Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 22595
Registered: 08-2008
Posted From: 103.246.92.10

Rating: N/A
Votes: 0

Posted on Tuesday, February 10, 2015 - 1:52 am:   

కోచింగ్ సెంటర్లలో బౌన్సర్లు!

నమస్తే తెలంగాణ, హైదరాబాద్:సీమాంధ్ర హయాంలో ప్రతి రంగమూ భ్రష్టు పట్టిపోయింది. ధనార్జనే ధ్యేయంగా సకల రంగాలను కలుషితం చేశారు. విద్యావ్యవస్థను అధోగతి పట్టించిన సీమాంధ్రులే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది నిరుద్యోగుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని కోచింగ్ సెంటర్ల పేరిట కోట్లు ఆర్జించారు. ఆకర్షణీయ ప్రకటనలు చేసి అభ్యర్థులను ఆకర్షించి ధనార్జన చేసిన కోచింగ్ సెంటర్లు, విఫలమైనవారు నిలదీయకుండా బౌన్సర్ల కాపలా వ్యవస్థ అమలులోకి తెచ్చారు.
-మాఫియాగా మారిన ఉద్యోగ పరీక్షల శిక్షణ కేంద్రాలు
-ఫంక్షన్ హాళ్లల్లో శిక్షణా తరగతులు.. కోట్లలో వ్యాపారం
-సీమాంధ్ర ఐపీఎస్‌లు, ఏసీపీల అండదండలు
-గ్రూప్-1కు రూ.75 వేలు, 2 కు రూ.20 వేలు
-నియంత్రించాలంటున్న విద్యార్థి సంఘాలు
ఎక్కడో క్లబ్లులు, పబ్బుల్లో ఉండాల్సిన బౌన్సర్లు ప్రతి కోచింగ్ సెంటర్‌లో దర్శనమిస్తున్నారు. ఇవాళ గ్రూప్-1 కోసం శిక్షణ ఇవ్వడానికి రూ.75 వేలు, గ్రూప్-2 కోసం 25 వేల రూపాయల చొప్పున ఫీజులు వసూలు చేస్తున్నారు. ఎక్కడైనా అభ్యర్థులు ఏదైనా విషయంలో తేడా కనిపించి అభ్యంతరాలు వ్యక్తం చేస్తే బౌన్సర్లతో కొట్టిస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.

సేవాసంస్థల ముసుగులో..:
సేవాసంస్థల ముసుగులో ప్రారంభిస్తున్నారు. ఐఏఎస్, ఏసీపీల పేర్లను వీటికి వాడుకుంటున్నారు. ప్రతి ఏడాది దాదాపు రూ.1000 కోట్ల టర్నోవర్‌తో విద్యావ్యాపారం చేస్తున్న ఈ సంస్థలు అభ్యర్థులకు కనీసం తగిన వసతి గదులు కూడా సమకూర్చడం లేదు. చివరకు ఫంక్షన్ హాళ్లలో కూడా తరగతులు నిర్వహిస్తున్న సంఘటనలు వెలుగు చూశాయి. జీవితాన్ని మలుపు తిప్పే ఉద్యోగాల కోచింగ్ అంటే శాస్త్రీయంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో 40 మంది లేదా 60 మంది విద్యార్థులకు ఒక తరగతి చొప్పున ఉండాలి. ప్రతి విద్యార్థిపై అధ్యాపకుడు శ్రద్ధ చూపే పరిస్థితి ఉండాలి.

కానీ వేలకు వేలు వసూలు చేస్తున్న ఈ సంస్థలు విద్యార్థులను ఇరుకు గదుల్లో కుక్కి క్లాసులు నిర్వహిస్తున్నాయి. చివరకు కొన్ని కోచింగ్ సెంటర్లు మూడు వేల మంది విద్యార్థులను సమీకరించి ఫంక్షన్ హాళ్లలో మైకు లు పెట్టి క్లాసులు నిర్వహిస్తున్నాయంటే ఈ వ్యాపా రం ఏ దిశగా వెళుతున్నదీ తెలుసుకోవచ్చు. ఫంక్షన్ హాల్‌లో కోచింగ్ ఇచ్చే విధానం బహుశా ప్రపంచం లో ఎక్కడా ఉండదని, అది కేవలం సీమాంధ్ర మాఫియా కోచింగ్ సంస్థలకే చెల్లిందని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులను చేర్చుకునే సమయంలో తమ వద్ద ఉన్న వసతులేమిటి? అధ్యాపకులెవరు? వంటి విషయాలు ఈ సంస్థలు ఎక్కడా చెప్పవు. గత పరీక్షల్లో ఇంతమంది ఎంపికయ్యారు.

అంటూ ఓ కాకి లెక్క చెప్పి బుట్టలో వేసుకుంటాయి. అది నిజమో అబద్ధమో నిర్ధారించుకోవడం విద్యార్థులకు అసాధ్యం. ఇక కీలకమైన అధ్యాపకుల విషయం అంతే. సమయానికి ఎవరు దొరికితే వాళ్లు అన్నట్లుగా వీరి వ్యవహారం ఉంటుంది. నచ్చని విద్యార్థులు ఎదురుతిరిగి డబ్బులు అడిగితే బౌన్సర్లతో కొట్టిస్తున్నారు. సీమాంధ్ర మాఫియా కోచింగ్ సంస్థలకు సీమాంధ్ర ఐపీఎస్, ఏసీపీల అండదండలు పుష్కలమని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కోచింగ్ మోసాలపై నిలదీసినప్పుడు సీమాంధ్ర పోలీస్ అధికారులతో బెదిరించి, వారిపై కేసులు పెట్టిస్తున్న సందర్భాలు ఉన్నాయని పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

నియంత్రణ మరిచిన సీమాంధ్ర ప్రభుత్వాలు..
తెలంగాణలో కొనసాగుతున్న సీమాంధ్ర కోచింగ్ సంస్థలకు ప్రభుత్వ గుర్తింపు లేదు. వారు వేల రూపాయల్లో వసూలు చేస్తున్న అధిక ఫీజులకు కూడా అనుమతి లేదు. అసలు వీటిని నియంత్రించాల్సిన అవసరాన్ని సీమాంధ్ర ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా విస్మరించాయి. ఫలితంగా తమ పబ్బా న్ని గడుపుకున్నాయి. ఉద్యోగార్థులను గాలికి వదిలేశాయి. మరోవైపు పలువురు మాజీ, తాజా ఐఏఎస్, ఐపీఎస్‌లు వీటితో అవినాభావ సంబంధాలు పెట్టుకుని లక్షలు ఆర్జించారు. ఫలితంగా రాష్ట్రంలో కోచింగ్ సెంటర్‌కు అనుమతినిచ్చే విధానమే లేదు. ఏ కోచింగ్‌కు ఎంత ఫీజు వసూలు చేయాలన్న నిబంధన లేదు.

ఫలితంగా వారు ఇష్టం వచ్చినట్లుగా ఫీజులు వసూలు చేస్తున్నారు. నిర్ధిష్టం గా కోచింగ్ ఫాకల్టీ అర్హతలు నిర్ధిష్టంగా లేవు. కనీస అర్హత లేని వారిని ఫాకల్టీగా నియమిస్తున్నారు. దీంతో కోచింగ్ తీసుకున్న వారికి ఉద్యోగాలు వస్తున్నాయన్న గ్యారంటీ లేదు. ఉద్యోగం రాని వారికి తిరిగి ఫీజులు చెల్లించే విధానం లేదు. అసలు ఆయా కోచింగ్ సంస్థలకు ఎవరు అనుమతులు ఇవ్వాలి? ఎవరు నియంత్రించాలి? అన్న దానిపైనా స్పష్టత లేదు. ఫీజుల రూపంలో కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్న కోచింగ్ సంస్థల నుంచి ప్రభుత్వానికి నయా పైసా రావడం లేదు. వారిపై ఎలాంటి పన్నులు లేవు. సేవాసంస్థల పేరుతో విద్యా సొసైటీని రిజిస్టర్ చేయించుకొంటున్నారు. తమ విద్యా వ్యాపారంతో కోట్లు గడిస్తున్నారు.

చివరకు ప్రభుత్వాలను శాసించే స్థాయికి వచ్చారు. ఇటీవల ఉద్యోగాల భర్తీ ఆందోళనకు ఈ కోచింగ్ సెంటర్ల ప్రోత్సాహం ఉందని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. గ్రూప్ పరీక్షా విధానాల్లో సమూల మార్పులు వస్తే తమ పప్పులు ఉడకవని, అది జరగకముందే తమ పబ్బం గడుపుకోవడానికే ఈ కోచింగ్ సెంటర్లు ఆందోళనలను ఎగదోశాయని అంటున్నారు. తమ విద్యా వ్యాపారానికి బీటలు పడకుండా కాపాడుకునేందుకే తెలంగాణ ప్రభుత్వాన్ని కావాలని ఇరకాటంలోకి నెట్టివేయాలన్న కుట్రలు చేస్తున్నట్లు విద్యార్థి సంఘాలు గ్రహించాయి.

కోచింగ్ సంస్థలపై చర్యలు తీసుకోవాలి: ఆంజనేయ గౌడ్
హైదరాబాద్‌లో టీ దుకాణాల కంటే అద్వానంగా గల్లీ, గల్లీలో అడ్డగోలుగా వెలిసిన ఆంధ్రా గ్రూప్ కోచింగ్ సెంటర్లు తెలంగాణ గ్రామీణ, నిరుపేద విద్యార్థులను దోచుకుంటున్నాయని తెరాస నాయకులు, తెలంగాణ బీసీ ఫోరం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆంజనేయగౌడ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శనివారం ఉన్నత విద్యా మండలి వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ మల్లేశంకు వినతి పత్రం అందజేశారు. గ్రూప్-1, గ్రూప్-2, ఎస్‌ఐ, కానిస్టేబుల్ కోచింగ్ పేరుతో వేలాది రూపాయలను నిరుపేదల నుంచి వసూలు చేస్తున్నారన్నారు. ఫంక్షన్ హాళ్లలో కోచింగ్ అశాస్త్రీయమన్నారు. ఆర్‌సీ రెడ్డి, లక్ష్య, వంటి కోచింగ్ సంస్థలతో పాటు వందల కోచింగ్ సెంటర్లు దోపిడి కేంద్రాలుగా మారాయని ధ్వజమెత్తారు.

ఆదాయపు పన్ను ఎగ్గొడుతూ.. ప్రభుత్వ ఖజానాకు గండికొడుతూ హైదరాబాద్‌లో కోచింగ్ సంస్థల యాజమాన్యాలు విద్యా మాఫియాగా మారాయని ఆయన మండిపడ్డారు. మరోవైపు సిలబస్ మార్పు, నోటిఫికేషన్ల అంశాలపై అసత్యాలు ప్రచారం చేయిస్తూ, తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగులను గందరగోళంలో నెట్టి వేస్తున్నారని విమర్శించారు.

గతం లో సీమాంధ్ర సీఎంలు, వారి అనుచరుల అండదండలతో కొన్ని ఆంధ్రా కోచింగ్ సెంటర్లు గ్రూప్,1, 2 ప్రశ్నా పత్రాలను లీక్ చేసి కోట్ల రూపాయలు ఆర్జించారన్న ఆరోపణలు ఉన్నాయన్నారు. ఇలాంటి అరాచకాలకు అడ్డాలుగా మారుతున్న సీమాంధ్ర మాఫి యా కోచింగ్ సంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బీహర్‌లో మాదిరిగా కోచింగ్ సెంటర్ల ఏర్పాటుకు అనుమతులు, ఫీజుల నియంత్రణకు చట్టం తేవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఓయూ, జెఎన్‌టీయూ హెచ్ విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లుతాం: ఉన్నత విద్యా మండలి వైస్ ఛైర్మన్
కోచింగ్ సంస్థల అరాచకాలపై విద్యార్థి సంఘాల ఆరోపణలను పరిగణనలోకి తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ మల్లేశం అన్నారు. ఈ విషయంపై విద్యా మండలి ఛైర్మన్‌తో చర్చించి, డిప్యూటీసీఎం కడియంశ్రీహరి దృష్టికి అవసరమైతే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లుతామన్నారు. కోచింగ్ సంస్థలను కచ్చితంగా నియంత్రించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration