Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Ramu
Yavvanam Kaatesina Bewarse
Username: Ramu

Post Number: 6859
Registered: 03-2004
Posted From: 199.244.214.111

Rating: N/A
Votes: 0

Posted on Friday, March 20, 2015 - 9:26 am:   

ద్రోణ: నీ కులము

కర్ణ: నేను సూతుడను, సూత కులము.

ద్రోణ: సూతకుల సంజాతులు ఊతకుల సంజాతులతో ఎదిరి నిలువ అనర్హులు.

సుయోధన:

ఆగాగు, ఆచార్య దేవా ఏమంటివి ఏమంటివి, జాతి నెపమున సూత సుతునకిందు నిలువ అర్హత లేదందువా ? ఎంతమాట ఎంతమాట. ఇది క్షాత్ర పరీక్షయే గానీ క్షత్రియ పరీక్ష కాదే, కాదు కాకూడదు ఇది కుల పరీక్షయే యందువా, నీ తండ్రి భర్ద్వాజుని జననమెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది, మట్టి కుండలో పుట్టితివి కదా నీది ఏ కులము? ఇంత ఏల? అస్మత్పితామహుదు కురుకుల వృద్ధుడు అయిన ఈ శాంతనవుడు శివ సముద్రుల భార్యయగు గంగా గర్భమున జనియించలేదా? ఈయనదే కులము? నాతో చెప్పింతువేమయ్యా ? మా వంశమునకు మూలపురుషుడైన వశిష్ఠుడు దేవ వేశ్య యగు ఊర్వశీ పుత్రుడు కాడా ? ఆతడు పంచమ జాతి కన్యయైన అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి ఛండాలంగన యందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లె పడుచైన మత్స్య గంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతొ మా తండ్రిని, పినపితామహి అంబాలికతొ మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చరుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదుర దేవుని కనలేదా ? సందర్భావసరములను బట్టి క్షేత్ర, బీజ ప్రాధాన్యములతొ సంకరమైన మా కురువంశము ఏనాడో కుల హీనమైనది. కాగా నేడు కులము కులము అని ఈ వ్యర్థ వాదమెందులకు ?

భీష్మ: నాయన, సుయోధనా!

సు: తాతా!

భీష్మ: ఏరులా పారు ఆ బ్రహ్మర్షుల జననములు మనము విచరించదగినవి కావు! (సు: హహ్హహహ్హ!) ఇది నీవన్నట్టు ముమ్మాటికి క్షాత్ర పరీక్షయే. క్షాత్రమున్న వారెల్లరూ క్షత్రియులే, వారిలో రాజ్యమున్న వారే రాజులు. అట్టి రాజులే ఈ కురురాజ పరిషత్తులో పాల్గొనుటకు అర్హులు.

సు: ఓహో, రాచరికమా అర్హతను నిర్ణయించునది ? అయిన, మా సామ్రాజ్యములో సస్యశ్యామలమై సంపద విరాళమై వెలుగొందు అంగరాజ్యమునకిపుడే ఈతని మూర్తాభిషిక్తుణ్ణి గావించుచున్నాను. సోదరా దుశ్శాసనా! అనర్ఘ నవరత్న ప్రశస్త కిరీటమును వేగముగ తెమ్ము, మామా గాంధార సార్వభౌమా! సురుచిర-మణిమయ-మండిత సువర్ణ సిమ్హాసనమును తెప్పింపుము, పరిజనులారా! పుణ్య-భాఘీరదీ నదీ తోయములనందుకొనుడు, కళ్యాణభద్రులారా! మంగళ తూర్యరవములు సుస్వరముగ మ్రోగనిండు, వందిమాగధులారా! కర్ణ మహారాజుకు కైవారమును కావింపుడు, పుణ్యాంగనలారా! ఈ రాధసుతునకు ఫాలభాగమున కస్తూరి తిలకమును తీర్చిదిద్ది బహుజన్మసుకృత-ప్రదీపాజ-సౌలబ్ధ సహజ-కవచకస్య-వైఢూర్య-ప్రభాదిత యోళికి వాంఛలు చెలరేగ వీర గంధము విజాలార్పుడు. నేనీ సకల మహాజన సమక్షమున, పండిత పరిషన్మధ్యమున సదా, సర్వదా, శతథా సహస్రథా ఈ కుల కళంక మహాపంకిలమును శాశ్వతముగా ప్రక్షాళణ గావించెదను.

కర్ణ: దాతా! నా రక్తము రంగరించి అలకులుశాది రేఖాచిగురితములైన మీ అరుణారుణ శుభపాదపద్మయుగళమునకు సౌలేపమను గావించినను మీ ఋణమీగువాడను కాను. ఎచటనూ శిరసొగ్గని ఈ రాధేయుడు తమ సర్వసమతా ధర్మోద్ధరణకు దాసానుదాసుడు. ఈ కర్ణుని తుది రక్తపు బిందువు మీ యశోరక్షణకు, మీ సార్వభౌమత్వ పరిరక్షణకు అంకితం కాగలదు. యావజ్జీవము, అహర్నిశము, హితుడనై, మీకు విశ్వాసబద్ధుడనై ప్రవర్తింతునని సర్వసామంత మహీపాల మండలాధిపతులు, సమస్త ప్రజానీకములు విచ్చేసిన ఈ సభామధ్యమున శపథము గావించుచున్నాను.

సు: హితుడా! అప్రతిహత వీరవరేణ్యుడవగు నీకు అంగరాజ్యమే కాదు, నా అర్ధసిమ్హాసనార్హత నిచ్చి గౌరవించుచున్నాను.
rAmu(Du) manci bAluDu cinnappaTinuncI intE

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration