Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 7575 Registered: 03-2004 Posted From: 107.5.22.81
Rating: N/A Votes: 0 | Posted on Friday, May 22, 2015 - 7:13 am: | |
సింగర్ సునీత షూటర్ అయిన వేళ... http://www.andhrajyothy.com/Artical.aspx?SID=112198&SubID=120 ఆంధ్రజ్యోతి,హైదరాబాద్: చిన్నారులకి ఆనందం కలిగిస్తూనే అవసరమైన విజ్ఞానాన్ని కూడా అందిస్తూ కొన్నేళ్లగా నగరంలో నిర్వహిస్తోన్న హైదరాబాద్ కిడ్స్‌ఫెయిర్ మరో మారు నగరవాసుల ముంగిటకొచ్చింది. ఈ నెల 24 వ తేదీ వరకూ జరిగే ఈ ఫెయిర్‌ని మాదాపూర్ హైటెక్స్‌లో గురువారం మధ్యాహ్నం గాయని సునీత ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ‘‘నేటి తరానికి గాడ్జెట్స్‌తో ఆడటమే సరిపోతుంది. పిల్లలకి అవసరమైన సమాచారం అందిస్తూనే వారికి ఆసక్తి గొలిపే ఆటలని కూడా ఇక్కడ అందిస్తుండటం అభినందనీయం’’ అన్నారు. ఐదోసారి నిర్వహిస్తోన్న ఈ ఫెయిర్‌లో స్పాట్ మ్యూజికల్ కాంపిటేషన్, చోటా భీమ్, జుంబా డ్యాన్స్ వంటి ప్రదర్శనలతో పాటుగా రోబోటిక్స్, స్టోరీ టెల్లింగ్ సెషన్ కూడా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ ఫెయిర్‌లో ప్రవేశించటానికి 50 రూపాయలు (పెద్దవారు), 30 రూపాయలు (చిన్నారులకి) వసూలుచేస్తున్నారు.} |