Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 25511 Registered: 08-2008 Posted From: 119.56.126.88
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, January 06, 2016 - 11:24 pm: | |
రిలీజ్‌కు ముందే రీమేక్ ప్లాన్స్ Others | Updated: January 07, 2016 09:20 (IST) ఈ సంక్రాంతికి భారీ రిలీజ్‌కు రెడీ అవుతున్న నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ ఎంటర్టైనర్ డిక్టేటర్. బాలయ్య స్టైలిష్ డాన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే రిలీజ్‌కు ముందే డిక్టేటర్ ఓ రేంజ్లో హడావిడి చేస్తున్నాడు. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు తమిళ్లో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు. ఇప్పటికే ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ డిక్టేటర్ సినిమాను అజయ్ దేవ్గన్ హీరోగా బాలీవుడ్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. ఈ సినిమాకు తెలుగులో దర్శకత్వం వహించిన శ్రీవాస్నే దర్శకుడిగా ఎంపిక చేశారు. ఇప్పుడు అదే బాటలో కోలీవుడ్‌లోనూ రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారట. వేదాలం సినిమాతో భారీ హిట్ కొట్టిన అజిత్ హీరోగా డిక్టేటర్ రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే కథ కూడా విన్న అజిత్ డిక్టేటర్ రిలీజ్ తరువాత ఫైనల్ డెసిషన్ తీసుకోనున్నాడు. जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|