Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Mrbezawada
Pilla Bewarse
Username: Mrbezawada

Post Number: 33
Registered: 10-2011
Posted From: 205.172.134.23

Rating: N/A
Votes: 0

Posted on Thursday, December 18, 2014 - 2:49 pm:   

‘అత్త లేని కోడలు ఉత్తమురాలు ఓయమ్మా..కోడలు లేని అత్త గుణవంతురాలు...’ ఈ జానపద గీతం చాలామంది వినే ఉంటారు. ఈ పాటలో అత్తాకోడళ్ల మధ్య ఉన్న బంధాన్ని గీత రచయిత ఎంతో నర్మగర్భంగా చెప్పారు. కొడుకు పెళ్లి ఎప్పుడవుతుందా అని తొందరపడే తల్లి పెళ్లయిన క్షణం నుంచీ కోడలు కొడుకును తనకు కాకుండా చేస్తుందనే అభద్రతా భావానికి గురవుతుంటుంది. తల్లి చెప్పినట్టు వింటే భర్త తనకు కాకుండా పోతాడేమోనని మరోవైపు భార్య భయపడుతుంటుంది. దీంతో అత్తగారింట్లో అడుగుపెట్టిన కొద్దికాలంలోనే అత్తాకోడళ్ల మధ్య దూరం పెరుగుతుంది. ఇద్దరూ ఉత్తర ధృవం, దక్షిణ ధృవాలకు మల్లే ఉంటారు.

సైకలాజికల్‌ సమస్య..
--------------------------
ఎన్ని తరాలు గడిచినా అత్తా కోడళ్ల బంధం సంక్లిష్టంగానే ఉండడానికి కారణం మనస్తత్వ సంబంధమైన(సైకలాజికల్‌) సమస్యలెన్నో దీని వెనుక దాగుండడమే. అత్తాకోడళ్లు మంచి స్నేహితులుగా ఉండలేరా అంటే అదేమీ అసాధ్యమైన విషయం కాదు. ఎంతో స్నేహంగా జీవిస్తున్న అత్తాకోడళ్లు మన మధ్యన లేకపోలేదు. కానీ వీరిరువురి మధ్య స్నేహపూరిత వాతావరణం ఉండాలంటే సఖ్యత, పరస్పర అవగాహన ఉండాలి. ఇందుకోసం ఇద్దరూ మానసికంగా ఎంతో కసరత్తు చేయాలి. కానీ ఇలాంటి ప్రయత్నం ఎంతమంది అత్తాకోడళ్లు చేస్తున్నారని ప్రశ్నించుకుంటే సంతృప్తికరమైన సమాధానం లభించదు.

పెళ్లయిన తర్వాత బాధ్యతలెన్నో...
----------------------------------------
పెళ్లి చేసుకోబోయే అమ్మాయి భావి జీవితం ఎన్నో బాధ్యతలతో కూడుకుని ఉంటుంది. ముఖ్యంగా కొత్త ఇంట్లో కోడలుగా కాలుపెట్టిన అమ్మాయి అందరినీ కలుపుకు పోవాలి. అందులోనూ అత్తతో ఆమె మెలిగే తీరును ఎందరో ఆసక్తిగా గమనిస్తారు. కొత్తగా తలకెత్తుకున్న కుటుంబ బాధ్యతలను అత్తామామలు మెచ్చేలా, భర్తతో స్నేహమైన జీవితం కొనసాగేలా నిర్వహించడమంటే కోడళ్లకు కత్తిమీద సాములాంటిదే. ఇంకోవైపు వాళ్లు ఉద్యోగ బాధ్యతలను కూడా సరిగా నిర్వహించాలి .భార్యకు, తల్లికి మధ్య సత్సంబంధాలు ఉండడానికి కొడుకు కూడా తన వంతు కృషిచేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా వారి మధ్య ఎక్కువ తక్కువలు ప్రదర్శించకుండా ఇద్దరినీ సమానంగా చూడాలి.
అత్త సహజంగా తానే ఇంటికి పెద్దనని, తాను చెప్పినట్టే కోడలు వినాలని అనుకుంటుంది. అత్త ప్రవర్తన, ఆధిక్య ధోరణులు కోడలికి నచ్చకపోవచ్చు. చాలా సందర్భాలలో వీరిద్దరి మధ్యలో కొడుకు నలిగిపోతుంటాడు కూడా. కొడుకు సరైన సంధానకర్తగా వ్యవహరించకపోవడం వల్ల కూడా అత్తాకోడళ్ల మధ్య సమస్యలు తలెత్తుతుంటాయి. పరిస్థితులు చేయి దాటిపోతే అత్తమామల నుంచి విడిపోయి వేరు కాపురాలు పెడదామని భార్య ఒత్తిడి తెస్తుంది. సమాజంలో న్యూక్లియర్‌ కుటుంబ వ్యవస్థ బలపడడం కూడా అత్తాకోడళ్ల బంధం బలహీనపడడానికి ఒక కారణమంటారు కొందరు. నిజానికి ఇక్కడ ఉన్న అసలు సమస్య ఏమిటంటే వీరిద్దరికీ అత్తా, కోడళ్ల పాత్రలు కొత్తవే. అలాంటప్పుడు కొత్త బంధం ఎలా నిలుపుకోవాలన్నది ఇద్దరికీ కొరుకుడుపడని సమస్యే.

పాజిటివ్‌ ఆలోచన అవసరం...
----------------------------------------
వీరిద్దరూ ఒకరిపట్ల మరొకరు పాజిటివ్‌ ఆలోచనలతో మెలగాలి. ఒకరినొకరు సర్దుకుపోవాలి. తల్లి కొడుకుల మధ్య బంధాన్ని కోడలు అర్థంచేసుకోవాలి. అలాగే అత్త కూడా తానూ ఒకప్పుడు కోడలే కాబట్టి కోడలి మనసులోని ఆరాటం ఏమిటో గ్రహించి తదనుగుణంగా పెద్దరికంతో వ్యవహరించాలి. అత్త కూడా అమ్మలాంటిదేనని కోడళ్లూ అనుకోవాలి. ఇంటి విషయాల్లో అత్త అభిప్రాయం తీసుకోవడం, ఆమెకు తగిన స్థానం ఇవ్వడం, ఆమెపట్ల సున్నితంగా ప్రవర్తించడం కోడలు చేయాలి. ఇలా చేయడం వల్ల అత్త మనసులో గూడుకట్టుకున్న అభద్రతా భావం పోతుంది. తన కొడుకు తనకు దూరమవుతాడన్న భయం ఆమెకి ఉండదు.

సమయం పడుతుంది...
----------------------------------------
పెళ్లయిన తర్వాత కూడా కొడుకు పనులను తానే చేయాలని తల్లి అనుకుంటుంది. భర్త పనులు తానే చేయాలని కోడలు కోరుకుంటుంది. ఇందువల్ల కూడా వీరి మధ్య ఘర్షణలు తలెత్తుతాయి. కోడలు గురించి కొడుక్కు తల్లి నేరాలు చెప్పడం, తల్లిపై భార్య భర్తకు నేరాలు చెప్పడం వల్ల కూడా అత్తాకోడళ్ల బంధం బలహీనపడుతుంది. అత్తా కోడళ్లు ఇద్దరూ ఆరోగ్యకరమైన రీతిలో తమ సంబంధాలను సాగించాలి. మారిన జీవన పరిస్థితులకు అనుగుణంగా కౌటుంబికంగా, సామాజికంగా అత్తాకోడళ్లు ఇరువురూ ఒకరికొకరు అండగా నిలబడాలి. అందుకే అత్తాకోడళ్ల బంధం చాలా క్లిష్టమైంది. మరెంతో ప్రత్యేకమైనది కూడా. వీరిరువురు తమ పరిధిల్లోంచి ఈ అనుబంధాన్ని కొనసాగిస్తే తల్లికొడుకుల బంధం, భార్యాభర్తల బంధం రెండూ పచ్చగా నూరేళ్లు సాగుతాయి.
తానే ఇంటికి పెద్దనని, తాను చెప్పినట్టే కోడలు వినాలని అత్త అనుకుంటుంది. ఆమె ప్రవర్తన, ఆధిక్య ధోరణులు కోడలికి నచ్చకపోవచ్చు. చాలా సందర్భాలలో వీరి మధ్య కొడుకు నలిగిపోతుంటాడు. సరైన సంధానకర్తగా కొడుకు వ్యవహరించకపోవడం వల్ల కూడా అత్తా కోడళ్ల మధ్యలో సమస్యలు తలెత్తుతాయి.
మన కుటుంబవ్యవస్థలో అత్తాకోడళ్ల బంధం చాలా ప్రధానమైంది. కొడుకు కేంద్రంగా అత్తా, కోడళ్ల మధ్య సాగే ఈ బంధం సాఫీగా సాగిన సందర్భాలు అపురూపమనే చెప్పాలి. ఇన్ని తరాలైనా వీరిరువురి మధ్య ఉన్న బంధం సన్నిహిత అనుబంధంగా ఎదగకపోవడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి.
Bezawada Bewarse Batchey

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration