Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 25353 Registered: 08-2008 Posted From: 183.90.116.212
Rating: N/A Votes: 0 | Posted on Sunday, December 27, 2015 - 11:36 am: | |
అమ్మవారు అనుగ్రహిస్తే ప్రయుత చండీయాగం నిర్వహిస్తా Sakshi | Updated: December 27, 2015 19:08 (IST) అమ్మవారు అనుగ్రహిస్తే ప్రయుత చండీయాగం నిర్వహిస్తా హైదరాబాద్: లోక కల్యాణం, విశ్వశాంతి, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం అయుత మహాచండీయాగాన్ని నిర్వహించినట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. మెదక్ జిల్లా ఎర్రవల్లిలో చేపట్టిన చండీయాగం ఆదివారం సాయంత్రం ముగిసింది. అనంతరం యాగశాల నుంచి కేసీఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. మహా చండీయాగం విజయవంతం కావడానికి కృషిచేసిన రుత్వికులకు, భక్తుల సౌకర్యం కోసం పనిచేసిన నాయకులకు, అధికారులు, ప్రజలకు, కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. శృంగేరిలో జరిగిన చండీయాగం స్ఫూర్తితో ఇక్కడ నిర్వహించినట్టు కేసీఆర్ చెప్పారు. అమ్మవారు అనుగ్రహిస్తే ప్రయుత చండీయాగం నిర్వహిస్తానని కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ ఇంకా ఏం మాట్లాడారంటే.. తెలంగాణ వస్తే అయూత మహా చండీయాగం చేస్తానని గతంలో చెప్పా తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మవారు ప్రసాదిస్తే.. మహాచండీయాగం చేస్తానని మొక్కుకున్నాను ధర్మం జయిస్తుంది.. అధర్మం నశిస్తుంది నేను ఇచ్చే సంభావన చంద్రుడికి నూలుపోగులాంటింది నా జీవితం సంపన్నమైంది.. ప్రజలు ఆశ్వీరదీంచడం వల్ల ఈ రోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాను త్వరలో మళ్లీ శృంగేరి వెళ్లి స్వామివారి ఆశీస్సులు తీసుకుంటాను అయూత చండీమహాయాగం చేయాలని 2011లోనే నిర్ణయం యాగానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మిషన్ భగీరథ త్వరగా పూర్తి కావాలని అమ్మవారిని కోరుకున్నా जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|