాను.’’

వాచ్‌మేన్ ఉలిక్కిపడ్డాడు. ‘‘ఏమంటున్నారు సర్? మీరు చెప్పేదంతా నిజమేనా?’’ అన్నాడు కళ్లు విప్పార్చి. అవునన్నట్టు తలూపాడతను. ‘‘సార్... మీరు చాలా పెద్ద పొరపాటు చేశారు. మీరు తీసుకొచ్చింది ఎవరినో తెలుసా?’’ ‘‘ఎవరిని?’’ ‘‘దెయ్యాన్ని’’ ఉలిక్కిపడ్డారిద్దరూ. ‘‘ఏం మాట్లాడు తున్నావ్?’’ అన్నాడు డాక్టర్ కోపంగా. ‘‘నిజమే సర్. ఆమె మనిషి కాదు... దెయ్యం. తను ఇలాగే చుట్టుపక్కల ఊళ్లలో ఎందరికో కనిపించింది. ఈయనలాగే జాలిపడి వాళ్లంతా సాయం చేయ బోయారు. చివరికి తనో దెయ్యమని తెలుసుకున్నారు.’’ అది వింటూనే ఆ వ్యక్తి పై ప్రాణాలు పైనే పోయాయి. వాచ్‌మేన్ చెప్పింది నమ్మలేకపోయాడు. తాను చూసింది, తీసుకొచ్చింది దెయ్యాన్నా? ఇది నిజమా?

పదే పదే ఈ ప్రశ్నలు వేసుకున్నాడు. భయంతో నిలువెల్లా వణికిపోయాడు. అతడే కాదు, అలా చాలామంది ఈ భయంకరమైన అనుభవాన్ని చవిచూశారు. ఆపదలో ఉన్న స్త్రీ అని భావించి సాయం చేయబోయి షాక్‌కి గురయ్యారు. అసలింతకీ ఎవరామె? ఎందుకు ఇలా కనిపిస్తోంది? ఎందుకలా కనిపించి మాయమవుతోంది? ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఉంది ఫరీద్‌పూర్ పట్టణం. అక్కడికి దగ్గర్లో ఉన్న ఓ చిన్న గ్రామంలో పుట్టి పెరిగింది రాశి. ఎప్పుడూ లేడి పిల్లలా పరుగులు తీస్తూ ఉండేది.

ఎవరికి ఏ సాయం అవసర మైనా అక్కడ ప్రత్యక్షమైపోయేది. ఎవరిదైనా పెళ్లి జరిగితే పెళ్లి కూతుర్ని చేసినప్పట్నుంచి అప్పగింతల వరకూ అన్నీ ఆమె చేతుల మీదుగా జరగాల్సిందే. ఎవరూ ఆమెని ఏదీ చేయమని అడగక్క ర్లేదు. తనంత తనే కల్పించుకుని చేసే స్తుంది. అందుకే తనంటే అందరికీ ఎంతో ఇష్టం. ఆమె తమతో ఉంటే ఆనందం. అయితే ఆ ఆనందం శాశ్వతంగా దూరమై పోతుందని ఎవరూ ఊహించలేదు.

రాశి తల్లిదండ్రులు పేదవాళ్లు. చిన్న చిన్న పనులు చేసుకుని పొట్ట పోసుకునే వాళ్లు. తాము పడిన కష్టాలు తమ కూతురు పడకూడదని కోరుకునేవారు. తనకో మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యాలని తపించేవారు. చివరికి ఓసారి ఆ సంబంధం వచ్చింది. ఫరీద్‌పూర్‌లో ఉద్యోగం చేసుకుంటోన్న ఓ కుర్రాడు ఒక ఫంక్షన్‌కి ఆ ఊరు వచ్చినప్పుడు రాశిని చూసి ఇష్టపడ్డాడు. ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి పెళ్లికి ఒప్పించాడు. కళ్లు మూసి తెరిచేలోగా పెళ్లి జరిగిపోయింది. రాశి భర్తతో కాపురానికి వెళ్లిపోయింది.

రోజులు, వారాలు, నెలలు గడిచాయి. కానీ రాశి ఒక్కసారి కూడా పుట్టింటికి రాలేదు. తల్లిదండ్రులు వస్తామని జాబు రాసినా, బాగానే ఉన్నాను, రావొద్దు అని జవాబు రాసేది. కానీ ఒకసారి ఫలానా రోజు ఊరికి వస్తున్నానంటూ ఉత్తరం రాసింది. ఆమె తల్లిదండ్రులే కాదు, ఊళ్లో వాళ్లంతా సంతోషంతో పొంగిపోయారు. ఇంతకాలం తర్వాత వస్తోన్న ఆమెకు ఘన స్వాగతం పలకాలని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కానీ రాశి రాలేదు. ఆరోజు రాలేదు. మర్నాడు రాలేదు. రెండు రోజులైనా రాలేదు. వారం గడిచినా రాలేదు. చివరికి ఓరోజు రాశి చావు కబురు మోసుకుంటూ ఒక పోలీస్ వ్యాన్ వచ్చింది.

ఫరీద్‌పూర్ పొలిమేరల్లో ఓ నిండు చూలాలి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో దొరికింది. ఆమె బ్యాగులో దొరికిన ఓ కాగితంలో రాసివున్న అడ్రస్‌ను బట్టి పోలీసులు ఆమె తల్లిదండ్రులను కనుగొని విషయం చేరవేశారు. రాశి భర్తే ఆమెను చంపివుంటాడన్నారంతా. అతడు రాశిని చిత్రహింసలు పెట్టివుంటాడని, అందుకే ఆమె అందరికీ దూరంగా ఉండి పోయిం దని, చివరికి తాను తల్లిని కాబోతున్నా నన్న విషయం కూడా ఎవరికీ చెప్పి వుండదనీ అన్నారు. అది నిజమో కాదో ఎవరికీ అర్థం కాలేదు. ఉన్నట్టుండి ఇంటికి ఎందుకు బయలుదేరిందో కూడా తెలియ లేదు. ఎందుకంటే అవన్నీ ఇద్దరికే తెలుసు. రాశికి, ఆమె భర్తకి. రాశి లేదు, రాదు. ఆమె భర్త జాడ ఎంత వెతికినా దొరక లేదు. దాంతో రాశి జీవితం, ఆమె మరణం రహస్యాలుగా మిగిలిపోయాయి.

అయితే ఆ తర్వాత రాశి ఆత్మ అప్పు డప్పుడూ కొందరికి కనిపించేది. నొప్పులు పడుతూ ఆస్పత్రికి తీసుకెళ్లమని అడిగేది. తీసుకెళ్లాక ఉన్నట్టుండి మాయమైపోయేది. అలా ఎందుకు చేసేదో ఎవరికీ అర్థ మయ్యేది కాదు. ఇదంతా ఎప్పుడో నాలుగు దశాబ్దాల క్రితం జరిగింది. ఇప్పుడు రాశి ఎవరికీ కనిపించడం లేదు. అంటే ఆమె ఆత్మకు శాంతి దొరికిందా? లేక ఆత్మగా తిరుగాడలేక విసిగిపోయి తనంత తానే ఎటైనా వెళ్లిపోయిందా? ఏమో... చివరికి అది కూడా మిస్టరీనే!

MOVIEART--vadivelu
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration