Superman
Kurra Bewarse Username: Superman
Post Number: 1426 Registered: 10-2005 Posted From: 75.73.208.143
Rating: N/A Votes: 0 | Posted on Thursday, June 11, 2015 - 6:06 pm: | |
ఆ సీఎంతో మీకేంటి సమస్య ‘ఇరు రాషా్ట్రల ముఖ్యమంత్రులు తమ తమ వాదనలను వినిపిస్తున్నారు. నేను ఎవర్ని సమర్థించగలను’ అని గవర్నర్ తనదైన శైలిలో ఒక కేంద్రమంత్రి వద్ద వాదించినట్లు సమాచారం. అయితే గవర్నర్ పదవిలో ఉన్నవారు స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే స్థితిలో ఉండాలని, ఎవరు ఏ విధంగా వాదించినా, పరిస్థితులు ప్రశాంతంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత గవర్నర్దని ఆ కేంద్రమంత్రి స్పష్టం చేసినట్లు తెలిసింది. మీరు ఇరు రాషా్ట్రల సీఎంలతో సమానంగా వ్యవహరించడం లేదని, కేవలం ఒక రాష్ట్ర సీఎం వైపే మొగ్గు చూపుతున్నారన్న సమాచారం మా వద్ద ఉందని ఆ కేంద్ర మంత్రి అన్నప్పుడు గవర్నర్ సుదీర్ఘ వివరణ ఇచ్చినట్లు తెలిసింది. తాను అలా ఎప్పుడూ వ్యవహరించ లేదని, పలుమార్లు ఇద్దరు సీఎంలను సమావేశపరిచానని ఆయన చెప్పినట్లు సమాచారం. ఇకపై అలాంటి సంకేతాలు రాకుండా చూడాలని కేంద్రం ఆయనకు సూచించినట్లు తెలుస్తోంది. ఫలానా ముఖ్యమంత్రితో మీకేమిటి సమస్య అని కూడా కేంద్రమంత్రి గవర్నర్ను అడిగినట్లు తెలుస్తోంది. |