Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 7436
Registered: 03-2004
Posted From: 68.32.65.38

Rating: N/A
Votes: 0

Posted on Saturday, April 04, 2015 - 11:45 pm:   

AndhraJyothy Kummestondi kadaa.... 2 days nunchee serial ga articles rasthunnadu...

ష్ట్ర విభజన జరిగి పది మాసాలైంది. ఈ పది నెలల్లో రెండు తెలుగు రాష్ర్టాల మధ్య ఎన్నో వివాదాలు, ఉద్రిక్తతలు! పొరుగు రాష్ట్రం తమకు సహకరించడం లేదని, గిల్లికజ్జాలు పెట్టుకుంటోందని ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు పరస్పరం ఆరోపించుకుంటూ కలహించుకుంటూనే ఉన్నారు. ఒక దశలో నాగార్జున సాగర్‌ వద్ద ఉభయ రాష్ర్టాల పోలీసులంతా రోడ్డునపడి కొట్టుకునే వరకూ పరిస్థితి వచ్చింది. ఇటువంటి పరిణామాలతో తెలుగు ప్రజల మధ్య అంతరం మరింత పెరిగింది. పరస్పరం అనుమానంగా చూసుకుంటు న్నారు. తెలంగాణవాదులు తమను అవమానిస్తున్నారని సీమాంధ్రులు, రాష్ట్రం విడిపోయినా సీమాంధ్రులు ఇక్కడే తిష్ఠ వేసుకుని కూర్చోవడం ఏమిటని తెలంగాణవాదులు సూటి పోటి మాటలు అనుకుంటున్నారు. ఇవన్నీ గత పది నెలలుగా మనం చూస్తున్నాం. రెండు తెలుగు రాష్ర్టాల మధ్య ఇన్ని సమస్యలున్నా ఏ ఒక్క సమస్య కూడా కనిపించని వ్యక్తి ఒకరున్నారు. ఆయనకు అంతా సవ్యంగానే కనిపిస్తుంది. మనకు కనబడని అభివృద్ధిని కూడా ఆయన తన దివ్యదృష్టితో చూడగలరు. ఆయన ఎవరంటే రెండు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌! తమిళనాడుకు చెందిన ఈ నరసింహన్‌ గారికి తెలుగు ప్రజల సమస్యలు పట్టవు. ఉభయ రాష్ర్టాల మధ్య ఎన్ని వివాదాలు ఏర్పడినా చిద్విలాసంగా నవ్వుతూ ‘మీ చావు మీరు చావండి’ అని ఉచిత సలహా పారేస్తుంటారు. మామూలుగా అయితే, ‘హిజ్‌ ఎక్సెలెన్సీ’ అని మనం పిలుచుకునే గవర్నర్‌ ఆరో వేలు వంటివారు. ఆయనకు అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే అధికారాలుంటాయి. మిగతా సందర్భాల్లో ముఖ్యమంత్రులు, మంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించడం మాత్రమే ఆయన పని! అలాంటి గవర్నర్లను ‘హిజ్‌ ఎక్సెలెన్సీ’ అని సంబోధించడం బ్రిటిష్‌ వారి నుంచి మనం అందిపుచ్చుకున్న సామ్రాజ్యవాద లక్షణం ఇది. ప్రపంచానికే పెద్దన్నగా ఉంటున్న అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఇటీవల మన దేశం వచ్చినప్పుడు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనను ఉద్దేశించి ‘ప్రెసిడెంట్‌ ఒబామా’ అని అన్నారే గానీ ‘హిజ్‌ ఎక్సెలెన్సీ’ అని సంబోధించలేదు. అమెరికా అధ్యక్షుడినే సాదాసీదాగా పిలవగలగడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న వెసులుబాటు, సుగుణం. భారతదేశం ప్రజాస్వామ్య దేశాల్లో అతి పెద్దది. ఇక్కడ మాత్రం అధికారాలు కూడా లేని గవర్నర్లను హిజ్‌ ఎక్సెలెన్సీ అని పిలుచుకోవడం ఎందుకో తెలియదు.
- వివాదాల సృష్టికర్త
ఇప్పుడు తెలుగు ప్రజల ఎక్సెలెన్సీ గవర్నర్‌ నరసింహన్‌ విషయానికి వద్దాం. ఇతర రాష్ర్టాల గవర్నర్లతో పోలిస్తే మన గవర్నర్‌కు కొన్ని విశేష అధికారాలు ఉన్నాయి. రాష్ట్ర విభజన చట్టంలోనే సదరు అధికారాలను పొందుపరిచారు. హైదరా బాద్‌ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించినందున గవర్నర్‌కు కొన్ని ప్రత్యేక అధికారాలు కట్టబెట్టారు. మరికొన్ని బాధ్యతలు కూడా అప్పజెప్పారు. అయితే, నరసింహన్‌ మాత్రం ఉమ్మడి గవర్నర్‌గా తన విధులను నిర్వహించడంలో, బాధ్యతలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. ఏ ఒక్క వివాదాన్ని పరిష్కరించడానికీ ఆయన చొరవ తీసుకున్న పాపాన పోలేదు. వివాదాలు తలెత్తినప్పుడు పెద్ద మనిషిగా మధ్యవర్తిత్వం వహించి తప్పు ఎవరిదో నిర్థారించవలసిందిపోయి ‘మీరూ మీరూ మాట్లాడుకోండి’ అని ఉచిత సలహా పడేస్తున్నారు. వాస్తవానికి, రాష్ట్ర విభజనకు ముందు కొంతకాలం పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రపతి పాలనలో ఉంది. ఆ సమయంలో గవర్నర్‌గా నరసింహన్‌ తీసుకున్న నిర్ణయాలు, జారీ చేసిన జీవోలే ఇప్పుడు ఉభయ రాష్ర్టాల మధ్య వివాదానికి కారణమయ్యాయి. విద్యుత్‌ వివాదాన్నే తీసుకుందాం. అమల్లో ఉన్న విద్యుత్‌ ఒప్పందాలపై ఉభయ రాష్ర్టాలకు హక్కు ఉంటుందని ఈ గవర్నర్‌గారే జీవోలో పేర్కొన్నారు. సదరు జీవో ప్రకారం తమకు రావలసిన విద్యుత్‌ను ఏపీ ప్రభుత్వం ఇవ్వడం లేదని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించినప్పుడు కూడా మౌనంగానే ఉన్నారు. ఏపీ ప్రభుత్వం చేస్తున్నది తప్పు అయితే, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును పిలిచి ‘మీరు చేస్తున్నది తప్పు’ అని చెప్పవచ్చు కదా? ఆ పని చేయరు. ఉభయ రాష్ర్టాల ముఖ్యమంత్రులు ఎవరి వాదన వారు చేస్తుంటారు. గవర్నర్‌ మాత్రం ఉలకడు- పలకడు. దీంతో, రెండు రాష్ర్టాల తెలుగు ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. నాగార్జున సాగర్‌ కుడి కాలువ నుంచి డెల్టాలో పంటలు కాపాడుకోవడానికి ఏపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని తెలంగాణ ప్రభుత్వ నీటిపారుదల శాఖ అధికారులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా, డ్యామ్‌పై ఉభయ రాష్ర్టాల పోలీసులు మోహరించారు. చివరకు లాఠీలతో కొట్టుకున్నారు. ఈ దృశ్యాలను న్యూస్‌ చానెళ్లు గంటల తరబడి ప్రసారం చేశాయి. ‘ఇదేమి దురవస్థ’ అంటూ మనమంతా అవాక్కయ్యాం! మన గవర్నర్‌కు మాత్రం ఆ దృశ్యాలు కనిపించినట్టు లేవు. ఎందుకంటే, విలేకరులు ఎప్పుడు ప్రశ్నించినా రెండు రాష్ర్టాల్లో అన్నీ బాగానే ఉన్నాయనీ, శాంతిభద్రతలు భేష్‌ అనీ అంటారు. పోలీసులు కొట్టుకున్న రోజు కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకుని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఫోన్‌ చేసి, గవర్నర్‌ వద్దకు తీసుకు వెళ్లారే గానీ, నరసింహన్‌ మాత్రం పట్టించుకోలేదు. బాధ్యత గల ఏ గవర్నర్‌ అయినా ఇటువంటి ఘటన జరిగితే ఇద్దరు ముఖ్యమంత్రులను పిలిచి చీవాట్లు పెట్టి ఉండేవారు. పోలీసు అధికారిగా పని చేసి రిటైరైన తర్వాత యూ.పి.ఏ. ప్రభుత్వం పుణ్యమా అంటూ నరసింహన్‌ ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా ఉన్న నారాయణ్‌ దత్‌ తివారీ రాసలీలలను ‘ఏ.బి.ఎన్‌. ఆంధ్రజ్యోతి’ బయట పెట్టడంతో నాటి యూ.పి.ఏ. ప్రభుత్వం ఆయనతో రాజీనామా చేయించింది. ఆ నేపథ్యంలోనే ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా ఉన్న నరసింహన్‌ ఏపీ గవర్నర్‌గా బదిలీ అయ్యారు. ఒక పోలీసు అధికారిగా ముఖ్యమంత్రులకు శాల్యూట్‌ చేయడం మాత్రమే తెలిసిన మన నరసింహన్‌కు ముఖ్యమంత్రులను మందలించడం తెలిసి ఉండకపోవచ్చు. అందుకే కాబోలు, వివాదం ఏదైనా, ఉభయ రాష్ర్టాల మంత్రులు తన వద్దకు వచ్చినప్పుడు ‘మీ ముఖ్యమంత్రులతో సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవలసింది’గా ఉచిత సలహా పడేస్తున్నారు. గత పది నెలల కాలంలో విద్యుత్‌, విద్య, నీటి విషయాల్లో వివాదాలు తలెత్తి సంబంధిత శాఖల మంత్రులు గవర్నర్‌ నరసింహన్‌ వద్దకు పరుగులు తీయడం మనం చూశాం! ఉభయుల వాదనలు వినడం మినహా గవర్నర్‌గా చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించిన దాఖలా ఒక్కటి కూడా లేదు. ఎంసెట్‌ వివాదం తలెత్తినప్పుడు మంత్రులు గంటా శ్రీనివాసరావు, జగదీశ్‌ రెడ్డి పలుమార్లు గవర్నర్‌ను కలిశారు. చివరకు విసిగిపోయిన రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరి ఎంసెట్‌ వారే నిర్వహించుకోవాలన్న నిర్ణయానికి వచ్చాయి. ఇక్కడ విచిత్రం ఏమిటంటే, విభజన చట్టంలో ఏమి ఉందో ప్రజలకు తెలియదు. రెండు రాష్ర్టాల మంత్రులు భిన్న వాదనలు వినిపిస్తున్నప్పుడు, ‘ఫలానా వారి వాదన తప్పు. చట్టంలో ఫలానా విధంగా ఉంది. ఆ విధంగానే నడుచుకోండి’ అని చెప్పవలసిన బాధ్యత గవర్నర్‌పై లేదా? ఇలా చెప్పుకొంటూపోతే ఎన్నో ఉదంతాలు. తెలుగు రాష్ర్టాల్లో ఎన్ని సమస్యలు ఉన్నా ఢిల్లీ వెళ్లినప్పుడు మాత్రం అంతా సవ్యంగానే ఉందని గవర్నర్‌ చెబుతూ ఉండటం మనం చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వానికి ఆయన ఏమి నివేదికలు ఇస్తున్నారో మనకు తెలియదు. వివాదాలకు ఎటువంటి పరిష్కారాలు సూచిస్తున్నారో తెలియదు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన ఇద్దరు సలహాదారుల నుంచి ఏమి సలహాలు తీసుకుంటున్నారో మనకు తెలియదు. నరసింహన్‌కు సంబంధించి మనకు తెలిసిందల్లా.. ఆయన ఆ పదవిని ఎంజాయ్‌ చేస్తున్నారని మాత్రమే! హోలీ పండుగ వస్తే రంగులు పూయించుకుంటూ, ఇతరులపై రంగులు చల్లుతూ మన గవర్నర్‌ గారు ఎంజాయ్‌ చేస్తుంటారు. ఇటీవల కొత్తగా ఉగాది పండుగను కూడా రాజ్‌భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఆట పాటలతో అలసిపోయారు. ఇక, గుళ్లు గోపురాల సందర్శన గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది. గవర్నర్‌గా ఆయన ఇప్పటి వరకు 37 పర్యాయాలకుపైగా తిరుమల వెళ్లి 60 సార్లకుపైగా వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ప్రజల సొమ్ముతోనే ఆయన యాత్రలు సాగాయి. గుళ్లకు వెళ్లడం, భక్తితో పొర్లు దండాలు పెట్టుకోవడం వంటివి వ్యక్తిగత విశ్వాసాలు. వ్యక్తిగత విశ్వాసాలు, మొక్కులు తీర్చుకోవడానికి ప్రజల సొమ్ము ఖర్చు చేసే అధికారం గవర్నర్‌ అయినంత మాత్రాన నరసింహన్‌కు ఎవరిచ్చారు? పండుగలు, పబ్బాలు, గుళ్లు గోపురాలు తిరగడానికి ఆయన చేస్తున్న ఖర్చు చూస్తే- జైలుపాలైన రామదాసు శ్రీరాముడిని నిలదీసినట్లుగా, ‘ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు నరసింహా’ అని తెలుగు ప్రజలు పాడుకోవచ్చు. ఇలాంటి గవర్నర్లు తయారవుతున్నారనే, దాదాపు మూడు దశాబ్దాల కిందటే గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలని ఎన్‌.టి.ఆర్‌. పెద్ద ఉద్యమమే చేశారు. 1984లో అప్పటి గవర్నర్‌ రామ్‌లాల్‌ తనను అక్రమంగా భర్తరఫ్‌ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్‌.టి.ఆర్‌. గవర్నర్ల వ్యవస్థ రద్దు కోసం జాతీయ స్థాయిలో గళం వినిపించారు. గవర్నర్లు రాష్ర్టాల్లో రాష్ట్రపతికి ప్రతినిధులుగా ఉండాలి. కానీ, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు తమ వాళ్లకు మేలు చేయడం కోసం ఎవరిని బడితే వారిని గవర్నర్లుగా నియమించడం మొదలైన తర్వాత ఆ వ్యవస్థ గౌరవం మరింత దిగజారింది. గవర్నర్లు రాష్ట్రపతికి జవాబుదారీగా కాకుండా కేంద్ర ప్రభుత్వానికి తాబేదారులుగా వ్యవహరించడాన్ని మనం చూస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం జోరు మీద ఉన్నప్పుడు గవర్నర్‌ నరసింహన్‌ చేతిలో ఫైళ్లతో ఢిల్లీలో తరచుగా కనబడేవారు. అధికారికంగా ఏ హోదా లేని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కూడా గవర్నర్‌ హోదాలో ఆయన కలవడంపై అప్పట్లో విమర్శలు వచ్చాయి కూడా! ఎన్‌.టి.ఆర్‌. భావించినట్టు ఇటువంటి గవర్నర్లు మనకు అవసరమా? ఏ ఒక్క సమస్యను పరిష్కరించకుండా తన బాధ్యతలను విస్మరిస్తున్న గవర్నర్‌ నరసింహన్‌ తన చర్యలకు ఏమని సమాధానం చెబుతారు? చేతకాకపోతే ఆ ముక్క చెప్పి తప్పుకోవాలి. అంతేగానీ, తెలుగు ప్రజల సొమ్ముతో విలాసాలు అనుభవిస్తూ.. వారి మంచి చెడులు పట్టించుకోని నరసింహన్‌కు ఉమ్మడి గవర్నర్‌గా ఉండే అర్హత లేదని ప్రజలు భావించే పరిస్థితి తెచ్చుకోకూడదు.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration