Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 7319
Registered: 03-2004
Posted From: 76.122.133.243

Rating: N/A
Votes: 0

Posted on Saturday, February 14, 2015 - 8:19 pm:   

As a TDP Sympathizer, i welcome his comments. Hope CBN read his article.....

ఎన్టీఆర్‌ వంటి మహానుభావుడికే ప్రజల చేతిలో పరాభవం తప్పనప్పుడు చంద్రబాబు ఎంత? అందుకే 2004లో ఆయన ఓడిపోయారు. పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన అష్టకష్టాలు పడ్డారు. అదృష్టం బాగుండటంతోపాటు ముఖ్యమంత్రిగా పాత ట్రాక్‌ రికార్డు కూడా ఉపయోగపడి చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. తాను మారిన మనిషినని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఎన్నో సందర్భాలలో చెప్పుకున్నారు. అయితే, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనలో మళ్లీ కొన్ని పాత వాసనలు పొడచూపుతున్నాయి. పార్టీకి లభించిన విజయాన్ని సమష్టి విజయంగా గుర్తించడానికి ఆయన నిరాకరిస్తున్నారు. తన రెక్కల కష్టం వల్ల మాత్రమే అధికారంలోకి వచ్చామని భావిస్తున్నారు. మనం అని భావించకుండా ‘నేను’ అని భావిస్తున్నారు. పార్టీ సహచరులు, మంత్రివర్గ సహచరులకు అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ ఇవ్వడం లేదు. ‘దునియాకో సున్‌నా, దిల్‌సే కర్నా’ అంటారు. అంటే అందరూ చెప్పేది విని మనస్సుకు నచ్చింది చేయి అని అర్థం. అంతా నాకే తెలుసు అని ఎవరు భ్రమించినా అది అహంకారమే అవుతుంది. ‘నేను’ అన్న భావం నుంచి పక్కకు వచ్చి సమష్టితత్వాన్ని అలవర్చుకుంటే ఫలితాలు కూడా మెరుగ్గా ఉంటాయి. చంద్రబాబు క్యాబినెట్‌లోకానీ, తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికైన వారిలోగానీ అత్యధికులు కొత్తవారే! అంతమాత్రాన వారికి ఏమీ తెలియదని అనుకోవడం పొరపాటు. రెండు రోజుల క్రితం విజయనగరం జిల్లాలోని ఒక సభలో మాట్లాడుతూ ‘మా శాసనసభ్యులకంటే ఇంతకుముందు మాట్లాడిన మహిళలే బాగా మాట్లాడారు’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మహిళలను ప్రోత్సహించడానికి సరదాగా ఆయన ఆ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చుగానీ, అలాంటి వాటివల్ల ఎమ్మెల్యేలు నొచ్చుకోరా? ఉపన్యాసాలు ఇచ్చేవారంతా నాయకులుకారు. ఆ మాటకొస్తే చంద్రబాబు ఉపన్యాసం మాత్రం ఏమంత ఆకట్టుకునే విధంగా ఉంటుంది?

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration