Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 7493
Registered: 03-2004
Posted From: 68.32.65.38

Rating: N/A
Votes: 0

Posted on Thursday, April 16, 2015 - 5:10 pm:   

Kummestunnadu kadaa???

కుర్ర హీరోల ఓవర్‌ యాక్షన్‌.. ఈగోతో పుట్టి... ఈగోతో పెరిగి!
గోరంత ట్యాలెంట్‌కు కొండంత గర్వం.. నిర్మాతలంటే డబ్బు యంత్రాలే
అండర్‌వేర్లూ అడుక్కొనే దౌర్భాగ్యం.. కుటుంబ యాత్రలుగా విదేశీ షూట్‌లు
(హైదరాబాద్‌ - ఆంధ్రజ్యోతి)
అప్పట్లో కొందరు పెద్ద హీరోలు ఇమేజ్‌ చట్రంలో ఇరుక్కునేవారు! కానీ... నేటి కుర్ర హీరోలు ‘ఈగో చట్రం’లో పడిపోతున్నారు. ‘తాతలు నేతులు తాగారు’ అంటూ... చెలరేగిపోతున్నారు! వీరేకాదు... ఏళ్ల తరబడి చిన్నచిన్న పాత్రలు చేసి, అదృష్టం కలిసొచ్చి మొహంపై ముడతలు పడిన తర్వాత హీరోలుగా మారిన వారిలోనూ కొందరు ఇలాగే ప్రవర్తిస్తున్నారు. షూటింగ్‌లో రాచ మర్యాదలు, బయట అడుగు పెడితే చుట్టూ బౌన్సర్లు, అభిమానుల కోలాహలం! వెరసి... ‘మేం మామూలు రకం మనుషులం కాదు! నేరుగా పైనుంచి ఊడిపడ్డాం!’ అన్నట్లుగా వీరు చెలరేగిపోతుంటారు. తెరపై విలన్లను తంతారు. తమకు అసౌకర్యం కలిగించారంటూ రోడ్లపై సామాన్య జనాన్నీ తంతారు. తమకు అన్నం పెడుతున్న సినిమాను, నిర్మాతనైనా గౌరవిస్తారా అంటే అదీ ఉండదు. చివరికి... తమను వెండి తెర వేలుపుగా మలిచే దర్శకులతోనూ గిల్లికజ్జాలు పెట్టుకునే వారున్నారు. వాళ్లు చేసిందే డ్యాన్స్‌, వాళ్లు చెప్పిందే డైలాగ్‌, వాళ్లు చూపిందే పెర్‌ఫామెన్స్‌! దీనికి ఒకరిద్దరు హీరోలు మాత్రమే మినహాయింపు! మిగిలిన వాళ్లంతా ఆల్మోస్ట్‌ సేమ్‌ టు సేమ్‌!
పాత విలువలకు పాతర
ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌తోపాటు ఆ తర్వాతి తరం నాయకులు నిర్మాత, దర్శకులను తల్లిదండ్రులతో సమానంగా గౌరవించేవారు. ఒకవైపు సూపర్‌ స్టార్‌డమ్‌ అనుభవిస్తున్నప్పటికీ... తమను నమ్ముకున్న నిర్మాత బాగుపడాలని తలచేవారు. ఏ విధంగా ఖర్చు తగ్గించాలా అని ఆలోచించేవారు. ఉదాహరణకు... హైదరాబాద్‌లోని సారథి స్టూడియోలో ఆత్మబలం, కలసి ఉంటే కలదు సుఖం చిత్రాల షూటింగ్‌ కోసం ఎన్టీఆర్‌ మద్రాస్‌ నుంచి వచ్చేవారు. నిర్మాతలు పెద్ద హోటల్లో రూమ్‌ తీస్తామన్నా, ‘అక్కడి నుంచి మళ్లీ ఇక్కడికే రావాలిగా టైమ్‌ వేస్ట్‌’ అంటూ స్టూడియో గదిలోనే బస చేసే వారు. ఆ తర్వాతి తరంలోనూ ఇలాంటి హీరోలు ఉన్నారు. కానీ... ఇప్పుడు ఏమాత్రం కష్టపడకుండానే ‘బాబుడమ్‌, స్టార్‌డమ్‌’ సంపాదించుకున్న హీరోల తీరే వేరు. వారి దృష్టిలో నిర్మాత అంటే షూటింగ్‌ నడిచినన్నాళ్లు తమ అవసరాలు తీర్చే ఏటీఎం మాత్రమే! కొందరు యంగ్‌ హీరోలు తమ స్నేహితులు పబ్బుల్లో తాగిన, తిన్న బిల్లును కూడా నిర్మాతలకే పంపుతున్నారు. విదేశాల్లో షూటింగ్‌ పెడితే చాలు... కొందరు హీరో కుటుంబ సభ్యులు, కొండకచో వ్యక్తిగత మిత్రులూ విమానం ఎక్కేస్తున్నారు. వారి ఖర్చులన్నీ నిర్మాత నెత్తినే పడతాయనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో ఎన్నో బ్లాక్‌ బస్టర్స్‌ ఇచ్చిన నిర్మాతలు సైతం ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉండటానికి కారణం... ఇలాంటి బాబులు, వారు మోగిస్తున్న స్టార్‌‘డ్రమ్‌’లే!
తుస్స్‌ తుస్స్‌ సినిమాలకే!
ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ నటించిన ఎన్నో మరపురాని చిత్రాలు ఈనాటికీ అలరిస్తున్నాయి. కృష్ణకు ‘అల్లూరి సీతారామరాజు’, కృష్ణంరాజుకు ‘తాండ్రపాపారాయుడు’ శోభన్‌బాబుకు ‘వీరాభిమన్యు’, చిరంజీవికి ‘ఖైదీ’, మోహన్‌బాబుకు ‘పెదరాయుడు’ బాలకృష్ణకు ‘మంగమ్మగారి మనవడు’, వెంకటేశ్‌కు ‘చంటి’, నాగార్జునకు ‘అన్నమయ్య’ ఇలా కెరీర్‌లో చెప్పుకొనే సినిమాలు చాలాఉంటాయి. ఏళ్ల తరబడి సినిమారంగాన్ని ఏలి... పదులకొద్దీ ఆణిముత్యాల్లాంటి సినిమాల్లో నటించిన మహామహుల్లో ఆత్మాభిమానంతో కూడిన గర్వం తొణికిసలాడేది! పదులకొద్దీ సినిమాల్లో అద్భుతమైన నటనా కౌశలం ప్రదర్శించిన తర్వాతే ఆయా హీరోలకు నటరత్న, నట సామ్రాట్‌, నటశేఖర, నటభూషణ వంటి బిరుదులు లభించేవి. ఇప్పటి హీరోలు అలా కాదు! కర్ణుడు కవచ కుండలాలతో పుట్టినట్లు... వీరు పుట్టడమే బిరుదులతో పుడుతున్నారు. రెండు సినిమాలు హిట్‌ అయ్యేసరికి వీరికి భూమ్మీద కాలు నిలబడదు. ఇలాంటి బాబులు, వారి బిరుదులకు సెటైర్‌గానే ‘బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌ బాబు’ పుట్టుకొచ్చాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ట్వింకిల్‌ ట్వింకిల్‌ ‘లిటిల్‌’ స్టార్‌
హండ్రడ్‌ డేస్‌, టూ హండ్రడ్‌డేస్‌, సిల్వర్‌ జూబ్లీ కాలాలు వెళ్లిపోయాయి. నేటి బాబులది మూడు రోజుల ముచ్చటే. వీలైనంత తక్కువ సమయంలో ఎక్కువ సొమ్ము చేసుకునేందుకు పెద్ద హీరోల సినిమాలు వెయ్యి థియేటర్‌లలో విడుదల చేస్తున్నారు. గురువారం సినిమా విడుదలైతే ఆదివారంతో ‘ఆఖర్‌’. ఆ తర్వాతి రోజు నుంచి సినిమా ఎక్కడుందో వెతుక్కోవాల్సిందే! మొదటివారంలోనే వసూళ్లు రాబట్టడానికి అనేక గిమ్మిక్కులు చేస్తున్నారు. మొదటి రోజు తొమ్మిది కోట్లు, పది కోట్లు కలెక్ట్‌ చేసిందని ఊదరగొడుతున్నారు. ఇదంతా తమ నటనా కౌశల మహిమే అని కుర్ర హీరోలు తెగ ఫీలై... తదుపరి సినిమాకు వెంటనే పారితోషికం పెంచేస్తున్నారు.


సొమ్మొకరిది... సోకు హీరోది!
కథ, పాత్ర అవసరాలను బట్టి హీరో హీరోయిన్లను, ఇతర నటులను ఎంచుకునే హక్కు, అధికారం నిర్మాత, దర్శకులదే. కానీ... నేటి హీరోల ముందు ఇది చెల్లదు. తనకు అన్నివిధాలా సహకరించే హీరోయిన్‌ను మాత్రమే తీసుకోవాలని నిర్మాతను ఆదేశిస్తారు. ఆ హీరో తనని రికమెండ్‌ చేశాడని తెలియగానే హీరోయిన్‌ చెట్టెక్కి కూర్చుంటుంది. ఈ మధ్య ఒక సినిమాకి ఓ సంగీత దర్శకుణ్ణి ఎనౌన్స్‌ చేశారు. కానీ... హీరో ఒత్తిడితో మ్యూజిక్‌ డైరెక్టర్‌ను మార్చేశారు. హీరోల రికమండేషన్‌ కారణంగా సంగీత దర్శకుల పారితోషికాలూ పెరిగిపోయాయి. ఇతర భాషా పరిశ్రమల్లోనూ వారసులున్నప్పటికీ ‘బాబుడమ్‌’ మాత్రం లేదు. ఇక్కడి హీరోలు అనుభవిస్తున్న విలాసాలు చూసి పొరుగు హీరోలు అసూయపడే పరిస్థితి!
నాటి విలువలు...
ఎన్టీఆర్‌కు ఉదయం ఏడు గంటలకే షాట్‌లో ఉండటం అలవాటు. మిగిలిన వారు ఎవరైనా లేటుగా వస్తే ఆయన సహించలేరు. వెంటనే వారికి ఎన్ని సీన్లున్నాయో లెక్కపెట్టించి, వారిని తీయించేసి మరో ఆర్టిస్టుతో షూటింగ్‌కి వెళ్లిపోయే వారు. నిర్మాతకు సమయం వృథా కాకుండా సహకరించేవారు.
ఇదేనా హీరోయిజం?
ఈ మధ్య ఒక హీరో ఔట్‌డోర్‌ షూటింగ్‌కు వెళ్లారు. తను అక్కడున్నన్ని రోజులూ, రోజుకో కొత్త అండర్‌వేర్‌ ఇవ్వాలని నిర్మాతని ఆదేశించారు.
మొత్తం ఇండసీ్ట్రలోనే బాగా ‘ఈగో’ ఉందనే పేరు తెచ్చుకున్న హీరోకు ‘సార్‌.. షాట్‌ రెడీ’ అని చెప్పేందుకు కూడా అసిస్టెంట్‌ డైరెక్టర్లు వణికిపోతారు.
తొలుత సహాయ దర్శకుడిగా పనిచేసి, ఆ తర్వాత దర్శకుల ప్రతిభవల్ల హీరోగా మారిన ఒక కథానాయకుడు ఇప్పుడు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ తన దగ్గర నిలబడిన పావుగంటకుగానీ కన్నెత్తి చూడడు!

Evaru??? Is it RaviTeja????




సమయానికి డబ్బు సర్దుబాటుకాక రెమ్యునరేషన్‌ మొత్తాన్ని చెల్లించకపోవడంతో వరుస ఫ్లాపుల కుర్ర హీరో ఒకరు... డబ్బింగ్‌ చెప్పకుండా నిర్మాతకు చుక్కలు చూపించాడు. డబ్బు ఇచ్చిన తర్వాతగానీ సదరు హీరో మైకు ముందు నోరు తెరవలేదు.
NTR Jr.???


ఇద్దరు ముగ్గురు కుర్ర హీరోలున్నారు. తెలుగురాని హీరోయిన్ల ముందే వారిని ఉద్దేశించి పచ్చి బూతు జోకులు వేస్తారు. సభ్యత ఉన్నవారెవరూ వినలేనంత బూతు బురదలో దొర్లి ఆనందిస్తుంటారు.

????


‘షూటింగ్‌ సమయంలో ఏమాత్రం బ్రేక్‌ వచ్చినా హీరోయిన్‌తో క్రికెట్‌ ఆడుకునేవాడిని. దర్శకుడు నెత్తీనోరూ కొట్టుకుంటేగానీ స్పాట్‌లోకి వచ్చేవాడిని కాదు’ అని రెండు సినిమాల వయసు కూడా లేని ఓ హీరో బహిరంగంగానే చెప్పాడు.

????


మరో హీరో అయితే ఎప్పుడెప్పుడు కారవాన్‌లోకి ఎక్కుదామా అని చూస్తుంటాడు. ఆయన అలక పాన్పు ఎక్కాడంటే యూనిట్‌ మొత్తం ఎదురుచూస్తూ కూర్చోవాల్సిందే. ఆయన్ని పిలిచే ధైర్యం ఎవరూ చేయలేరు. ఆయనకు ఏ మాత్రం నచ్చని విషయం జరిగినా ‘ప్యాకప్‌’ అనే సౌండ్‌ వినిపిస్తుంది.

తెరమీద తెగ అల్లరి చేసే ఒక హీరో మధ్యాహ్నం రెండు గంటలకు షూటింగ్‌కు వస్తాడు. అప్పటిదాకా మిగిలిన వాళ్లంతా ముఖాలకు రంగేసుకుని వేచి చూడాల్సిందే. ఈ విషయాన్ని గమనించిన నిర్మాత... మధ్యాహ్నం 2 గంటలకు షూటింగ్‌ ఫిక్స్‌ చేశారు. ఆ మరుసటి రోజు హీరో సాయంత్రం 4.30కి వచ్చాడు. పైగా... షూటింగ్‌లో పాల్గొనకుండా కారవాన్‌లో కూర్చున్నాడు. తనకు చెప్పకుండా షూటింగ్‌ టైమ్‌ మార్చినందుకే ఈ ప్రతీకారం.
?????


ఓ పెద్ద దర్శకుడు కుర్ర హీరోతో సినిమా చేస్తున్నప్పుడు ఎక్కడో తేడా వచ్చింది. మరుసటి రోజు నుంచి సుమారు 20 రోజులు హీరోకు ‘అస్వస్థత’! నిర్మాత, ఇతరులు బతిమలాడుకున్నాకే హీరో ఆరోగ్యం బాగుపడింది.

??? any clues????

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration