Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 96627 Registered: 03-2004 Posted From: 185.46.212.70
Rating: N/A Votes: 0 | Posted on Thursday, May 28, 2015 - 3:23 am: | |
ముంబై: తన గత జీవితాన్ని ప్రస్తుత జీవితంతో ముడిపెట్టొదని బాలీవుడ్ నటి సన్నీ లియోన్ కోరింది. బాలీవుడ్ లో అడుగుపెట్టిన నాటి నుంచి గౌరప్రదమైన జీవితం గడుపుతున్నానని ఆమె పోలీసులతో చెప్పినట్టు తెలిసింది. తనపై నమోదైన కేసులో వివరణ ఇచ్చేందుకు బుధవారం ఆమె థానే పోలీసుల ఎదుట హాజరైంది. 'ఆ అభ్యంతరకర వీడియో నేను అమెరికాలో పెద్దల సినిమాలు చేస్తున్నప్పుడు తీసినది. భారతీయ సినిమా పరిశ్రమలో భాగం అయిన తర్వాత అటువంటి పాత్రలకు దూరంగా ఉంటున్నాను. గౌరవప్రదంగా బతుకుతున్న నన్ను గత జీవితంతో వెంటాడడం సబబు కాదు' అని పోలీసులతో చెప్పినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. తన బాడీగార్డులతో కలిసి బుధవారం మధ్యాహ్నం 1.45 గంటల ప్రాంతంలో థానే పోలీసు హెడ్ క్వార్టర్స్ వచ్చిన ఆమె నేరుగా డీసీపీ(క్రైమ్) పరాగ్ మానెరె కార్యాలయానికి వెళ్లారు. గంటపాటు ఇంగ్లీషులో ఆమె ఇచ్చిన వివరణను పోలీసులు రికార్డు చేశారు. హక్కుల కార్యకర్త అంజలి పాలన్ ఫిర్యాదు మేరకు రామనగర్ పోలీసులు ఈనెల 15న సన్నీ లియోన్ పై కేసు నమోదు చేశారు. |